prohibited
-
పదహారు ఏళ్లలోపు పిల్లలు.. సోషల్ మీడియాకు నో..!
పదహారు ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిషేధిస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. యువతపై రకరకాల సైట్ల ప్రభావాన్ని ఆయన ‘విపత్తు’గా అభివర్ణించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్‌లాంటి సైట్లలోకి లాగిన్ కావడానికి పిల్లల కనీస వయసు ఇంకా నిర్ణయించబడలేదు.ఇది 14 నుండి 16 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ‘సోషల్ మీడియా వ్యసనంగా మారిన పిల్లలను ఆటస్థలాలు, ΄÷లాలు, స్విమ్మింగ్ పూల్స్‌లో చూడాలనుకుంటున్నాను’ అంటున్నారు ప్రధాని. ‘సామాజిక మాధ్యమాలు సామాజిక హాని కలిగిస్తున్నాయి. యువత మనసులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. సోషల్ మీడియా దాటి బాహ్య ప్రపంచంలోకి వస్తే వారికి ఎన్నో అనుభవాలు సొంతం అవుతాయి’ అంటున్నాడు ఆంథోనీ ఆల్బనిస్.ప్రధాని నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలు సైతం సమర్థించారు. ‘సోషల్ మీడియా సంస్థలు వయసు పరిమితి విధించాలి’ అని కోరుతున్నాడు ప్రతిపక్ష నేత పీటర్ డట్టన్. ‘సోషల్ మీడియా సంస్థలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి’ అని ΄ాలక, ప్రతిపక్ష నేతలు కోరుకుంటున్నారు.ఇవి చదవండి: రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం..అప్ఘాన్ జిమ్ ఓనర్ మృతి -
గ్రీన్ చాయిసెస్..! ఎంపవర్ వాయిసెస్..!!
విశాఖపట్టణం పీ.ఎం పాలెంలోని ఈస్ట్రన్ ఘాట్స్ బయోడైవర్సిటీ సెంటర్లో మానస తిన్ననూరి, స్పందన అంచల చేతుల మీదుగా పురుడు పోసుకుంది ‘బి ఎర్త్లీ’ అంకుర సంస్థ. కోటి మంది జీవితాలకు చేరువ కావాలనే లక్ష్యంతో వీరు తమ ప్రయాణాన్ని ్రపారంభించారు. ఇటీవల తమ సొంత స్టోర్ ‘వన సంపద’ను తూర్పు కనుమల జీవవైవిధ్య కేంద్రంలో ్రపారంభించారు. డిఎఫ్ఓ అనంత్ శంకర్ అందించిన సహకారంతో తమ కలను సాకారం చేసుకున్నారు.మానస బయోకెమిస్ట్రీలో పీజీ, ఎంబిఏ పూర్తిచేసి హార్వర్డ్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ హెల్త్ సిస్టమ్‌పై కోర్సు చేసింది. స్పందన ఇంజినీరింగ్ పూర్తిచేసి, ఎంఐటి బూట్ క్యాంప్ ్రపోగ్రామ్ చేసింది. గత పదమూడు సంవత్సరాలుగా ఈ ఇద్దరు సామాజికసేవా రంగంలో పనిచేస్తున్నారు. కోవిడ్ సమయంలో వాలెంటీలుగా పనిచేస్తూ పరిచయమయ్యారు.ప్లాస్టిక్‌ను నిరోధించాలి’ అనే నినాదంతో అగిపోకుండా ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి పరిశోధన చేసారు. దీనిలో భాగంగా చెట్ల నుంచి లభించే వివిధ ఉత్పత్తులను ఉపయోగించి, కార్యాలయాలు, ఇంటిలో ఉపకరించే వస్తువులను తయారుచేస్తున్నారు. రీసైకిల్డ్ పేపర్‌తో నోట్ పాడ్స్, డైరీలు, క్యాలెండర్లు తయారు చేస్తున్నారు. వీటిలో కంటికి కనిపించని చిన్న విత్తనాలను ఉంచుతారు. పెన్నులు, పుస్తకాలు వినియోగించిన తరువాత బయట పారవేసినా వాటిలో ఉండే విత్తనాలు సహజంగా మొలకెత్తుతాయి.రాఖీ పౌర్ణమి కోసం కొబ్బరి పెంకుతో సహజసిద్ధమైన రాఖీలు తయారుచేశారు. వెదురుతో టూత్ బ్రష్‌లు, దువ్వెనలు, పెన్‌స్టాండ్, మొబైల్ స్టాండ్, అందమైన రంగులతో కాటన్ చేతి సంచులు, మట్టి ప్రమిదలు, సీడ్ గణేష్, మట్టి, ఆవు పేడతో తయారు చేసిన కుండీలు...ఇలా పర్యావరణహితమైన ఎన్నో ఉత్పత్తులను వీరు తయారు చేసి విక్రయిస్తున్నారు. సంస్థ నినాదం గ్రీన్ చాయిసెస్.. ఎంపవర్ వాయిసెస్. వివిధ సందర్భాలలో బహుమతులుగా ఇవ్వడానికి ఉపయోగపడే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఈ వస్తువులను విశాఖకు అతి చేరువలో ఉన్న ఆదివాసీ గ్రామం శంభువానిపాలెంకు చెందిన ఆదివాసీ మహిళలతో చేయిస్తు వారికి ఉపాధి కల్పిస్తున్నారు. – వేదుల నరసింహం, ఫోటోలు: ఎం.డి నవాజ్, విశాఖపట్నం -
AP: విరామ వేళ.. వలకు భరోసా
సాక్షి, మచిలీపట్నం: సముద్ర జలాలపై సాగించే చేపల వేటకు విరామం లభించింది. గంగపుత్రులు రెండు నెలల పాటు తమ వలలకు విశ్రాంతి ప్రకటించనున్నారు. మత్స్యసంపద పెరిగే కాలం కావడంతో 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చేపల వేట సాగించే మత్స్యకారులు నిషేధ కాలంలో ఇంటి పట్టునే ఉండనున్నారు. దీంతో వీరికి ప్రభుత్వం వైఎస్ఆర్ మత్స్య భరోసా కింద ఆర్థిక సహాయం అందించనుంది. దీనికి సంబంధించి ఆ శాఖ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. 61 రోజులు బ్రేక్.. సముద్రంలో చేపల పునరుత్పత్తి సమయం కావడంతో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బంగాళాఖాతంలో వేటకు విరామం ఇవ్వాలి. ఏటా ఏప్రిల్ 15వ నుంచి నిషేధం అమలు చేస్తున్నారు. తూర్పు తీరంలోని పశి్చమ బెంగాల్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకూ సముద్రంలో చేపల వేటపై నిషేధం ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుంది. జూన్ 14వ తేదీ అర్ధరాత్రి వరకూ (61 రోజులు) ఇది అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి చేపల వేట నిషేధం అమలుకు పోలీసుల సహకారంతో మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లాలోని మత్స్యకారులు సముద్రంలో వేట ముగించుకుని తమ బోట్లతో ఒడ్డుకు చేరుకున్నారు. వేట విరామ భృతి.. సముద్రంలో చేపల వేటపై నిషేధం కారణంగా ఉపాధి కోల్పోనున్న మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేట విరామ భృతిని అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున సాయం చేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వేట నిషేధ భృతి కేవలం రూ.4 వేలు మాత్రమే ఉండగా దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.10వేలకు పెంచి, వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట 2019 నుంచి అందిస్తోంది. ఈ ఏడాది కూడా సాయం అందించేందుకు మత్స్యశాఖ అధికారులు చేపల వేట సాగించే బోట్లకు ఫొటోలు తీసుకుని, లబి్ధదారుల వివరాలు నమోదు చేసే చర్యలు చేపట్టనున్నారు. కృష్ణా జిల్లా వివరాలు.. ♦ సముద్ర తీరప్రాంత మండలాలు: మచిలీపట్నం, నాగాయలంక, కృత్తివెన్ను, కోడూరు ♦ సముద్ర తీరం: సుమారు 111 కిలోమీటర్లు ♦ మత్స్యకార ఆవాసాలు : 64 ♦ మత్స్యకారుల జనాభా: 85వేలు ♦ సముద్రంలో చేపల వేట సాగిస్తున్న వారు: 12వేలు ♦మొత్తం బోట్లు : 2,256 ♦ వీటిలో మెకనైజ్డ్ బోట్లు : 92 ♦ మోటరైజ్డ్ బోట్లు: 2,091 ♦ సంప్రదాయ బోట్లు : 73 ♦ ఏటా మత్స్య సంపద టర్నోవర్: 40,600 టన్నులు చేపలు, 11,390 టన్నుల రొయ్యలు ♦ మత్స్య సంపద విలువ: సుమారు రూ.510కోట్లు సాయం చేసేందుకు గుర్తింపు.. వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట సాయం అందించేందుకు 18 మీటర్ల వరకూ పొడవు ఉన్న మెకనైజ్డ్ బోట్‌కు యజమాని మినహా 8 మందికి, మోటరైజ్డ్ బోట్లకు యజమానితో కలిపి ఆరుగురికి, సంప్రదాయ బోట్లకు ముగ్గురు చొప్పున మత్స్యకారులను అర్హులుగా ఎంపిక చేస్తారు. ప్రభుత్వ సాయం పొందేందుకు బోట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఫిషింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, రైస్ కార్డు, బ్యాంక్ అకౌంట్, సెల్ నంబర్ వివరాలను అందజేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుల గుర్తించే చర్యలు చేపట్టాం.. నేటి నుంచి సముద్రంలో చేపల వేటపై నిషేధం అమలులోకి వచ్చింది. మత్స్యకార భరోసా సాయం అందించేందుకు లబ్ధిదారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టాం. వేట నిషేధాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ఆంధ్రప్రదేశ్ మెరైన్ రెగ్యులేషన్ చట్టం–1994 ప్రకారం చర్యలు తీసుకుంటాం. చేపలు, పడవలు స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తాం. తీరంలో చేపలు అమ్మకాలు, ప్యాకింగ్ చేయరాదు. వేట నిషేధంపై మత్స్యకారులు, వ్యాపారులకు నోటీసులు అందించాం. వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. – వి. శివ సాంబరాజ్యం, జిల్లా మత్స్యశాఖ అధికారి(జేడీఎఫ్), కృష్ణా జిల్లా -
నూహ్‌లో ప్రశాంతంగా పూజలు
నూహ్(హరియాణా): సర్వజాతీయ హిందూ మహాపంచాయత్ సంస్థ సోమవారం నూహ్‌లో తలపెట్టిన శోభాయాత్రను అధికారులు అడ్డుకున్నారు. జూలై 31న నూహ్‌లో మత కలహాలు చెలరేగిన నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం తాజాగా శోభాయాత్రకు అనుమతి నిరాకరించింది. మల్హర్, ఝిర్, శింగార్ శివాలయాల్లో పూజలు మాత్రం చేసుకోవచ్చని తెలిపింది. దీంతో, అధికారులు ఢిల్లీ–గురుగ్రామ్ సరిహద్దుల నుంచి నూహ్ వరకు అయిదు ప్రధాన చెక్ పాయింట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. శోభాయాత్రలో పాల్గొనేందుకు అయోధ్య నుంచి బయలుదేరిన జగద్గురు పరమహంస ఆచార్య తదితరుల బృందాన్ని సోహ్నా వద్ద ఘమోర్జ్ టోల్ ప్లాజా వద్ద నిలిపివేశారు. అనంతరం అధికారులు నూహ్ జిల్లాలోకి అనుమతించిన 15 మంది సాధువులు, ఇతర హిందూ నేతలు సుమారు 100 మంది నల్హర్‌లోని శివాలయంలో జలాభిక పూజలు చేశారు. అక్కడ్నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఫిరోజ్‌పూర్‌లోని ఝిర్కా ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. శింగార్ ఆలయానికి కూడా వెళ్లారని అధికారులు తెలిపారు. ఎటువంటి అవాంఛ నీయ ఘటనలు జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఇలా ఉండగా, సోమవారం సోహ్నా నుంచి నూహ్ వరకు పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలేవీ తెరుచుకోలేదు. అధికారులు ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. -
ఆ రైత్వారీ పట్టాలు చెల్లుతాయి
సాక్షి, అమరావతి : గ్రామ సర్వీసు ఈనాం భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ భూములపై ఉన్న ఆంక్షలను తొలగించేందుకు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందుకనుగుణంగా గ్రామ సర్విసు ఈనాం భూములకు జారీ చేసిన రైత్వారీ పట్టాలు చెల్లుబాటవుతాయని రెవెన్యూ శాఖ తెలిపింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ జీఓ నంబర్ 310 జారీ చేశారు. ఈ భూములకు గతంలో జారీ చేసిన రైత్వారీ పట్టాదారుల పేర్లను అన్ని రికార్డుల్లోకి ఎక్కించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. పట్టాదారులు లేని పక్షంలో వారి వారసులు (లీగల్ హైర్స్), లేకపోతే వారి నుంచి కొనుగోలు చేసిన వ్యక్తుల పేర్లను రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. రీ సర్వే రికార్డుల్లోనూ వారి పేర్లను చేర్చాలని స్పష్టం చేశారు. దీంతో 1.13 లక్షల మందికి చెందిన 1.68 లక్షల ఎకరాలు గ్రామ సర్విసు ఈనాం భూములు 22 (ఎ) జాబితా నుంచి తొలగి, ఆ కుటుంబాలకు మేలు కలుగుతుంది. ఈనాం భూముల చట్ట సవరణతో 22 (ఎ)లోకి సర్విసు ఈనాం భూములు దశాబ్దాల క్రితం గ్రామానికి సేవ చేసే కుల వృత్తుల వారి జీవన భృతి కోసం ఈనాంగా భూములిచ్చారు. 1956 ఈనాం (రద్దు, రైత్వారీ పట్టాలుగా మార్పు) చట్టం ప్రకారం కొన్ని ఈనాం భూములు రద్దవగా, కొన్ని రైత్వారీ భూములుగా మారాయి. రైత్వారీ భూములకు అప్పట్లోనే రైత్వారీ పట్టాలు జారీ చేశారు. ఈనాందారులు తమ భూములను ఎవరికైనా అమ్ముకునే హక్కు కూడా ఈనాం చట్టం కల్పించింది. దీంతో ఆ భూములను కొన్న వారికి రక్షణ ఏర్పడింది. అయితే గ్రామ సర్వీసు చేసిన వారికే కాకుండా ధా ర్మిక సంస్థలు, దేవాలయాల మనుగడ కోసం వాటికి ఈనాంగా భూములిచ్చారు. ఆ దేవాలయాల భూములు చాలావరకు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆ దేవాలయాల్లో ఏ సేవల కోసం భూమి ఇచ్చారో ఆ సేవలు కూడా ప్రస్తుతం లేవు. దీంతో వాటి రక్షణ కోసం 2013లో ఈనాం చట్టానికి సవరణలు చేశారు. దీని ప్రకారం ఈనాం భూములన్నింటిపైనా ఆంక్షలు విధించి వాటిని నిషేధిత జాబితా 22 (ఎ)లో చేర్చారు. దీంతో దేవాలయాల ఈనాం భూములతోపాటు గ్రామ సర్విసు ఈనాం కింద పొందిన రైత్వారీ పట్టా భూములు కూడా 22 (ఎ) జాబితాలో చేరిపోయాయి. రాష్ట్రంలో భూముల రీ సర్వే జరుగుతున్న క్రమంలో గ్రామ సర్విసు ఈనాం భూములపై రైతుల నుంచి పెద్దఎత్తున వినతులు వచ్చాయి. రైత్వారీ పట్టాలు పొందిన వారి నుంచి తాము కొన్నామని, తమ పేర్లను రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కించడంలేదని, తమకు న్యాయం చేయాలని కోరారు. ధార్మిక సంస్థల ఈనాం, సర్విసు ఈనాం భూముల మధ్య తేడా ఇదే ఈ వినతులను పరిశీలించిన ప్రభుత్వం దేవాలయ, ధార్మిక సంస్థల ఈనాం, గ్రామ సర్వీసు ఈనాం భూముల మధ్య ఉన్న తేడాపై స్పష్టత ఇచ్చింది. ధా ర్మిక సంస్థల ఈనాం భూములను కేవలం ఆ దేవాలయాలు, అందులోని దేవుడి సేవల కోసం మాత్రమే ఇచ్చారు. అవి ఎప్పటికీ దేవాలయాలవే తప్ప వేరే వ్యక్తులు పొందే అవకాశం ఉండదు. గ్రామ సర్విసు ఈనాం భూములను అందరి మేలు కోసం పనిచేసిన కుల వృత్తుల వారికి (క్షురకులు, చాకలి, మంగలి వంటి వృత్తులు) ఇచ్చారు. ఆ భూములు ఆ వ్యక్తులు, వారి వారసులకు వస్తాయి. ఇలా సర్వీసు చేసిన కుల వృత్తుల వారి సంఖ్య గ్రామాల్లో చాలా పెద్ద సంఖ్యలో ఉండడం వల్లే వారికి రైత్వారీ పట్టాలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో 2013లో ఈనాం చట్టానికి చేసిన సవరణలు గ్రామ సర్వీసు ఈనాం భూములకు వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ భూములన్నింటినీ 22(ఎ) నుంచి తొలగించాలని, వారి పేర్లను రికార్డుల్లోకి ఎక్కించాలని జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. -
ఏది న్యాయం? ఎవరిది ధర్మం?
నాకు వారి మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. నాకు దేవుడి దయ, ఆశీర్వదించే ప్రజలు ఉన్నారు. ప్రతి అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, అవ్వ, తాత తోడుగా నిలబడతారన్న నమ్మకం ఉంది. వారు అబద్ధాలను, కుట్రలను, మీడియాను, దత్తపుత్రుడిని, వారి పొత్తులను నమ్ముకుంటే.. నేను దేవుడి దయను, అక్కచెల్లెమ్మల కుటుంబాలను నమ్ముకున్నాను. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నదే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగుంటే జగనన్నకు తోడుగా నిలవండి. – సీఎం జగన్ ఆయన గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఇలా నాలుగేళ్లో, ఐదేళ్లో కాపురం చేసి.. ఎంతో కొంత డబ్బులిచ్చి విడాకులు ఇచ్చేసి.. మళ్లీ పెళ్లి చేసుకోవడం మొదలు పెడితే.. అలా మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటూ పోతే వ్యవస్థ పరిస్థితి ఏంటి? ఆడవాళ్ల మాన ప్రాణాలు ఏం కావాలి? అక్క చెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి? ఇలాంటి నాయకులు మనకు అవసరమా.. ఆలోచించండి. ఎవరికీ మంచి చేసిన చరిత్ర లేని వారు, వెన్నుపోటు దారులు ఎన్నికల సమయంలో రంగు రంగుల మేనిఫెస్టోలు ఇస్తారు. వాగ్దానాలు చేస్తారు. ఎన్నికల తర్వాత వాటిని చెత్తబుట్టలో వేస్తారు. మళ్లీ ప్రజలు ప్రశ్నిస్తారేమోనని కనీసం వెబ్సైట్లలో కూడా కనిపించకుండా చేస్తారు. ఇలాంటి వారంతా దుష్టచతుష్టయంగా ఏర్పడ్డారు. మీ బిడ్డ మీద.. మన ప్రభుత్వం మీద.. మీ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారట? ఒక్క జగన్‌ను కొట్టడానికి ఇంతమంది ఏకం అవుతుండటం ఆశ్చర్యం వేస్తోంది. రైతులకు భూ హక్కు పత్రాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, విజయవాడ: ‘ప్రజలకు మనం మంచి చేస్తుండటాన్ని జీర్ణించుకోలేని ఆ పెద్ద మనిషి (చంద్రబాబు).. తన దత్తపుత్రుడి (పవన్ కళ్యాణ్)తో ఎలా తిట్టించారో అందరం చూశాం. మనం మూడు రాజధానుల వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని మాట్లాడుతుంటే, కాదు కాదు.. మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చంటూ ఆయన గారు సెలవివ్వడమూ విన్నాం. మంచికి, మోసానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో మును ముందు మరెన్నో కుట్రలు కనిపిస్తాయి. వాటిన్నింటినీ తిప్పికొట్టి.. ఏది న్యాయం, ఎవరిది ధర్మమో ఆలోచించండి. న్యాయం, ధర్మం వైపు నిలబడండి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన 22(ఏ)1 నిషేధిత భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ, కృష్ణా జిల్లా అవనిగడ్డలో రైతులకు భూ హక్కు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనందరి ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి ఎంతో మేలు చేస్తుంటే దుష్టచతుష్టయం ఓర్వలేక దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ►మీ గ్రామంలో మీ కళ్ల ఎదుటే కనిపిస్తున్న మార్పులను గమనించండి. గ్రామ సచివాలయాలు, అందులో 10 మంది ఉద్యోగులైన మన పిల్లలు మనకు సేవలు అందిస్తూ.. ఉత్సాహంగా చిరునవ్వుతో కనిపిస్తారు. ప్రతి 50 ఇళ్లకూ వలంటీర్ కనిపిస్తున్నారు. ప్రతి అడుగులోనూ మనకు మంచి చేస్తూ చేదోడు, వాదోడుగా ఉన్నాడు. ►వివక్ష చూపకుండా, లంచాలు అడగకుండా 1వ తారీఖునే సూర్యోదయం అయిన వెంటనే, అది ఆదివారమైనా, పండుగ అయినా ఇంటికి వచ్చి గుడ్‌మార్నింగ్ చెప్పి పెన్షన్ డబ్బు చేతిలో పెట్టి వెళ్తాడు. ►అదే గ్రామంలో విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ రైతులను చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థ కనిపిస్తోంది. మన కళ్లెదుటనే పారదర్శకంగా ఈ–క్రాప్ జరుగుతోంది. విత్తనాలు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కల్తీ లేకుండా అందిస్తున్నారు. పంట కొనుగోలు విషయంలో అండగా నిలుస్తున్నారు. ►మరో నాలుగు అడుగులు ముందుకేస్తే విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. అక్కడ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, మిడ్ లెవల్ హెల్త్ ప్రాక్టీçషనర్ అక్కడే ఉంటూ 24 గంటలూ అందుబాటులో ఉంటూ 67 రకాల మందులిస్తూ.. 14 రకాల డయోగ్నిస్టిక్ టెస్టులు చేస్తూ.. ఆరోగ్యశ్రీకి రిఫరెల్ పాయింట్‌గా పని చేస్తున్నారు. ►ఈ నెలలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నాం. అదే గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు కనిపిస్తాయి. నాడు–నేడుతో స్కూళ్ల రూపు రేఖలను మార్చాం. డిజిటల్ లైబ్రరీలు కూడా కట్టబోతున్నాం. మన గ్రామాలలో మన పిల్లల కోసం వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. మన కళ్ల ఎదుటే గ్రామాల రూపు రేఖలు మారుతున్నాయి. ►కాబట్టే మనందరి ప్రభుత్వం తరఫున మన ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో మీ ఇంటికి ఈ మేలు చేశామని, సవినయంగా చెప్పుకుంటూ గడపగడపకూ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రతి అక్క, చెల్లెమ్మ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇదే సమయంలో చెప్పుకోవడానికి ఏమీ లేనివాళ్లంతా, గతంలో ప్రజలకు ఏ మేలూ చేయని వారంతా ఈ రోజు ఏం చేస్తున్నారో గమనించండి. కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగిన సీఎం వైఎస్ జగన్ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం అవనిగడ్డకు వరాల జల్లు.. ►అవనిగడ్డకు సంబంధించి కొన్ని మంచి కార్యక్రమాలకు సహాయ సహకారాలు కావాలని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ అడిగారు. అవనిగడ్డ–కోడూరు ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.35 కోట్లు మంజూరు చేస్తున్నా. కృష్ణానది కుడి, ఎడమ కరకట్ట.. సముద్రపు కరకట్టను పటిష్టం చేయడానికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నా. పాత ఎడ్లలంక రహదారి వంతెన ఏర్పాటుకు రూ.8.50 కోట్లు మంజూరు చేస్తున్నా. అవనిగడ్డలో కంపోస్ట్ యార్డు తరలించడానికి రూ.5–10 కోట్లు.. సీసీ డ్రైన్ల ఏర్పాటుకు రూ.10–15 కోట్లు మంజూరు చేస్తున్నా. అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని మంజూరు చేస్తాం. ►ఈ సమావేశంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, ఆర్కే రోజా, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు కొలుసు పార్థ సారధి, పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, కైలే అనిల్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, కల్పలతారెడ్డి, ఎండీ రుహుల్లా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీధి రౌడీలను మించి బూతులు ►వాళ్లు చేసిన మంచేమిటో చెప్పుకోలేరు. ఈ రోజు వాళ్లను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అందుకే బూతులు తిట్టడంలో వీధి రౌడీలను మించిపోయారు. నాయకులుగా చెప్పుకుంటున్న వారు చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. ఇలాంటి వారు మన నాయకులా? ►అవ్వాతాతల గురించి, అక్క చెల్లెమ్మల గురించి, ప్రతి కుటుంబంలో ఉన్న ఆడ బిడ్డల గురించి మనం ఆలోచిస్తుంటే.. దత్తపుత్రుడితో, దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తున్నాడో అందరం చూస్తున్నాం. ►ఎవ్వరికీ, ఏ ప్రాంతానికీ అన్యాయం చేయకుండా 3 రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని మనం చెబుతుంటే.. కాదు, మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుంది.. మీరూ చేసుకోండి.. అని చెప్పుకుంటున్న వారి గురించి ఆలోచించండి. అలాగైతే రేపు మన ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటి? మన కూతుళ్ల పరిస్థితి ఏంటి? మన చెల్లెమ్మల పరిస్థితి ఏంటి? ►వివక్ష, లంచాలు లేకుండా నేరుగా 87 శాతం ప్రజలకు మేలు చేసిన మన ప్రభుత్వానికి, ప్రజలకు ఏనాడూ మేలు చేయని పచ్చ రంగు పెత్తందారుల మధ్య పోరాటం జరుగుతోంది. మరో 18–19 నెలల పాటు రోజూ ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఆ దుష్టచతుష్టయం మోసాలను నమ్మొద్దు. ఆ పేపర్లను చదవొద్దు. ఆ టీవీలను చూడొద్దు. -
అవనిగడ్డ పర్యటనకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. 10.55 గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 22 ఏ (1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు సీఎం జగన్ అందజేస్తారు. మధ్యాహ్నం 12.25 గంటలకు అవనిగడ్డ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.25 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
Telangana: 'సుమోటో' సిత్రాలు.. రైతులకు తెలియకుండానే..
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితాలో ఉన్న భూముల ‘సుమోటో’పరిశీలనలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. కొండ నాలుకకు మందేస్తే.. అన్నట్టుగా క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ కొనసాగుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘తరతరాలుగా సాగుచేసుకుంటున్న మా పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించండి.. ఈ మేరకు ధరణి పోర్టల్‌లో మార్పులు చేయండి..’అని రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు గత రెండేళ్లుగా గగ్గోలు పెడుతూనే ఉన్నారు. రైతుల ఆవేదనపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. సుమోటోగా (ధరణిలో సదరు పట్టాదారుడు దరఖాస్తు చేసుకోకుండానే) ఈ భూముల వివరాలను పరిశీలించి అర్హమైన వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అందుబాటులో ఉన్న రికార్డుల మేరకే.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు మండల తహసీల్దార్ కార్యాలయాలకు నిషేధిత భూముల జాబితాలను పంపారు. అయితే నిషేధిత భూముల జాబితాలో ఉన్న, ఇప్పటివరకు పాస్ పుస్తకాలు జారీ అయిన భూముల వివరాలను మాత్రమే పంపారు. అలా పాస్ పుస్తకాలు జారీ అయిన భూములు 50 శాతం మాత్రమే ఉంటాయని, మిగిలిన భూములకు అనేక సమస్యలతో డిజిటల్ సంతకాలు కాలేదని, అందుకే పాస్ పుస్తకాలు జారీ కాలేదని రెవెన్యూ వర్గాలంటున్నాయి. కేవలం పాస్ పుస్తకాలు జారీ అయిన భూముల వివరాలను మాత్రమే పంపి వాటిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని పలు మండలాల తహశీల్దార్లు నిషేధిత జాబితాలో భూముల్లో అర్హమైన వాటిని సుమోటోగా తొలగించే ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియలో రైతులను భాగస్వాములను చేయకుండా, కేవలం తమ వద్ద అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి కలెక్టర్లకు నివేదికలు పంపుతున్నారు. కాగా తహశీల్దార్లు పరిశీలించిన వాటిలో కూడా 90 శాతం భూములను మళ్లీ నిషేధిత జాబితాలోనే కొనసాగిస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు ఇస్తున్నారని, కేవంల 10 శాతం భూములకు మాత్రమే విముక్తి కలుగుతోందని రెవెన్యూ వర్గాలు చెపుతుండడం గమనార్హం. ఎప్పటిదో అవార్డు కాపీ కావాల్సిందేనట! వాస్తవానికి నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూముల్లో 90 శాతం గతంలో ప్రభుత్వం తన అవసరాల కోసం సేకరించిన సర్వే నంబర్లలోనే ఉన్నాయి. మిగతా వాటిలో 5 శాతం కోర్టు కేసులు కాగా, మరో 5 శాతం పొరపాటున నిషేధిత జాబితాలో పెట్టిన భూములున్నాయి. ప్రస్తుతం సుమోటో పరిశీలన చేపట్టిన అధికారులు.. సదరు భూమిపై యజమానికి పట్టా ఎలా వచ్చింది? ఎన్ని సంవత్సరాల నుంచి పహాణీలో అతని పేరు మీద భూమి ఉంది? అనే విషయాలను పరిశీలిస్తే ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలా వద్దా అనే విషయం రెవెన్యూ వర్గాలకు నిర్ధారణ అయిపోతుంది. కనీసం 20–30 ఏళ్లుగా పహాణీలో పేరు వస్తే దాన్ని రైతు పట్టా భూమిగా నిర్ధారించవచ్చు. కానీ కలెక్టర్లు ఇక్కడ కొత్త మెలికలు పెడుతున్నారు. ప్రభుత్వం ఎప్పుడో రోడ్డు కోసం ఒక సర్వే నంబర్లోని ఎకరం భూమిని తీసుకుంటే ఇప్పుడు ఆ సర్వే నంబర్లో ఉన్న మిగతా పట్టా భూములను కూడా భూసేకరణ కింద నిషేధిత జాబితాలో ఉంచారు. వాస్తవానికి ఈ ఒక్క ఎకరం మినహా మిగిలిన అన్ని ఎకరాలకు పట్టాలున్నాయి. ఈ భూములను నిషేధిత జాబితా నుంచి నేరుగా తొలగించవచ్చు. కానీ విచిత్రంగా 1980లోనో, అంతకుముందో, ఆ తర్వాతో సదరు ఎకరం భూమిని రోడ్డు కోసం కేటాయించిన ధ్రువపత్రం (అవార్డు కాపీ) కూడా కావాల్సిందేనని, అప్పటివరకు ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేది లేదని కలెక్టర్లు చెబుతుండటం గమనార్హం. ఆ అవార్డు కాపీ దొరకడం లేదని తహశీల్దార్లు నెత్తీనోరూ మొత్తుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. పైగా తహశీల్దార్లకు కలెక్టర్లు పరిశీలనకు సంబంధించిన టార్గెట్లు విధిస్తున్నారని, సిబ్బంది లేకపోవడంతో ఎమ్వార్వోలు ఒత్తిడికి గురవుతున్నారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి మళ్లీ అవకాశం ఇస్తారా? ఈ పరిశీలన అనంతరం నిషేధిత జాబితా నుంచి తొలగించని భూముల విషయంలో మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం రైతులకు ఇస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేకపోవడం గందరగోళానికి గురిచేస్తోంది. ప్రస్తుతం నిషేధిత జాబితాలోని భూముల తొలగింపు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళుతున్న రైతులతో.. దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, సమస్యను తామే పరిష్కరిస్తామని కలెక్టర్ స్థాయి నుంచి ఆర్ఐ వరకు చెబుతుండడం గమనార్హం. నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో కేవలం పాస్‌పుస్తకాలున్న భూములను సుమోటోగా పరిశీలిస్తున్న ప్రభుత్వం.. మిగిలిన భూములను ఎప్పుడు పరిశీలించి పరిష్కరిస్తుందో, ప్రస్తుతం పరిశీలిస్తున్న భూముల్లో తిరస్కరించిన వాటి విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. రైతులకు తెలియకుండానే.. మరీ విచిత్రమేమిటంటే.. ఈ ప్రక్రియ గురించి అసలు రైతుకు తెలియకపోవడం. కలెక్టర్ పంపిన భూముల వివరాలు, ఆ వివరాల్లో ఉన్న భూముల రికార్డులను పరిశీలించి తహసీల్దార్లు ఇచ్చే నివేదికలు, వాటి ఆధారంగా కలెక్టర్లు తీసుకున్న నిర్ణయాలు, ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారా? లేక అలాగే కొనసాగిస్తున్నారా? అనే విషయాలేవీ రైతులకు తెలియడం లేదు. ప్రభుత్వం నుంచి కలెక్టర్లకు ఆదేశాలు రావడం.. కలెక్టర్ల నుంచి తహసీల్దార్లకు, తహసీల్దార్ల నుంచి మళ్లీ కలెక్టర్లకు భూముల వివరాలు వెళ్లడం, వాటిపై కలెక్టర్లు నిర్ణయాలు తీసుకోవడం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. -
నిషేధిత హారన్ కొడితే చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: చిత్ర విచిత్రమైన ధ్వనులతో హారన్ కొడుతూ.. రోడ్లపై దూసుకుపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త! జూన్ 1 నుంచి నిషేధిత హారన్లు మోగించే డ్రైవర్, ఆ వాహన యజమానిపై ట్రాఫిక్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. ఎయిర్, ప్రెషర్, మల్టీటోన్డ్ వంటి నిషేధిత హారన్ వినియోగిస్తూ ధ్వని కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై నగర ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. నిషేధిత హారన్లు వినియోగించేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్డు ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల 10 నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 3,320కిపైగా వాహనాలకు ఉన్న నిషేధిత హారన్లను తొలగించారు. ఆయా వాహనదారులకు ఎంవీ యాక్ట్ 190 (2) సెక్షన్ ప్రకారం రూ.1,000 జరిమానా విధించినట్లు నగర ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. కేంద్ర మోటారు వాహనాల చట్టం (సీఎంవీఆర్)–1988 సెక్షన్ 52 ప్రకారం తయారీదారుల నుంచి వచ్చిన వాహన హారన్‌లో ఎలాంటి మార్పులు చేయకూడదు. ప్రతి వాహనానికీ ఎలక్ట్రిక్ హారన్ మాత్రమే ఉండాలి. -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం.. ఎప్పటినుంచంటే..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జూలై 1 నుంచి వివిధ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు, ఉత్పత్తులపై నిషేధం అమల్లోకి రానుంది. గతంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ కవర్లు, బ్యాగ్‌ల వంటి వాటిపైనే నిషేధం ఉండగా..ఇప్పుడు దీని పరిధిలోకి వచ్చే వస్తువుల జాబితాపై స్పష్టత వచ్చింది. ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నోటిఫికేషన్ రూపంలో దీనిపై ఆదేశాలు జారీచేసింది. నిషేధం అమల్లోకి వచ్చేలోగా.. ప్రజల్లో అవగాహన కల్పనకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) చర్యలు ప్రారంభించింది. అలాగే ప్రత్యామ్నాయ వస్తువుల వాడకంపై ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది. నిషేధం వీటిపైనే.. ► ఒకసారి వాడి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల తయారీ, ఉత్పత్తి, దిగుమతి, స్టాక్ పెట్టుకోవడం, అమ్మకం, సరఫరా, పంపిణీ, వినియోగం తదితరాలు.. ► ఇయర్ బడ్స్, బెలూన్లు, ప్లాస్టిక్ జెండాలు, ఐస్‌క్రీం, క్యాండీలకు ఉపయోగించే ప్లాస్టిక్ స్టిక్స్ ► అలంకరణకు ఉపయోగించే థర్మకోల్ ► ప్లేట్లు, గ్లాసులు, ఫోర్క్‌లు, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, ట్రేల వంటి సామగ్రి ► స్వీట్‌బాక్స్‌లు ప్యాకింగ్ చేసే ఫిల్మ్, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు ► వంద మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్/ పీవీసీ బ్యానర్లు ఉల్లంఘనులపై జరిమానాలు... ఈ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించే వారి నుంచి జరిమానాలు వసూలు చేయాలని సీపీసీబీ నిర్ణయించింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని రాష్ట్రాల పీసీబీలు లేదా కాలుష్య నియంత్రణ కమిటీలకు కల్పించింది. రిటైల్ వ్యాపారులు, అమ్మకందారులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగదారులపై జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జరిమానాలు విధించవచ్చు. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై రూ.500, పారిశ్రామిక వ్యర్థాలకు కారణమయ్యే వారికి రూ.5 వేల చొప్పున జరిమానా వేయొచ్చు. ప్రత్యామ్నాయాలివే... ► పత్తి/ ఉన్ని/వెదురుతో తయారు చేసిన బ్యాగ్‌లు ► స్పూన్లు, స్ట్రాలు, ఇతర ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో వెదురు లేదా ఇతర పదార్థాలతో తయారు చేసే వస్తువులను ఉపయోగించవచ్చు ► వేడి పానీయాలు, ఇతర అవసరాల నిమిత్తం మట్టిపాత్రల వంటివి వాడొచ్చు. -
ఆయా దేశాల్లో స్మార్ట్ఫోన్లను బ్లాక్ చేసిన షావోమీ..!
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ కీలక నిర్ణయం తీసుకుంది. షావోమీ స్మార్ట్ఫోన్లు విక్రయించబడని దేశాల్లో షావోమీ స్మార్ట్ఫోన్లను బ్లాక్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. కంపెనీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకొని పలు దేశాల్లో షావోమీ స్మార్ట్ఫోన్లను వాడుతున్న కస్టమర్లకు బ్లాక్ చేస్తున్నట్లు మెసేజ్‌ను చూపిస్తుంది. యూఎస్‌తో సహా అనేక దేశాల్లో షావోమీ అధికారికంగా ఉనికి లేదు. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! క్యూబా, ఇరాన్, సిరియా, ఉత్తర కొరియా, సూడాన్ లేదా క్రిమియా దేశాల్లో షావోమీ స్మార్ట్ఫోన్లను వాడుతున్న యూజర్లకు షావోమీ షాక్ నిచ్చింది. గతవారం నుంచి ఈ స్మార్ట్ఫోన్లను షావోమీ బ్లాక్ చేసిందని యూజర్లు సోషల్‌మీడియాలో హైలైట్ చేస్తున్నారు. షావోమీ బ్లాక్ చేస్తూ సందేశాలను కూడా పంపినట్లు యూజర్లు సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎగుమతి నిబంధనలను ఉల్లంఘించిన దేశాల్లో స్మార్ట్‌ఫోన్ సేవలను బ్లాక్ చేస్తుందని కంపెనీ పాలసీలో ఎక్కడలేదు. For the past few weeks, Xiaomi has been proactively blocking users from provisioning their phones if they live in Cuba, Iran, Syria, North Korea, Sudan, or Crimea, in order to comply with export regulations and stop resellers. https://t.co/51AdXIMgnW — Mishaal Rahman (@MishaalRahman) September 9, 2021 చదవండి: Apple : సెప్టెంబర్ 14నే ఐఫోన్-13 రిలీజ్..! కారణం అదేనా..! -
హానికరమైన 27 క్రిమీ సంహారక మందులు నిషేధం
న్యూఢిల్లీ: మనుషులు, జంతువులకు హానికరంగా పరిగణిస్తున్న 27 క్రిమి సంహారక మందుల తయారీ, వినియోగంపై నిషేధం విధించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు ఇచ్చారు. డాక్టర్ అనుపమ్ వర్మ నేతృత్వంలోని నిపుణుల సంఘం 66 కీటక నాశక మందులు కలిగించే దుష్ప్రభావాలను సమీక్షించిన అనంతరం 12 క్రిమి సంహారక మందులను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. మరో 6 క్రిమిసంహారక మందులను క్రమంగా వినియోగం నుంచి తొలగించిందని మంత్రి తోమర్ తెలిపారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 46 క్రిమిసంహారక మందులను నిషేధించడమో లేదా వినియోగం నుంచి తొలగించడమే చేసిందని వివరించారు. 4 క్రిమిసంహారక మందుల ఫార్ములేషన్స్‌ను దిగుమతి, తయారీ, విక్రయాల నుంచి నిషేధించామని, నిషేధించిన 5 క్రిమిసంహారక మందులను కేవలం ఎగుమతి చేయడానికి తయారీకి అనుమతించినట్లు గుర్తుచేశారు. మరో 8 క్రిమిసంహారక మందుల తయారీకి అనుమతించిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు మంత్రి వెల్లడించారు. డీడీటీని మాత్రం ప్రజారోగ్య కార్యక్రమాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తున్నట్లు మంత్రి నరేంద్రసింగ్ స్పష్టం చేశారు. తెలిపారు. క్రిమిసంహారక మందులు విషతుల్యమే అయినప్పటికీ నిర్దేశించిన రీతిలో వాటి వినియోగంతో పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. క్రిమిసంహారక మందుల భద్రత, సామర్ధ్యం వంటి అంశాలపై నిరంతరం జరిగే అధ్యయనాలు, నివేదికలు, సమాచారం ఆధారంగా నిపుణులు తరచు సమీక్షలు నిర్వహించి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంటాయని మంత్రి చెప్పారు. -
నిషేధ కాలం తగ్గించండి: భారత రెజ్లర్ సుమిత్ అప్పీల్
డోపింగ్‌లో పట్టుబడటంతో రెండేళ్ల నిషేధానికి గురైన భారత రెజ్లర్ సుమిత్ మలిక్... నిషేధ కాలాన్ని తగ్గించాలంటూ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ)కు అప్పీల్ చేయనున్నాడు. తను తీసుకున్న ఔషధాల్లో నిషేధిత ఉత్ప్రేరకం కలిసి వుండవచ్చని అంగీకరించిన రెజ్లర్ విధించిన నిషేధాన్ని ఏడాదికి తగ్గిస్తే వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాడు. 125 కేజీల కేటగిరీలో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన ఈ ఫ్రీస్టయిల్ రెజ్లర్ సస్పెన్షన్ వేటుతో విశ్వ క్రీడలకు దూరమయ్యాడు. -
నిషేధిత జాబితా.. నెల రోజుల్లో
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల జాబితా (22–ఏ)పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్న భూముల విషయంలో తప్పులున్నాయని, చాలా చోట్ల ప్రభుత్వ భూములు ఈ జాబితాలో లేవని, కొన్నిచోట్ల ప్రజావసరాల కోసం సేకరించి పరిహారం చెల్లించిన భూములూ ఆయా పట్టాదా రుల పేర్ల మీదనే ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం వెంటనే ఈ జాబి తాను మళ్లీ తయారు చేయడంపై దృష్టి పెట్టా లని కలెక్టర్లను ఆదేశించింది. జాబితాలో మార్పుచేర్పులు, తొలగింపుల ప్రక్రియ ప్రారంభించి వారంలో నివేదిక పంపాలని సీసీఎల్ఏ కార్యాలయ వర్గాలు కలెక్టర్లకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. విభజన... ఆధునీకరణ ప్రస్తుతం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖకు అందుబాటులో ఉన్న నిషేధిత భూముల జాబితాలో చాలా మార్పులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా గతంలో ఓ సర్వే నంబర్‌ను పూర్తిగా ఈ జాబితాలో చేర్చిన కారణంగా ఆ సర్వే నంబర్ పరిధిలో భూములున్న పట్టాదారులు కూడా వారి భూముల క్రయవిక్రయ లావాదేవీలు జరగక ఇబ్బందులు పడ్డారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది కేసులున్నాయి. దీంతో ఈ సమస్యను కలెక్టర్లతో సమావేశంలో సీఎం దృష్టికి రెవెన్యూ అధికారులు తీసుకొచ్చారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించడంతో ఇప్పుడు ఆ సర్వే నంబర్లను విభజించే పని ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లకు సీసీఎల్ఏ దిశానిర్దేశం చేసింది. ప్రభుత్వ భూములు, పట్టా భూములను ఒకే సర్వే నంబర్లో సబ్ డివిజన్లుగా చేసి కేవలం ప్రభుత్వ భూములన్న డివిజన్లనే నిషేధిత జాబితాలో ఉంచి మిగిలిన వాటిని ఆ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఇలాంటి తప్పులపై వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు స్వయంగా పరిశీలించి ఆ భూములపై నిర్ణయం తీసుకుంటూ నివేదిక పంపాలని పేర్కొంది. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, భూ పరిపాలన ప్రధాన కమిషనర్లు తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో వివరించింది. అలాగే అనేక సందర్భాల్లో ప్రజావసరాల కోసం సేకరించిన భూములు ఇంకా పట్టాదారుల పేరిటే ఉన్నాయని, రైతులు లేదా పట్టాదారులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాక కూడా ఆ భూముల పట్టాలు వారి పేరిటే ఉండటంతో అనేక ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహకాలను ఈ భూములపై పొందుతున్నారని, వెంటనే వాటిని సవరించాలని కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై జరిగే భూసేకరణలో పరిహారం చెల్లింపునకు ముందే ఆ భూముల సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చాలని కూడా పేర్కొంది. నెల దాటనివ్వద్దు ప్రభుత్వ భూముల పరిరక్షణకు కూడా కలెక్టర్లు నడుంబిగించాలని సీసీఎల్ఏ సూచించింది. ఈ భూముల జాబితాలో ఉన్న తప్పొప్పులను నెల రోజుల్లోగా తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని తెలిపింది. అలాగే భూసేకరణ ద్వారా ప్రభుత్వానికి సంక్రమించిన భూములు, నిషేధిత జాబితాలో చేర్చాల్సిన భూములు, ఆ జాబితా నుంచి తొలగించాల్సిన భూముల వివరాలను నిర్దేశిత ఫార్మాట్లలో వారంలో తమకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో సీసీఎల్ఏ కలెక్టర్లను ఆదేశించింది. -
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం
-
బాక్సైట్ మైనింగ్‌ను పూర్తిగా నిషేధిస్తాం: వైఎస్ జగన్
-
ప్లాస్టిక్ నిషేధం అమలయ్యేనా?
జగిత్యాల : పాలిథీన్(ప్లాస్టిక్) కవర్ల వినియోగం ఎంత ప్రమాదకరమో ఇటీవల జరిగిన సంఘటనలే తెలుపుతున్నాయి. సముద్రంలోని జీవులు సైతం ప్లాస్టిక్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలంటూ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 50 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని ఆదేశాలు సూచిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం నిషేధాజ్ఞలు అమలుకాక కుప్పలుతెప్పలుగా ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్ ప్రమాదకరం ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ ఏళ్లకేళ్లపాటు భూమిలో కరగకుండానే ఉంటాయి. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవడంతోపాటు రోగాలు విజృంభిస్తుంటాయి. ముఖ్యంగా మూగజీవాలు ప్లాస్టిక్ కవర్లు తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికే ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు వాడవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఆశించిన మేర ఫలితం ఇవ్వడం లేదు. మున్సిపల్ కార్యాలయాల్లోనూ ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని ఆదేశించారు. జిల్లాలో మూడు మున్సిపాలిటీలున్నాయి. ముఖ్యంగా కిరాణందారులు, కూరగాయల వ్యాపారులు, పండ్ల వ్యాపారులు, వివిధ దుకాణాల్లో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లనే వాడుతుంటారు. ప్రతి చిన్న వస్తువునైనా ప్లాస్టిక్ కవర్లలోనే ఇస్తున్నారు. అవగాహన కల్పించినా శూన్యమే! ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు వాడవద్దని ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్నారు. కూరగాయల మార్కెట్‌కు వెళ్లేవారు ముఖ్యంగా సంచులు తీసుకెళ్లకపోవడంతో వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లలోనే పెట్టి అందజేస్తున్నారు. అధికారులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగింది. గతంలో పలుమార్లు వారానికోసారి అధికారులు తనిఖీలు చేసే వారు ప్రస్తుతం అలాంటి దాఖలాలు లేవు. అధికారులు నిషేధం అమలును సీరియస్‌గా తీసుకోకపోవడంతో వ్యాపారులు సైతం విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తున్నారు. చెత్తసేకరణతో ఇబ్బందులు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఇంటింటికీ చెత్తసేకరణ చేపడుతుంటారు. గతంలో తడిచెత్త, పొడిచెత్త వేర్వేరుగా సేకరించినప్పటికీ.. ప్రస్తుతం నిలిచిపోయినట్లు ఉంది. జిల్లా కేంద్రంలోని గొల్లపల్లిరోడ్‌లో ఒక డంపింగ్‌యార్డు ఉండగా అంత అందులోనే పోస్తుంటారు. ప్లాస్టిక్ కవర్లను వేరు చేయకపోవడంతో అందులోనే వేసి కాల్చివేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలకు ఆ దుర్గంధం వ్యాపిస్తుంది. విరివిగా ప్లాస్టిక్‌ను వాడడం, డ్రెయినేజీల్లో పడేయడంతో మురికినీరు బయటకు వెళ్లకపోవడంతో రోడ్లపైనే మురికినీరు ప్రవహిస్తున్న సంఘటనలున్నాయి. 50 మైక్రాన్ల కన్నా తక్కువ ఉంటే చర్యలు ముఖ్యంగా 50 మైక్రాన్ల కన్న తక్కవ ఉన్న కవర్లను వాడకూడదని నిబంధనలు తెలుపుతున్నాయి. జిల్లా కేంద్రంలో అనేక చోట్ల 50 మైక్రాన్ల కన్న తక్కువ ఉన్న కవర్లనే వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా పండ్ల విక్రయదారులు, కూరగాయలు, కిరాణందారులు ఎక్కువగా వీటినే వాడుతున్నారు. ప్లాస్టిక్ వాడకూడదు బల్దియా పరిధిలోని వ్యాపారసంస్థలు, కార్యాలయాల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, పాలిథీన్ కవర్లు వాడవద్దు. వ్యాపారసంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తాం. 50 మైక్రాన్ల కన్న తక్కువగా ఉన్న కవర్లు, బాటిళ్లు వాడకూడదు. తనిఖీలు చేపడతాం. ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. - సంపత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ -
మద్యం అమ్మకాలపై కఠిన ఆంక్షలు
సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాల పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పుష్కర ఘాట్లకు 500 మీటర్ల దూరంలో మద్యం అమ్మకాలు నిషేధించినట్లు చెప్పారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని ఘాట్ల వద్ద మద్యం అమ్మకాలు ఉండవని, పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో మద్యం షాపుల వారు కచ్చితంగా సమయం పాటించాలన్నారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో తనిఖీలు జరుగుతాయని, ఎన్ఫోర్స్మెంట్ వారు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తారని చెప్పారు. కృష్ణా జిల్లాలో విజయ బార్ అండ్ రెస్టారెంట్, కృష్ణా బార్ అండ్ రెస్టారెంట్, విజయదుర్గ బార్ అండ్ రెస్టారెంట్, పున్నమి టూరిజం బార్, గుంటూరు జిల్లాలో లోటస్ బార్ అండ్ రెస్టారెంట్స్ మూసివేసినట్లు తెలిపారు. అదే విధంగా కృష్ణా జిల్లాలోని భవానీపురంలో లలితా వైన్స్, ఉయ్యూరులో స్నేహ వైన్స్, కేఎస్ఆర్ వైన్స్, గుంటూరు జిల్లాలోని పెదకూరపాడులో ధరణి ఎంకే వైన్స్, రేపల్లెలో శ్రీచైతన్య వైన్స్, దుగ్గిరాలలో ఎస్ఎస్ వైన్స్‌లు మూసి వేశారు. సిబ్బందిని సమస్యలుంటే ఎకైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ టోల్‌ఫ్రీ నెంబరు: 18004254868కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. -
క్యారీబ్యాగ్స్‌పై నిషేధం
విజయవాడ సెంట్రల్ : పర్యావరణం దృష్ట్యా నగరంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ను నిషేధించినట్లు కమిషనర్ జి.వీరపాండియన్ చెప్పారు. ప్లాస్టిక్ కవర్ల వల్ల భూగర్భజలాలు అడుగంటుతున్నాయన్నారు. షాపుల యజమానులు, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రజారోగ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. నగరంలో పశువులు రోడ్లపై తిరగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. రోడ్లపై కనిపించే పశువుల్ని బందిలిదొడ్డికి తరలిస్తామని హెచ్చరించారు. -
9 నుంచి మాంసం, చేపల విక్రయాలు నిషేధం
విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ప్రజారోగ్యం దృష్ట్యా ఈనెల 9నుంచి 25వ తేదీ వరకు నగరంలో మాంసాహారం, చేపల అమ్మకాలు, జంతువథను నిషేధిస్తున్నట్లు కమిషనర్ జి.వీరపాండియన్ తెలిపారు. 16 రోజులపాటు కబేళాను కూడా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. మాంసాహార విక్రయదారులు ఈ విషయాన్ని గ్రహించి సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించినట్లైతే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. -
‘స్వీట్’గా గుట్కా వ్యాపారం
నిజామాబాద్ క్రైం : గుట్కా అక్రమ వ్యాపారులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. రాష్ట్రంలో గుట్కాపై నిషేధం ఉండడంతో స్వీట్ సుఫారీల మాటున దందా సాగిస్తున్నారు. ఇలా గుట్కాపై నిషేధం అపహాస్యపం పాలవుతున్నా అధికారులు స్పందించడం లేదు. అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పొగాకు సంబంధిత ఉత్పత్తి అయిన గుట్కా నమలడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం వీటిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. పొగాకు ఉత్పత్తులతో తయారైన గుట్కాలను అమ్మడం చట్టరీత్యా నేరం. పొగాకు కలపకుండా కేవలం వక్క పలుకులు, సుగంధ పరిమళం ఉండే పాన్ మసాలా, స్వీట్ సుపారీ, వక్క పొట్లాల అమ్మకంపై ఎటువంటి నిషేధం లేదు. దీనిని గుట్కా దందా చేస్తున్నవారు తమ వ్యాపారానికి అండగా చేసుకున్నారు. నిషేధం లేని పాన్ మసాలా, స్వీట్ సుపారీలను అడ్డం పెట్టుకుని గుట్కాను గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నారు. పాన్ మసాలా, స్వీట్ సుపారీలను బహిరంగంగా విక్రయిస్తూ వీటికి అనుబంధంగా పొగాకు పొడిని ప్రత్యేకంగా అమ్ముతున్నారు. గుట్కాలు కావాల్సిన వారు పాన్ మసాలా, పొగాకు పొడిని మార్కెట్లో ఒకే షాపులో వేర్వేరు ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ రెండింటీనీ కలిపితే గుట్కా తయారవుతుంది. ప్రత్య„ý ంగా పొగాకు ఉత్పత్తులైన గుట్కాలు, ఖైనీలనూ బహిరగంగానే విక్రయిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి.. గుట్కాపై నిషేధం ఉండడంతో రాష్ట్రంలో వాటి తయారీ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో వ్యాపారులు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి గుట్కాలను దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లా సరిహద్దుల్లోని కర్ణాటక ప్రాంతంలో గుట్కా తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పినట్లు తెలుస్తోంది. అక్కడ తయారు చేసిన గుట్కాను మద్నూర్ మీదుగా జిల్లాలోకి రవాణా చేస్తున్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి బోధన్ మీదుగా జిల్లాలోకి చేరవేస్తున్నారు. వీటిని నిషేధం లేని వస్తువుల మధ్యలో ప్యాక్ చేసి ట్రాన్స్‌పోర్టు కంపెనీల ద్వారా రహస్య స్థావరాలకు తీసుకువస్తున్నారు. అనువైన సమయం చూసి జిల్లాలోని దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. గుట్కా వ్యాపారం జిల్లా అంతటా యథేచ్ఛగా సాగుతోంది. ఈ విషయం తెలిసినా పోలీసు, ఎక్సైజ్ శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యాపారాన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి గుట్కా అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. -
ఉస్మానియా ఆసుపత్రి భవనం తొలగింపు?
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని తొలగించేందుకు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. దాన్ని వారసత్వ హోదా నుంచి తొలగించాలని.. ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ప్రతిపాదిస్తూ ఫైలు పంపింది. ఈ ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపితే హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలోని వారసత్వ హోదా కమిటీకి నివేదిస్తారు. ఆ కమిటీ అందుకు అంగీకరిస్తే ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని ఇక సాధారణమైన భవనంగానే పరిగణిస్తారు. ఆ తర్వాత ఆ భవనాన్ని కూల్చివేసి దానిస్థానంలో 24 అంతస్తులతో అత్యాధునిక ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తారు. ‘ఉస్మానియా’కు వందేళ్లకుపైగా చరిత్ర.. 1910 సంవత్సరంలో ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వైద్య సేవల కోసం నిర్మించారు. రెండంతస్తులున్న (జీ+2) ఈ భవ నాన్ని గతంలో పురావస్తు శాఖ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ నేపథ్యంలో దీనిపై వారసత్వ హోదా కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. -
డ్యాన్స్బార్లు బంద్
జూన్‌లో బిల్లు మంత్రి పాటిల్ ప్రకటన సభ ముందుకు రానున్న 13 బిల్లులు శనివారం కూడాఅసెంబ్లీ కొనసాగింపు సాక్షి ముంబైః ఎన్నో అక్రమాలకు కారణమవుతున్న డ్యాన్స్‌బార్లపై నిషేధం విధించాలని ప్రతిపాదిస్తూ ఈ వర్షాకాల సమావేశంలో బిల్లును ప్రవేశపెడతామని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ ప్రకటించారు. వర్షాకాల సమావేశాలు జూన్ రెండో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాల్లో మొత్తం 13 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. వీటిలో పెండింగ్‌లో ఉన్న ఏడు పాత బిల్లులతోపాటు మరో ఆరు కొత్తవి ఉన్నాయి. శాసనసభ సమావేశాల వివరాలు తెలియజేయడానికి హర్షవర్ధన్ పాటిల్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. డ్యాన్స్‌బార్లపై నిషేధం విధించే బిల్లును ఈసారే ప్రవేశపెట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించామని వెల్లడించారు. వీటిపై నిషేధం విధించేందుకు గతంలోనే రాష్ట్ర సర్కారు ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ చట్టం మరింత పటిష్టంగా లేకపోవడంతో న్యాయస్థానం కొట్టివేసింది. డ్యాన్స్‌బార్ల అనుమతులను నవీకరించడాన్ని రాష్ట్రప్రభుత్వం నిలిపివేసింది. ఫలితంగా డ్యాన్స్‌బార్లను ప్రారంభించలేకపోయారు. దీంతో ఈ విషయంపై డ్యాన్స్‌బార్ల యజమాన్యం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు డ్యాన్స్‌బార్ల అనుమతులను ఎందుకు నవీకరించలేదో 15 రోజుల్లోపు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాల సమావేశంలో డ్యాన్స్‌బార్ల నిషేధం బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు హర్షవర్ధన్ పాటిల్ పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయంపై హోంశాఖ మంత్రి ఆర్.ఆర్. పాటిల్ మాట్లాడుతూ డ్యాన్స్‌బార్ల నిషేధంపై గతంలో ప్రభుత్వం అమలు చేసిన చట్టంలోని లోపాలను సరిదిద్దడానికి మరింత పటిష్ట సవరణలు తేవాలా లేక కొత్త బిల్లునే తీసుకురావడమా..? అనే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ విషయంపై వచ్చే వారంలోపు నిర్ణయం తీసుకునే అవకాశముందని పాటిల్ చెప్పారు. జూన్ ఐదున అదనపు బడ్జెట్... వర్షాకాల సమావేశాల సందర్భంగా జూన్ ఐదున పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా గత సమావేశాల్లో కేవలం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్టు ఆర్థికశాఖ మంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పూర్తిస్థాయి బడ్జెట్‌తోపాటు డ్యాన్స్‌బార్ల నిషేధం బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు పాటిల్ వివరించారు. శనివారం కూడా సమావేశాలు కొనసాగుతాయి... జూన్ రెండు నుంచి జూన్ 14వ తేదీ వరకు జరగనున్న వర్షాకాల సమావేశాల్లో శనివారం కూడా సభాకార్యకలాపాలు కొనసాగుతాయని మంత్రి హర్షవర్ధన్ పాటిల్ ప్రకటించారు. సాధారణంగా అసెంబ్లీకి శనివారం, ఆదివారం సెలవుదినాలుగా ప్రకటిస్తారు. కానీ ప్రజాస్వామ్య కూటమి చివరి సమావేశాలు కాబట్టి సెలవు రోజైన శనివారం కూడా కార్యకలాపాలు నిర్వహించి మొత్తం 12 రోజులు భేటీలు కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. అధిక సమయం సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కూడా కోరాయి. 1999లో అధికారంలోకి వచ్చిన కాషాయ కూటమి హయాంలో చివరి సమావేశాలు కేవలం నాలుగు రోజులు జరిగాయి. అదే ప్రజాసామ్య కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు 2004, 2009లో చివరి సమావేశాలను దాదాపు 13 రోజులపాటు కొనసాగించాయని మంత్రి వివరించారు. ఈసారి కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తామని వివరించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభుత్వం పరిపాలన గడువు అక్టోబరు 25తో ముగియనుంది. దీనికి ముందు ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తారని మంత్రి హర్షవర్ధన్ పాటిల్ విశదీకరించారు. రాయిగఢ్ జిల్లా కాలాపూర్‌లో 1980లో డ్యాన్స్‌బార్ల సంస్కృతి మొదలయింది. వీటిలో వ్యభిచారం జరుగుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అశ్లీల నృత్యాల కోసం గ్రామీణ ప్రాంతాల బాలికలను బార్ల నిర్వాహకులు కొనుగోలు చేసినట్టు కూడా విమర్శలు వినిపించాయి. దీంతో శివసేన వంటి పార్టీలు డ్యాన్స్బార్లు నిషేధం కోసం పోరాడాయి.