పెదనందిపాడు: గుంటూరు జిల్లాలో సోమవారం మధ్యాహ్నం దోపిడి దొంగలు రెచ్చిపోయారు. పెదనందిపాడులో ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు.
మామిడిపాక నాగరత్నమ్మ(87) అనే వృద్ధురాలు ఇంటి ఆవరణలో మంచంపై నిద్రిస్తుండగా గుర్తుతెలియని దుండగులు చోరబడి ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుపోయారు. ఈ మేరకు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.