సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పెథాయ్ తుపాన్ కన్నెర్ర చేసింది. తుపాన్ ప్రతాపానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కూడు,గూడూ,బట్ట లేక అన్నమో రామచంద్రా అంటూ బోరున విలపిస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ పునరావాస కేంద్రాల్లో రెండు రోజుల నుంచి మంచినీరు, భోజనం లేక తుపాను బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోడూరు మండలం పాలకాయతిప్ప సహాయ కేంద్రాల్లో ఉన్న బాధితులను ఆదివారం పరామర్శించడానికి వచ్చిన జిల్లా ఎస్పీ సర్వేష్ఠ త్రిపాఠి వద్ద వారి బాధలను వెళ్లబోసుకున్నారు.
ప్రభుత్వం కనీసం మంచినీరు కూడా అందిచలేకపోతుందని, రెవిన్యూ సిబ్బంది అందుబాటులో లేకుండా పోయిందని వారు అవేదన వ్యక్తం చేశారు. తుపాను దాటికి పిల్లల నుంచి పెద్దల వరకు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సహాయ చర్యలను చేపట్టడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యరని తుపాను బాధితులు వాపోయారు. పంటలు నష్టపోయి, ఉండడానికి ఇళ్లు, తినడానికి తిండిలేకపోయినా తమను పట్టించుకునే నాథుడే కరువైయ్యారని ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment