
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. 10.55 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
22 ఏ (1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు సీఎం జగన్ అందజేస్తారు. మధ్యాహ్నం 12.25 గంటలకు అవనిగడ్డ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.25 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment