
అవనిగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
సాక్షి, అవనిగడ్డ: కృష్ణా జిల్లా దివిసీమలో గురువారం 17 మంది పాముకాటుకి గురయ్యారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలకు చెందిన పదిమంది పాముకాటుకు గురయ్యారు. కోడూరు మండలానికి చెందిన సురేష్, బ్రహ్మయ్య, విశ్వనాధపల్లికి చెందిన నాగ వీరాంజనేయులు, హర్జిత్ మండల్, పెద మాచవరానికి చెందిన వీరాస్వామి, పాదాలవారిపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు, కోడూరుకు చెందిన రామారావు, నాగాయలంక మండలానికి చెందిన కృష్ణారావు, అవనిగడ్డ మండలానికి చెందిన భీముడు, తుంగలవారిపాలెంకు చెందిన గాలి మురళీకృష్ణ పాముకాటుకు గురయ్యారు. మరో ఏడుగురు పాముకాటు బాధితులు చల్లపల్లి కస్తూర్బా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఘంటసాల మండలం దేవరకోటకు చెందిన పరిశె యశోద, చల్లపల్లి మండలానికి చెందిన కొమ్ముకూరి ఐజాక్, పేరుపోయిన ఓన్సీము, యార్లగడ్డకు చెందిన పల్లెకొండ వాసుదేవరావు, పులిగడ్డకు చెందిన కనకమ్మ, వక్కపట్లవారిపాలెంకు చెందిన కోటేశ్వరమ్మ పాముకాటుకు గురై చల్లపల్లి వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment