గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని సాగరమాత ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన ఒక బాలుడు పుష్కరఘాట్‌లో పడి మృతిచెందాడు.
గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని సాగరమాత ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన ఒక బాలుడు పుష్కరఘాట్‌లో పడి మృతిచెందాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. మాచర్ల శివారులోని బొంగరాలబీడు ప్రాంతానికి చెందిన జాన్సన్(14) కుటుంబసభ్యులతో కలిసి సాగరమాత దర్శనానికి వచ్చాడు. దర్శనానికి ముందు పుష్కరఘాట్‌లో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందాడు.