కారుచీకట్లో కామాంధుని క్రూరత్వం | Sexual assault on woman | Sakshi
Sakshi News home page

కారుచీకట్లో కామాంధుని క్రూరత్వం

Published Mon, Feb 15 2016 9:35 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

కారుచీకట్లో కామాంధుని క్రూరత్వం - Sakshi

కారుచీకట్లో కామాంధుని క్రూరత్వం

అర్ధరాత్రి మరాఠీ మహిళపై లైంగిక దాడి
కోరిక తీర్చుకుని ఆపై గాయపర్చిన కామాంధుడు
బాధితురాలిని ఒంగోలు హోమ్‌కు తరలించిన కార్మికులు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నిందితుని అకృత్యం
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా కనిగిరి ఆర్టీసీ డిపో

 
 అర్ధరాత్రి.. ఆర్టీసీ డిపో ఆవరణలో ఒంటరిగా ఉన్న మహిళ.. పైగా చిమ్మ చీకటి.. ఓ కామాంధుడి కన్ను ఆమెపై పడింది. ఆకలితో అలమంటిచే ఆ మహిళను ఆ మానవ మృగం మాయమాటలు చెప్పి లొంగదీసుకుంది. పలుమార్లు పశువాంఛ తీర్చుకుని రాక్షసునిలా ప్రవర్తించింది. అంతటితో ఆగకుండా కొరికి గాయపర్చి వదిలేసింది. ఈ పైశాచిక ఘటన కనిగిరిలో ఆలస్యంగా వెలుగు చూసింది.
 - కనిగిరి
 
 నాగపూర్ ప్రాంతానికి చెందిన మహిళను నాలుగు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు కనిగిరి ఆర్టీసీ డిపో ఆవరణలో వదిలి వెళ్లారు. ఓ రోజు చీకటి పడిన తర్వాత అర్థంకాని భాషతో మాట్లాడే ఆ మహిళకు ఓ మృగాడు ఆన్నం ఆశ చూపాడు. చీకట్లోకి తీసుకెళ్లి పశువులా వ్యవహరించాడు. మద్యం తాగిన మత్తులో రాక్షసుడిలా మారి పలుమార్లు కోరిక తీర్చుకుని వదిలేశాడు. తెల్లవారు జామున మరో మృగాడి కన్ను ఆ బాధిత మహిళపై పడింది. ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటాన్ని గమనించిన కార్మికులు.. అతడిని మందలించి పంపారు.
 
  ఆదివారం కనిగిరి డిపో గేటు మూలన కూర్చొని ఏడుస్తూ.. శరీరం, చేతిపై ఉన్న గాయాలు చూపిస్తూ ఆ మహిళ కన్నీటి పర్యంతమవ్వడాన్ని కార్మికులు గమనించి చలించిపోయూరు. వెంటనే ఆమెకు టిఫిన్ పెట్టించి ఓదార్చారు. వెంటనే స్థానిక ఐసీడీఎస్ కార్యాలయూనికి సమాచారం అందించారు. ఐసీడీఎస్ అధికారులు స్పందించి ఒంగోలు చైల్డ్‌లైన్ ప్రతినిధి సాగర్‌కు తెలియజేశారు. స్వచ్ఛంద సంస్థ నిర్వహించే ఆర్టీసీ కార్మికుడు మారాఠి మహిళను ఆర్టీసీ బస్సులో ఒంగోలు తీసుకెళ్లారు. చైల్డ్‌లైన్ ప్రతినిధి సాగర్, స్వచ్ఛంద సంస్థ నిర్వహించే ఆర్టీసీ కండక్టర్ కలిసి ఆమెను ఒంగోలులోని ఓ హోమ్‌లో చేర్పించారు.
 
 మందుబాబుల కేరాఫ్ ఆర్టీసీ డిపో
 కనిగిరి ఆర్టీసీ డిపో ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గతంలో ఇదే డిపో ప్రాంగణంలో డ్యూటీ దిగి వెళ్తున్న మహిళా ఉద్యోగులపై దాడులు జరిగిన సంఘటనలున్నాయి. డిపోలో చీకటి పడితే మందుబాబుల చిందులు, కేరింతలు షరా మామూలయ్యాయి. కార్మికులతో పాటు కొందరు బయట వ్యక్తులు డిపో ఆవరణలోని చీకటి ప్రాంతాల్లో మద్యం తాగుతూ పార్టీలు చేసుకుంటున్నారు. డిపో ప్రధాన గేటుకు ఇరువైపులా, చెట్ల కింద, చీకటి ప్రదేశాల్లో మద్యం ఖాళీ బాటిళ్లు బారు షాపుల్లోలా దర్శనమిస్తున్నాయి.
 
 మద్యం షాపూ అక్కడే

 డిపోకు ఎదురుగా బ్రాందీ షాపు నిత్యం తెరిచే ఉంటుంది. దీని వల్లే బస్టాండ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. చీకటి పడితే ఆ ప్రాంతంలో మహిళలు ఒంటరిగా నడిచే పరిస్థితి లేదు. రాత్రి పూట డ్యూటీలు ముగించుకుని మహిళా ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు. ఇక కుర్రాళ్లు మద్యం తాగి బైకులపై డిపో ఆవరణలో హల్‌చల్ చేస్తుంటారు. మద్యం మత్తులో మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు ఏదైనా సంఘటన జరిగినప్పుటు కాస్త హడావుడి చేసి మళ్లీ పట్టించుకోకపోవడం కూడా నేరస్తులకు కలిసి వస్తోంది.
 
 ఆ మహిళ..హోమ్‌లో క్షేమంగా ఉంది: బీవీ సాగర్, చైల్డ్‌లైన్ ప్రతినిధి
 ఆ మహిళను ఒంగోలులోని ఓ హోమ్‌లో ఉం చాం. ఆమె ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంది. హోమ్ నిర్వాహకుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నాం. ఆమె మానసిక స్థితి సరిగానే ఉంది. మరాఠీ భాష వచ్చిన వారితో మాట్లాడించి ఆమె పూర్తి వివరాలు తెలుసుకుంటాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement