శిశుపాలుడు, 100 తప్పులు, ఆయన వధ కధ చాలా ఆసక్తికరంగా వివరించారు. ‘మీ అందరికీ తెలుసు శిశుపాలుడి గురించి. ఆయన 100 తప్పులు చేసే వరకు దేవుడు ఓపిక పట్టాడు. తప్పులు 101 కాగానా విష్ణుచక్రంతో ఆయన తల నరికారు. ఇప్పుడు ఆ శిశుపాలుడు నరకంలో ఉన్నాడు. ఆయన అక్కడ యముడిని ఒక ప్రశ్న అడిగాడట. నేను 100 తప్పులు చేస్తేనే నా తల నరికారు. మరి చంద్రబాబు ఇంకా చాలా తప్పులు చేశారు. ఎందరినో వెన్నుపోటు పొడిచారు. అయినా ఎందుకు వదిలిపెట్టారు? అని ప్రశ్నిస్తే యముడు ఇలా చెప్పాడట’. ‘ఈ యుగంలో విష్ణుచక్రం బదులు ఫ్యాన్ చక్రం ఉందని, అలాగే శ్రీకృష్ణుడి బదులు ఓటింగ్ యంత్రం ఉందని యముడు చెప్పాడు. దాంతో చంద్రబాబును పదవి నుంచి దింపబోతున్నారని, అదే విధంగా శ్రీకృష్ణుడి ప్రతిరూపంగా రాష్ట్ర ప్రజలున్నారని చెప్పారట. అంతే కాకుండా నరకాసురుడు, రావణాసురుడు, బకాసురుడు.. అన్నీ కలిసిన వాడే చంద్రబాబు కాబట్టి, ఆయనకు బుద్ధి చెప్పడానికి కాస్త టైమ్ పడుతుందని వివరించారట’
Published Tue, Mar 19 2019 6:53 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement