అవనిగడ్డ పేరు చిరస్థాయిగా...
అవనిగడ్డ, చిరస్థాయి, పుష్కరఘాట్, కృష్ణా పుష్కరాలు
కొత్తపేట(అవనిగడ్డ):
స్థానిక కొత్తపేటలో ఏర్పాటు చేసిన అవనిగడ్డ పుష్కరఘాట్ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. నియోజకవర్గంలోనే అతి పెద్ద ఘాట్‌గా పేరొందిన ఈ ఘాట్‌ని రూ.65 లక్షలతో అభివృద్ధి చేశారు. రూ.27 లక్షలతో పాతఘాట్‌ని ఆనుకుని 40 అడుగుల పొడవుతో కొత్తపుష్కరఘాట్‌ని నిర్మించగా, రూ.25 లక్షలతో ఫ్లాట్‌ఫాంని ఏర్పాటుచేశారు. రూ.11 లక్షలతో ఘాట్ మొత్తం టైల్స్‌ని ఏర్పాటు చేశారు. ఘాట్ పైభాగంలో ఇంగ్లీష్‌లో అవనిగడ్డ అక్షరాలతో చేసిన డిజైన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. మరో రెం డు లక్షలతో మెయింటెన్స్ పనులు చేశారు. మోపిదేవి మండలం నాగాయతిప్ప నుంచి 1929లో కృష్ణానదిని మహాత్మాగాంధీ దాటుకుని కొత్తపేట మీదుగా వచ్చి దివి సీమలో పలు ప్రాంతాల్లో పర్యటించారు.అందుకు గుర్తుగా ఈ ఘాట్ వద్ద ఎడమవైపున గాంధీజీ విగ్రహం కుడివైపున కృష్ణవేణి విగ్రహాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు.