Puskaraghat
-
తొక్కిసలాటపై కమిషన్ గడువు మళ్లీ పెంపు
విచారణను నాన్చుతున్న ప్రభుత్వం సాక్షి, రాజమహేంద్రవరం: గతేడాది జూలై 14వ తేదీన గోదావరి పుష్కరాల మొదటి రోజు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం మరో ఎత్తుగడకు దిగుతోంది. ఘటనపై విచారణ కోసం నియమించిన జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ గడువును గురువారం రెండోసారి పొడిగించింది. నాటి ఘటనలో 29 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఘటనకు సీఎం చంద్రబాబే కారణమని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఏక సభ్యకమిషన్‌ను నియమించింది. 2016 మార్చి 29న నివేదిక ఇవ్వాలని గడువు విధిస్తూ.. కమిషన్‌కు ప్రభుత్వ శాఖలు ఆధారాలు సమర్పించకుండా జాప్యం చేయించింది. దీంతో కలెక్టర్ విజ్ఞప్తి మేరకు జూన్ 29 వరకు 3 నెలలు గడువు పెంచుతూ నెల తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ పలుమార్లు విచారణ చేపట్టింది. అఫిడవిట్ దాఖలు చేసిన వారు సాక్ష్యాలు కమిషన్‌కు సమర్పించారు. ప్రభుత్వ శాఖలు సమర్పించ లేదు. విచారణలో ఏఏ శాఖలు ఆధారాలు సమర్పిస్తాయో తెలపాలని కమిషన్ ఆదేశించడంతో కలెక్టర్ తొమ్మిది శాఖల పేర్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29 వరకు గడువు పొడిగించారు. -
అవనిగడ్డ పేరు చిరస్థాయిగా...
అవనిగడ్డ, చిరస్థాయి, పుష్కరఘాట్, కృష్ణా పుష్కరాలు కొత్తపేట(అవనిగడ్డ): స్థానిక కొత్తపేటలో ఏర్పాటు చేసిన అవనిగడ్డ పుష్కరఘాట్ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. నియోజకవర్గంలోనే అతి పెద్ద ఘాట్‌గా పేరొందిన ఈ ఘాట్‌ని రూ.65 లక్షలతో అభివృద్ధి చేశారు. రూ.27 లక్షలతో పాతఘాట్ని ఆనుకుని 40 అడుగుల పొడవుతో కొత్తపుష్కరఘాట్ని నిర్మించగా, రూ.25 లక్షలతో ఫ్లాట్‌ఫాంని ఏర్పాటుచేశారు. రూ.11 లక్షలతో ఘాట్ మొత్తం టైల్స్‌ని ఏర్పాటు చేశారు. ఘాట్ పైభాగంలో ఇంగ్లీష్‌లో అవనిగడ్డ అక్షరాలతో చేసిన డిజైన్ విశేషంగా ఆకట్టుకుంటోంది. మరో రెం డు లక్షలతో మెయింటెన్స్ పనులు చేశారు. మోపిదేవి మండలం నాగాయతిప్ప నుంచి 1929లో కృష్ణానదిని మహాత్మాగాంధీ దాటుకుని కొత్తపేట మీదుగా వచ్చి దివి సీమలో పలు ప్రాంతాల్లో పర్యటించారు.అందుకు గుర్తుగా ఈ ఘాట్ వద్ద ఎడమవైపున గాంధీజీ విగ్రహం కుడివైపున కృష్ణవేణి విగ్రహాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
పుష్కరఘాట్‌లో పడి బాలుని మృతి
గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని సాగరమాత ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన ఒక బాలుడు పుష్కరఘాట్‌లో పడి మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. మాచర్ల శివారులోని బొంగరాలబీడు ప్రాంతానికి చెందిన జాన్సన్(14) కుటుంబసభ్యులతో కలిసి సాగరమాత దర్శనానికి వచ్చాడు. దర్శనానికి ముందు పుష్కరఘాట్‌లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందాడు. -
అంచనాలను మించి భక్తుల రాక
పుష్కరఘాట్ (కొవ్వూరు) : గోదావరి పుష్కరాలకు అంచనాలకు మించి భక్తులు వచ్చినట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. శుక్రవారం ఆమె ఎమ్మెల్యే కేఎస్ జవహర్‌తో కలసి బోటు ద్వారా పట్టణంలోని పుష్కర ఘాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన 11 రోజులుగా కోటీ 33 లక్షల మంది భక్తులు జిల్లాలో పుణ్యస్నానాలు ఆచరించారన్నారు. గురువారం వరకు జిల్లాలో కోటీ 20 లక్షల మంది భక్తులు స్నానాలు ఆచరించగా శుక్రవారం మరో 13 లక్షల మంది భక్తులు స్నానాలు చేసినట్టు ఆచరించినట్టు మంత్రి తెలిపారు. పుష్కరజ్యోతిని విజయవంతం చేయాలి పుష్కరాల ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం జరిగే పుష్కరజ్యోతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాటించి విజయవంతం చేయాలని మంత్రి పీతల సుజాత కోరారు. శుక్రవారం ఆమె కొవ్వూరు వీఐపీ ఘాట్‌లో పుష్కర ఏర్పాట్లపై భక్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పుష్కరజ్యోతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటింటా దీపారాధన చేపట్టాలన్నారు. పుష్కరాలు విజయవంతంగా జరగడానికి ప్రజలు, అధికారులు, పాత్రికేయులు పూర్తి సహకారం అందించినట్టు మంత్రి సుజాత తెలిపారు. పుష్కరాల ఆఖరిరోజైన శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కరస్నానానికి వస్తారని, వారి కోసం ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు మంత్రి చెప్పారు. పుష్కరాల ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసిందని సుజాత తెలిపారు. -
ఏపీలో గ్రామీణ ఘాట్లకు పోటెత్తిన భక్తులు
పశ్చిమ గోదావరివైపు తరలిన భక్తజనం * పలచబడ్డ వీఐపీలు.. వీవీఐపీలు * రాజమండ్రిలో తగ్గిన భక్తుల రద్దీ * పుష్కరఘాట్ తొక్కిసలాట దుర్ఘటన ప్రభావం సాక్షి, రాజమండ్రి, కొవ్వూరు: పుష్కరాల తొలి రోజున రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ప్రభావం రెండోరోజు కనిపించింది. రాజమండ్రికి భక్తుల తాకిడి అనూహ్యంగా తగ్గింది. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకూ ఘాట్లు కాస్త రద్దీగా కనిపించాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మెజార్టీ ఘాట్ల వద్ద రద్దీ పెద్దగా కనిపించలేదు. రాజమండ్రి పరిసర ప్రాంతాల ఘాట్లకు భక్తుల తాకిడి తగ్గినా.. గ్రామీణ ఘాట్లకు జనం భారీగానే తరలి వెళ్లారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఘాట్ల వైపు మొగ్గుచూపారు. అలాగే బుధవారం అమావాస్య కావడంతో పుణ్యస్నానాలకు వచ్చే భక్తుల సంఖ్య కాస్త తగ్గింది. తొలి రోజు పుష్కరఘాట్‌లో సుమారు 3.5 లక్షల మంది, కోటిలింగాల రేవులో 4.2 లక్షల మంది స్నానమాచరించగా, రెండోరోజు ఆ సంఖ్య 2 లక్షలలోపే ఉందని తెలుస్తోంది. మొత్తమ్మీద బుధవారం సాయంత్రానికి అందిన సమాచారం మేరకు జిల్లా పరిధిలో సుమారు 12 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. వీరిలో నగర పరిధిలో 6.58 లక్షల మంది, గ్రామీణ ఘాట్లలో 5.40 లక్షల మంది స్నానాలు చేశారు. తొక్కిసలాట నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి వరకూ సీఎం, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులంతా ఘాట్ల వద్దే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. ప్రముఖులు కొందరే.. రాజమండ్రి వీఐపీ ఘాట్‌కు తొలి రోజుతో పోలిస్తే వీఐపీలు, వీవీఐపీల తాకిడి తగ్గింది. సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి సిసోడియా, ఎంపీ వి.హనుమంతరావు, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పుణ్యస్నానాలు ఆచరించారు. ‘పశ్చిమ’కు జన వరద పశ్చిమగోదావరి జిల్లాకు భక్తుల రాక పెరిగింది. కొవ్వూరు గోష్పాదం ఘాట్‌లో బందోబస్తు, పోలీసు భద్రతా పరిస్థితిని ఏపీ డీజీపీ జేవీ రాముడు పరిశీలించారు. ఏపీ మంత్రి పి.మాణిక్యాలరావు కొవ్వూరులోని పుష్కర ఘాట్లను పరిశీలించారు. రెండో రోజు జిల్లాలోని 97 ఘాట్లలో 10.86 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. కొవ్వూరు, నరసాపురం పట్టణాల్లో పోలీసు యంత్రాంగం డ్రోన్ కెమెరాల సాయంతో నిరంతర నిఘా కొనసాగించారు. నరసాపురంలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పుణ్యస్నానమాచరించి, పితృదేవతలకు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు.