
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి విజయవాడ గొల్లపూడిలో గీత కార్మికులు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు.
భవానీపురం(విజయవాడ పశ్చిమ): గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇస్తున్న ఎక్స్‌గ్రేషియాను రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు, వారి అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి విజయవాడ గొల్లపూడిలో గీత కార్మికులు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ శివరామకృష్ణ పాల్గొన్నారు.
చదవండి: Fact Check: ప్రహరీలు తొలగిస్తే ఇళ్లు కూల్చినట్టా?