
సాక్షి, కృష్ణా : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నెరవేర్చారని ఆర్టీసీ కార్మికులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం గన్నవరం ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల కల నేరవేరిందని, వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదని కొనియాడారు.