ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు అపహరణ కేసులో అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు సీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెజవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు అపహరణ కేసులో అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆయన గురువారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన నిందితురాలు గంగు మల్లేశ్వరితో పాటు ఆమె భర్త రాజు, ఆస్పత్రి రికార్డు అసిస్టెంట్ శ్రీను, సెక్యూరిటీ సిబ్బంది ముఖర్జీ, కన్నయ్యలను అరెస్ట్ చేసినట్లు వివరించారు. కాగా కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం తుంగలవారిపాలేనికి చెందిన గంగు నాగమల్లేశ్వరి గత గురువారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువును అపహరించిన విషయం తెలిసిందే.