వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేస్తున్న పీఈటీ అభ్యర్థులు
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తమకు నూతనంగా ప్రవేశపెట్టిన టెట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డలో పీఈటీ అభ్యర్థులు ఆదివారం వాటర్ ట్యాంకు ఎక్కారు. పరీక్షను రద్దుచేస్తామని హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి దిగేది లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అభ్యర్థులను నచ్చజెప్పి కిందకు దించే ప్రయత్నాలు చేస్తున్నారు.
టెట్ పరీక్షలో చెన్నై కేంద్రంగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. చెన్నైలో కొన్ని ప్రైవేట్ ఇనిస్టిట్యూట్‌ల నిర్వాహకులు ప్రత్యేక పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయించుకున్నారని అభ్యర్థులు పేర్కొన్నారు. పీఈటీ అభ్యర్థుల నుంచి వేల రుపాయలు వసూలు చేసి.. పేపర్ లీకేజీ చేయించేందుకే ఈ ఏర్పాట్లు చేశారని తెలిపారు. దీనిపై విచారణ జరిపించాలని పీఈటీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. అభ్యర్థులు కిందకు దిగి రావాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment