- మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపో ఎదుట టీఎంయూ ఆధ్వర్యంలో ధర్నా
మహబూబ్‌నగర్: జిల్లాలో ఆర్టీసీలో పని చేస్తున్న కార్మికుల శ్రమను అపహాస్యం చేస్తే ఏమాత్రం సహించమని టీఎంయూ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జీఎంల్ గౌడు అన్నారు. ఆర్టీసీ ఆర్‌ఎం, డిప్యూటీ సీటీఎం ఇద్దరు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని దానిని నిరసిస్తూ బుధవారం ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు ఆర్‌ఎం, డిప్యూటీ సీటీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల మనోస్థైర్యం దెబ్బతీయడానికి అధికారులు మాట్లాడుతున్నారని ఇలాంటి సమయంలో కార్మికులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్మిక సంఘాలు, యాజమాన్యలు ఐక్యంగా ఉన్నప్పుడే ఆర్టీసీ అభివృద్ధి జరుగుతుందన్నారు.
జిల్లాలో సిబ్బంది బదిలీలు పూర్తి స్థాయిలో జరగలేదని వెంటనే బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. డిపోలలో కొన్ని క్యాటగిరిలలో పనిచేస్తున్న సిబ్బందికి పదోన్నతులు కల్పించాలని కోరారు. జిల్లాలో వెంటనే కారూణ్య నియామకాలు వెంటనే చేయాలని, డబుల్ డ్యూటీ చేస్తున్న వారికి డబుల్ జీతం చెల్లించాలన్నారు. అధికారుల వైఖరి మార్చుకోకపోతే నవంబర్2న జిల్లాలో ఉన్న అన్ని డిపోల ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఛైర్మన్ బసప్ప, అధ్యక్షుడు రవీంధర్‌రెడ్డి, జోనల్ కార్యదర్శి అహ్మద్‌ఖాన్, డిపో అధ్యక్ష, కార్యదర్శులు కుర్మయ్య, బీహెచ్ కుమార్, జిల్లా ప్రచార కార్యదర్శి భానుప్రకాష్‌రెడ్డి, గ్యారేజ్ అధ్యక్ష, కార్యదర్శులు సత్యం, వెంకటయ్య, డిపో ప్రచార కార్యదర్శి కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.
'కార్మికులను అపహాస్యం చేస్తే సహించం'
Published Wed, Oct 28 2015 6:26 PM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM
Advertisement