
ప్రతికాత్మక చిత్రం
విజయవాడ: అవనిగడ్డ ఆర్టీసీ బస్టాండ్ వద్ద నాంచారమ్మ అనే వృద్ధురాలి ఆభరణాలు చోరీకి గురయ్యారు. నాంచారమ్మకు మత్తుమందు ఇచ్చి ఆమె మెడలో ఉన్న 4 కాసుల బంగారు గొలుసును గుర్తుతెలియని మహిళ దోచుకెళ్లింది. వృద్ధురాలికి సహాయం చేస్తున్నట్లుగా నమ్మించి ఆభరణాలు మాయం చేసింది. తన ఆభరణాలు చోరీకి గురైన సంగతి తెల్సుకున్న తరవాత నాంచారమ్మ పోలీసులను ఆశ్రయించింది. నాంచారమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ద్వారా ఆధారాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment