గాయాలైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని అంబులెన్స్‌లో తరలిస్తున్న దృశ్యం
జనగామ: బతుకు దెరువు కోసం ఔట్ సోర్సింగ్ ద్వారా బస్ డిపోలో పనిచేస్తున్న యువకుడు బస్సు టైరు పేలిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలైన సంఘటన మంగళవారం జనగామ ఆర్టీసీ డిపోలో జరిగింది. బస్సును క్లీన్ చేస్తు ండగా జరిగిన ప్రమాదంలో కుడి చేయి.. కన్ను పోయే పరిస్థితి నెలకొనగా.. తలకు బలమైన గా యాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా శారా జీపేటకు చెందిన పుట్టల రత్నం కుమారుడు స్వా మి అలియాస్ పవన్ జనగామ ఆర్టీసీ డిపోలో ఆరు సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ ద్వారా వాషి ంగ్ పనిచేస్తున్నాడు. తెల్లవారుజామున బస్సును క్లీన్‌చేస్తుండగా టైరు పేలి పెద్ద శబ్ధం వినిపించింది. దీంతో అక్కడే ఉన్న కార్మికులు హుటాహుటిన బ స్సు వద్దకు చేరుకున్నారు.
అప్పటికే రక్తం మడుగులో అపస్మారక స్థితిలో పడిపోయిన స్వామిని చూసి ఆందోళనకు గురయ్యారు. కుడిచేయి మూడు ముక్కలు కాగా, కన్ను పూర్తిగా దె బ్బతిని, తలకు తీవ్రగాయాలతో పడి ఉన్న ఉద్యోగిని, జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్సలు నిర్వహించి, పరిస్థితి విషమంగా మారడంతో వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. బతుకు దెరువు కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న స్వామిని విధి వక్రీకరించడంతో తోటి కార్మికులు కన్నీళ్ల పర్యంతమయ్యారు.
కాలం చెల్లిన టైర్లు..
లాభార్జనే ధ్యేయంగా బస్సు సర్వీసులను నడిపిస్తూ కార్మికుల ప్రాణాల మీదకు తీసుకు వస్తున్నారా..? లేదా ప్రమాదవశాత్తు టైరు పేలిందా అనే దానిపై విచారణ చేయాల్సి ఉంది. కాలం చెల్లిన టైర్లను మార్చకుండా నడిపిస్తుండడంతో హేయిర్ వస్తూ పేలుతున్నాయని పలువురు కార్మికులు అనుకుంటున్నట్లు తెలుస్తుంది. టైర్లు వైర్లు తేలే వరకు నడిపించడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డిపోలో ఇంకెన్ని కాలం చెల్లిన టైర్లు ఉన్నాయనే దానిపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. గాయాలపాలై ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న స్వామికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించి, భద్రత కల్పించాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment