సత్తుపల్లి స్వచ్ఛంద బంద్
• తొలిరోజు ప్రశాంతం.. నేడు కూడా
• ఆర్టీసీ, బ్యాంక్‌లకు మినహారుుంపు
సత్తుపల్లి : సత్తుపల్లి జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో జేఏసీ తలపెట్టిన 48 గంటల సత్తుపల్లి పట్టణ బంద్ తొలిరోజు బుధవారం ప్రశాంతంగా జరిగింది. దుకాణాలు, హోటళ్లు, సినిమా హాళ్లు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసి వేశారు. పట్టణంలో మోటారు సైకిళ్లతో ప్రదర్శన చేశారు. అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కొత్తనోట్లతో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా బ్యాంకులను బంద్ నుంచి మినహారుుంచారు.
ఆర్టీసీ డిపో ఎదుట ఉద్రిక్తత...
సత్తుపల్లి ఆర్టీసీ డిపో వద్ద జేఏసీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4 గంటలకు బస్సులను బయటకు రాకుండా ఆందోళనకారులు బైఠారుుంచారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణ సీఐ రాజేంద్రప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో బస్సులు యథావిధిగా నడిచారుు.
మద్దతు తెలిపిన మాజీ మంత్రి...
సత్తుపల్లి జిల్లా సాధన కోసం ఉద్యమిస్తున్న జేఏసీ నేతలకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తెలిపారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ చిత్తలూరి ప్రసాద్, కూకలకుంట రవి, ఉడతనేని అప్పారావు, గంగిశెట్టి ప్రసాద్, గాదిరెడ్డి సుబ్బారెడ్డి, కొర్రపాటి సాల్మన్‌రాజు, వనమా వాసు, ఎస్‌కే రఫీ(మోనార్క్), పసుమర్తి గోపాలరావు, ఎం.ఫయాజ్‌అలీ, కూసంపూడి రామారావు, ఎండీ మున్వర్ హుస్సేన్, పరెడ్ల సత్యనారాయణరెడ్డి, బండి వెంకటరెడ్డి, రఘుపతిరెడ్డి, తేళ్లూరి ఆడమ్స్, ఐ.కృష్ణ, కూసంపూడి మహేష్, దూదిపాల రాంబాబు, గాదిరెడ్డి సుబ్బారెడ్డి, పింగళి సామేలు, జూపాటి పాపారావు, గొర్ల సంజీవరెడ్డి, ఎండి అమీరుద్దీన్, గాదె చెన్నారావు, తన్నీరు జమలయ్య, ఎల్‌ఎస్ రెడ్డి, అద్దంకి అనిల్, చాంద్‌పాషా, వన్నెంరెడ్డి సాగర్ పాల్గొన్నారు.