అవనిగడ్డ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం | Avanigadda by election counting starts at hindu college in machilipatnam | Sakshi
Sakshi News home page

అవనిగడ్డ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

Published Sat, Aug 24 2013 10:00 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

Avanigadda by election counting starts at hindu college in machilipatnam

అవనిగడ్డ శాసనసభకు బుధవారం జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ శనివారం మచిలీపట్నంలోని హిందూకళాశాలలో ప్రారంభమైంది. ఇప్పటికి ఐదో రౌండ్ ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయింది. తెలుగుదేశంపార్టీ అభ్యర్థి అంబటి శ్రీహరి ప్రసాద్ (హరిబాబు) తన సమీప ప్రత్యర్థుల కంటే 15,502 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు అవనిగడ్డ నియోజకవర్గ శాసన సభ్యునిగా ఉన్న అంబటి బ్రాహ్మణయ్య తీవ్ర అనారోగ్యంతో ఈ ఏడాది మొదట్లో మరణించారు.



దీంతో ఆ నియోజవర్గం ఖాళీ ఏర్పడింది. అయితే తెలుగుదేశంపార్టీ అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు హరిబాబును ఎన్నికల బరిలోకి దింపింది. కాగా ఆయనకు పోటీ నిలిపేందుకు   రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు నిరాకరించాయి. దీంతో హరిబాబు అభ్యర్థిత్వం ఏకగ్రీవం అయ్యేది. అయితే ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీకి రంగంలోకి దిగటంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement