milk abhishekam
-
సీఎం జగన్‌కు గీత కార్మికుల క్షీరాభిషేకం
భవానీపురం(విజయవాడ పశ్చిమ): గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇస్తున్న ఎక్స్‌గ్రేషియాను రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు, వారి అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి విజయవాడ గొల్లపూడిలో గీత కార్మికులు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ శివరామకృష్ణ పాల్గొన్నారు. చదవండి: Fact Check: ప్రహరీలు తొలగిస్తే ఇళ్లు కూల్చినట్టా? -
ఏపీ : సీఎం కు జీవితాంతం రుణపడి ఉంటామన్న డీఎస్సీ అభ్యర్థులు
-
సీఎం వైఎస్ జగన్‌కి రుణపడి ఉంటాం
-
‘సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం’
సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని వీవోఏ, సంఘమిత్ర, మెప్మా సిబ్బంది తెలిపారు. ఏపీ ప్రభుత్వం వారి జీతాలు మూడు వేల నుంచి 10 వేలకు పెంచడంతో మంగళవారం సంబరాలు చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి మాట్లాడుతూ..ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న గొప్ప నేత వైఎస్ జగన్ అని కొనియాడారు. అనంతరం తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ మంజూరు చేసిన వేలాది మొక్కలను ఇంటింటికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి: ఏపీ ప్రభుత్వం వీవోఏ,ఆర్పీలకు గౌరవ వేతనాన్ని పదివేలు పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం జంగారెడ్డి గూడెం మసీదు సెంటర్లో ఎమ్మెల్యే ఎలీజా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని తెలిపారు. ఆరు నెలల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కనీస వేతనాలు పెంచాలని ఆర్పీలు, వీవోఏలు ధర్నాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్ పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా: తమ గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచడం పట్ల కైకలూరు నియోజకవర్గ బుక్ కీపర్లు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా: సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు శృంగవరపుకోట వీవోఏలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటివరుకు చాలీ చాలని జీతాలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. 10 వేలు వేతనాన్ని పెంచిన సీఎం వైఎస్ జగన్‌కు ఎంతో రుణపడి ఉంటామన్నారు. దేవి కూడలిలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి వీవోఏలు పూలమాలలు వేశారు. తూర్పుగోదావరి: సీఎం వైఎస్ జగన్ పదివేలు గౌరవ వేతనం ప్రకటించడంపై యానిమేటర్లు హర్షం వ్యక్తం చేశారు. ముమ్మిడివరం వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం జగన్ చిత్రపటానికి మెప్మా, ఆర్పీ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. -
ముందే వచ్చిన దీపావళి..
ఎట్టకేలకు వారి కష్టాలు తీరనున్నాయి. ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. వారి శ్రమ ఫలించింది. నమ్మకమైన నాయకుడి చలువతో వారి డబ్బు తిరిగి సొంతం కానుంది. రూ. పదివేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు చెల్లించేనిమిత్తం నిధులు విడుదలయ్యాయి. ఇప్పుడు ఆ కుటుంబాల్లో నిజమైన దీపావళి వచ్చినట్టయింది. విజయనగరం పూల్‌బాగ్: అగ్రిగోల్డ్ బాధితులకు ఎన్నికల ముందు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రిగా ఇప్పుడు నెరవేరుస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.36,97,96,900లు విడుదల చేస్తూ ప్రభుత్వం శుక్రవారం పరిపాలనా పరమైన అనుమతి ఇచ్చింది. ఈ మొత్తాన్ని జిల్లాలోని 34 మండలాల్లో ఉన్న రూ.10వేలు లోపు డిపాజిట్టు కలిగిన 57,941 మందికి పంపిణీ చేయనున్నారు. రూ.20వేల వరకూ డిపాజిట్ చేసినవారికి రావాల్సిన మొత్తం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయించి అందులో తొలి విడతగా శుక్రవారం రూ.264.99 కోట్లు విడుదల చేశారు. దీనిపై అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మోసపోయిన తమను దేవుడిలా జగన్ ఆదుకున్నారని వారంతా సంబరపడుతున్నారు. నాటి ప్రభుత్వ నిర్వాకంతో దాచుకున్న డబ్బులు రావనే భయంలో జిల్లా వ్యాప్తంగా 16 మంది బాధితులు చనిపోయారు. ఐదేళ్లపాటు బాధితులు ఎన్నో పోరాటాలు చేశారు. అప్పటినుంచీ వీరికి వైఎస్సార్సీపీ బాసటగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 1,08,470 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వీరు సుమారుగా రూ.765 కోట్లు డిపాజిట్ చేశారు. అందులో రూ.10వేలు లోపు డిపాజిట్ ఉన్న ఖాతాలకు తొలివిడతగా చెల్లిస్తామని చెప్పడం ద్వారా 57,941 మందికి లబ్ధి చేకూరనుంది. చీపురుపల్లి: అగ్రిగోల్డ్ బాధితులకు తొలి విడతలో రూ.260 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఎంతో రుణపడి ఉంటామని అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులు తెలిపారు. అగ్రిగోల్డ్‌లో రూ.10 వేలు లోపు డిపాజిట్‌దారులకు చెల్లించేలా సీఎం నిధులు విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ స్థానిక మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు తొలివిడతలో చెల్లించేలా నిధులు విడుదల చేశారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు ఐదేళ్లు అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేశారు తప్ప న్యాయం చేయలేదన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇప్పిలి తిరుమల, పతివాడ రాజారావు, మల్లెంపూడి శ్రీను, అప్పికొండ ఆదిబాబు, బి.టి.ఆర్ యాదవ్, కుప్పిలి సురేష్, మహంతి రవి, సతివాడ అప్పారావు, కింతలి మధు తదితరులు పాల్గొన్నారు. ఫలించిన పోరాటం.. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు రూ.10వేలలోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లించేలా తొలివిడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.265 కోట్లు విడుదల చేయడం హర్షణీయం. నాలుగున్నరేళ్లుగా అవిశ్రాంత పోరాట పలితమే ఇది. బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మిగిలిన బాధితులందరికీ సత్వరమే చెల్లించేలా చూడాలి. – పి కామేశ్వరరావు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ ,ఉత్తరాంధ్ర గౌరవాధ్యక్షుడు. ఆనందంగా ఉంది.. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో పేర్కొన్నట్టే రూ.10వేల లోపు డిపాజిట్‌దారులందరికీ జిల్లా కలక్టర్ ద్వారా పంపిణీ చేయటానికి ఉత్తర్వులు జారీ చేయటం హర్షణీయం. డబ్బులు విడుదల చేసిన ముఖ్యమంత్రికి, మంత్రి బొత్స సత్యనారాయణకు, జిల్లా అగ్రిగోల్డ్ కస్టమర్స్, అండ్ ఏజెంట్స్ అసోసియేషన్, బాధితుల బాసట కమిటీ తరఫున ధన్యవాదాలు. ప్రతి బాధితుడికీ న్యాయం చేయాలని కోరుతున్నాను. – మజ్జి సూరప్పడు, అగ్రిగోల్డ్ బాసట కమిటీ, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం. కనీసం స్పందించని గత ప్రభుత్వం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఐదేళ్లుగా ఎన్నో పోరాటాలు చేశాం. అయినా గత టీడీపీ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. అప్పటికే చాలా మంది బాధితులు చనిపోయారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముదావహం. – మజ్జి బంగార్రాజు, అగ్రిగోల్డ్ ఏజెంట్, డెంకాడ మండలం, విజయనగరం. -
ఆపద్బాంధవుడికి కృతజ్ఞతగా..
రణస్థలం: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు రూ.265 కోట్లు విడుదల చేసిన సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్ర సమయంలో ప్రజల కష్టాలను ముఖ్యమంత్రి జగన్ దగ్గర నుంచి చూశారు, రైతుల అకలి బాధలను తెలుసుకున్నారు, అగ్రిగోల్డ్ బాధితుల గొడును విన్నారు.. నేడు అధికారంలోని వచ్చిన అనతికాలంలోనే ఒక్కొక్కటిగా పరిష్కారిస్తున్నారన్నారు. రూ.10 వేల లోపు ఉన్న డిపాజిట్లు చెల్లించడం పేదలకు శుభపరిణామని కొనియాడారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే రూ.1150 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలిచిందన్నారు. ధర్నాలు, దీక్షలు, ర్యాలీలు నిర్వ హించామన్నారు. దీనికి బయపడిన చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితుల వివరాలు సేకరించినా.. డిపాజిట్లు చెల్లించడంలో విఫలమైయ్యా రని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వై ఎస్సార్సీపీ నాయకులు పిన్నింటి సాయికుమా ర్, ఎల్.శ్రీనివాసరావు, పచ్చిగుళ్ల సాయిరాం, దన్నాన సీతారాం, ఆర్.ఎస్.రెడ్డి, జనార్దన్, జైనీ లక్ష్మణ, రెడ్డి అప్పలనాయుడు, బెండు రామరావు, అగ్రిగోల్డ్ ఏజెంట్లు వి.వి.రామకృష్ణ, సి.హెచ్.శ్రీనివాసరావు, కరిమజ్జి నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు. మాటకు కట్టుబడిన వ్యక్తిగా.. టెక్కలి: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి అని, పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ మేరకు మొదట విడతగా రూ.264.99 కోట్ల నిధులను విడుదల చేశారని వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. శనివారం టెక్కలిలోని తన స్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 45,833 మంది డిపాజిటర్లు ఉన్నారని, వారికి రూ. 31,41,59,741లు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. పేద, సామాన్య వర్గాల ప్రజలు వారి అవసరాల కోసం అగ్రిగోల్డ్‌లో డిపాజిట్ చేసుకుంటే, చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కలిసి ఆ డబ్బులను దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచిన సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కుల, మత, రాజకీయ విభేదాలు లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక విధానం పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఇందులో నాటి మంత్రి అచ్చెన్నాయుడుకు పెద్ద ఎత్తున కమీషన్లు ముట్టా యని ఆరోపించారు. జిల్లాలో రౌడీ రాజకీయాలు కింజ రాపు కుటుంబంలోనే ఆరంభమయ్యా యని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలన్నారు. ఇప్పటికైనా పారదర్శక పాలనకు సహకరించకపోతే భవిష్యత్‌లో టీడీపీ పూర్తిగా గల్లంతు కావడం ఖాయమన్నారు. అధికారంలోకి రాగానే ఆదుకున్నారు .. టెక్కలి: తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రూ.264.99 కోట్లు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. శనివారం టెక్కలి వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బి.గౌరీపతి, బగాది హరి, బి.ఉదయ్, చిన్ని జోగారావు, జి.గురునాథ్ యాదవ్, కురమాన కృష్ణారావు, శంకర్, శ్యామలరావు, మదీన్, పి.రమణ, కె.నారాయణమూర్తి, ఎం.భాస్కర్, పి.వెంకటరావు, జె.జయరాం, బి.తులసీ, యర్రన్న తదితరులు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
సాక్షి, కృష్ణా : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నెరవేర్చారని ఆర్టీసీ కార్మికులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం గన్నవరం ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల కల నేరవేరిందని, వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదని కొనియాడారు. -
బీసీల హక్కులకోసం పోరాటం
రాష్ట్ర బీసీ సేన అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ షాబాద్: సమాజంలో బీసీల హక్కుల కోసం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు నయీంతో సంబంధాలు లేవని కేసు ఉపసంహరించుకోవడంతో ఆదివారం షాబాద్ మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సేన అధ్యక్షుడు బర్క కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను అన్ని రంగాల్లో ఆదుకోవాలని కోరారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి రూ.20 వేల కోట్ల బడ్జెను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లు 34 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేయడంతో బీసీల్లో సంతోషం వ్యక్తం అవుతుందని ప్రజలు రుణపడి ఉంటారని చేప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గం ప్రచార కార్యదర్శి వెంకటస్వామి, బీసీ సేన మండల అధ్యక్షుడు రాజు, నాయకులు మల్లేష్, నారాయణ, రమేష్, నవీన్, రాములు, జంగయ్య తదితరులు ఉన్నారు. -
ప్రజల గుండెల్లో పదిలం
హిందూపురం అర్బన్ : అధికార దర్పంతో విజయవాడలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించినా ఆయన ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారని వైఎస్సార్ అభిమానులు వెంకటేష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, కౌన్సిల్ ప్రతిపక్షనేత శివ అన్నారు. ఆదివారం పట్టణంలో వెంకటేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ పరిగి బస్టాండులో ఉన్న రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం విజయవాడలో వైఎస్ విగ్రహం తొలగింపును నిరసిస్తూ నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడాన్ని జీర్ణించుకోలేక టీడీపీ ప్రభుత్వం ఇలాంటి కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని వారు విమర్శించారు. తొలగించిన విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్సార్ అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో అభిమాన సంఘ నాయకులు మదన్‌మోహన్‌రెడ్డి, అశోక్, మదన్‌గోపాల్‌రెడ్డి, రెడ్డి సంఘం రాష్ట్రకార్యదర్శి నరేష్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, నాగరాజు, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, ఆసీఫ్‌వుల్లా, జబీవుల్లా, అంజినప్ప, షాజియా, రజనీ, నాయకులు రమేష్, నర్సిరెడ్డి, రియాజ్, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.