ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ కీలక నిర్ణయం తీసుకుంది. షావోమీ స్మార్ట్‌ఫోన్‌లు విక్రయించబడని దేశాల్లో షావోమీ స్మార్ట్‌ఫోన్లను బ్లాక్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. కంపెనీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకొని పలు దేశాల్లో షావోమీ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న కస్టమర్లకు బ్లాక్ చేస్తున్నట్లు మెసేజ్ను చూపిస్తుంది. యూఎస్‌తో సహా అనేక దేశాల్లో షావోమీ అధికారికంగా ఉనికి లేదు.
చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..!
క్యూబా, ఇరాన్, సిరియా, ఉత్తర కొరియా, సూడాన్ లేదా క్రిమియా దేశాల్లో షావోమీ స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న యూజర్లకు షావోమీ షాక్ నిచ్చింది. గతవారం నుంచి ఈ స్మార్ట్‌ఫోన్లను షావోమీ బ్లాక్ చేసిందని యూజర్లు సోషల్‌మీడియాలో హైలైట్ చేస్తున్నారు. షావోమీ బ్లాక్ చేస్తూ సందేశాలను కూడా పంపినట్లు యూజర్లు సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఎగుమతి నిబంధనలను ఉల్లంఘించిన దేశాల్లో స్మార్ట్‌ఫోన్ సేవలను బ్లాక్ చేస్తుందని కంపెనీ పాలసీలో ఎక్కడలేదు.
For the past few weeks, Xiaomi has been proactively blocking users from provisioning their phones if they live in Cuba, Iran, Syria, North Korea, Sudan, or Crimea, in order to comply with export regulations and stop resellers. https://t.co/51AdXIMgnW
— Mishaal Rahman (@MishaalRahman) September 9, 2021
చదవండి: Apple : సెప్టెంబర్ 14నే ఐఫోన్-13 రిలీజ్..! కారణం అదేనా..!
Comments
Please login to add a commentAdd a comment