Kallu geeta karmika sangham
-
కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కల్లు తీస్తూ ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి మరణించిన, శాశ్వత అంగవైకల్యం బారిన పడే కల్లు గీత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ గీత కార్మిక భరోసా’ పథకాన్ని ప్రకటించింది. ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబానికి కూడా రూ.10లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. చెట్టుపై నుంచి పడి శాశ్వత అంగవైకల్యం బారినపడే కల్లుగీత కార్మికునికి కూడా రూ.10లక్షలు పరిహారం అందిస్తారు. ఇందులో రూ.5 లక్షలు కార్మిక శాఖ, మరో రూ.5లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా రూపంలో అందిస్తాయి. కల్లు తీస్తూ ప్రమాదవశాత్తూ అంగవైకల్యం బారిన పడినవారు దరఖాస్తు చేసుకుంటే ఎక్సైజ్ శాఖ నిబంధనలకు అనుగుణంగా వైకల్యం సర్టిఫికెట్‌ను జారీచేస్తుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన రాష్ట్ర కల్లుగీత విధానం 2022–2027 ప్రకారం ఈ పరిహారాన్ని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. కల్లు గీత కార్మికులకు నిజమైన భరోసా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ‘వైఎస్సార్ గీత కార్మిక భరోసా’ పథకం రాష్ట్రంలోని లక్షలాది మంది గీతకార్మిక కుటుంబాలకు అండగా నిలవనుంది. రాష్ట్రంలో 95,245 కల్లు గీత కుటుంబాలు తమ కులవృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఏటా 1,200 మంది గీత కార్మికులు కల్లు తీస్తూ ప్రమాదానికి గురవుతున్నారు. వారిలో దాదాపు 40శాతం మంది దుర్మరణం చెందుతుండగా మిగిలిన వారు శాశ్వతంగా వైకల్యం బారినపడుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రమాదవశాత్తూ మరణించిన కుటుంబాలకు రూ.2లక్షలే పరిహారంగా అందించేవారు. దీనిని పెంచాలని గీత కార్మిక కుటుంబాలు డిమాండ్ చేయడంతో చంద్రన్న బీమా పథకం నుంచి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ సక్రమంగా అమలుచేయలేదు. ఈ నేపథ్యంలో.. ఎవరూ డిమాండ్ చేయకుండానే ప్రమాదవశాత్తూ మరణించే, శాశ్వతంగా వైకల్యం బారినపడే కల్లు గీత కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10లక్షల పరిహారాన్ని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తద్వారా కల్లు గీత వృత్తిపై ఆధారపడిన 95,245 కుటుంబాలకు ముఖ్యమంత్రి భరోసానిచ్చారు. చదవండి: ప్రకృతి ప్రియులకు స్వర్గధామం.. చుట్టూ నీరు, మధ్యలో ఊరు -
కల్లుగీత..రాత మారేలా..! సీఎం వైఎస్ జగన్ చొరవతో తీరిన కష్టాలు
రాత్రనక..పగలనక చెట్టుకు లొట్టి కట్టి కల్లు గీసే కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం మొత్తం బాధ పడేవాళ్లు. అదే కాలో చెయ్యో విరిగితే విధి రాత అనుకొని తమను తామే నిందించుకొనే వారు. ఇదంతా గతం. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కల్లుగీత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా పలు పథకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేశారు. ఆర్థిక భద్రతతో పాటు ఎందులోనూ వారు నష్టపోకుండా భరోసా కల్పించారు. దీంతో జిల్లాలో దాదాపు 2500 మంది కల్లు గీత కార్మికుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. పొదిలి రూరల్(ప్రకాశం జిల్లా): కల్లుగీత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వారికి భరోసా కల్పిస్తున్నాయి. జిల్లాలో పెద్దగా నీటి వనరులు లేకపోవడంతో ఈత, తాటి వనాల సంఖ్య తక్కువగా ఉన్నాయి. జిల్లాలో మొత్తం 11 టీసీఎస్ సొసైటీలు (తాడీ కో–ఆపరేటివ్ సొసైటీలు) ఉన్నాయి. అవి ఒంగోలు, టంగుటూరు, కనపర్తి, చీమకుర్తి, పొదిలి, పెదారికట్ల, మర్రిపూడి, కనిగిరి, పామూరు, గిద్దలూరు, నాగులుప్పలపాడు ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కొక్క సొసైటీలో 10 నుంచి 15 మంది లోపు సభ్యులుంటారు. 136 కల్లు దుకాణాలు ఉన్నాయి. టీఎఫ్టీలు (ట్రీ ఫర్ ట్యాఫర్) కల్లు గీసేవారు 2300 మంది ఉన్నారు. దాదాపు 25 వేల చెట్లు ఉన్నాయి. ఈ క్రమంలో కల్లు గీతనే వృత్తిగా చేసుకొని జీవిస్తున్న కుటుంబాలు పరిస్థితి దుర్భరంగా మారింది. ఆశించిన ఆదాయం లేదు..ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేవు. ఇలాంటి తరుణంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గీత కార్మికుల జీవితాలకు బలమైన ఆర్థిక పునాదులు వేస్తోంది. పరిహారం పెంచి..భరోసానిచ్చి: కల్లు గీసే సమయంలో కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే గతంలో వైఎస్సార్ బీమా పరిహారం కింద రూ.5 లక్షలు చెల్లించేవారు. దీనిని తాజా ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచింది. ఇందులో వైఎస్సార్ బీమా రూ.5 లక్షలతో పాటు ఎక్స్‌గ్రేషియా కింద మరో రూ.5 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనికి వైఎస్సార్ గీత కార్మిక భరోసా పథకంగా పేరు పెట్టారు. అంతేగాక ఐదేళ్ల కాల పరిమితితో కల్లు గీత విధానాన్ని ఖరారు చేసినట్లుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఖరారు చేసిన కల్లు గీత పాలసీ 2022 నుంచి 2027 సెప్టెంబరు 30 వరకు అమలులో ఉంటుంది. ఈ పథకం అమలుతో గౌడ, శెట్టిబలజ, ఈడిగ, కులాలకు చెందిన కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఈ నిర్ణయంతో జిల్లాలో దాదాపు 2500 మందికి ప్రయోజనం కలగనుంది. కల్లు అద్దెలను (కిస్తీలను) ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ప్రత్యామ్నాయ మార్గం... కల్లు గీత సొసైటీలలో గీసే వానికి చెట్టు పథకం, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో షెడ్యూల్డ్ జాతుల వారు కల్లు గీసుకోవడం కోసం ఐదేళ్లకు లైసెన్స్ కూడా ఇస్తారు. ఒక వేళ ఎవరైనా కార్మికులు కల్లు గీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యానికి గురైతే ప్రత్యామ్నాయ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆదాయ మార్గాలను చూపిస్తారు. అలాగే వైఎస్సార్ బీమా ద్వారా నష్ట పరిహారం చెల్లిస్తారు. అంతే కాదు ఎన్ఆర్ఈజీఎస్.షెల్టర్బెడ్ అభివృద్ధి పథకం కింద తాటి, ఈత చెట్ల పెంపకానికి చర్యలు తీసుకుంటారు. కాలువ గట్లు నదీ, సాగర తీరాలను పటిష్టం చేస్తూ కల్లు గీతకు కావాల్సిన తాటి, ఈత చెట్లను సంవృద్ధిగా పెంచనున్నారు. జగనన్న మేలు మరువలేం కల్లు గీత కార్మికుల కష్టాలను గుర్తించి వారి అభ్యున్నతికి పాటు పడుతున్న సీఎం జగన్మోహన్రెడ్డి చేసిన మేలు ఎప్పటికీ మరువలేం. కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. దీన్ని అందరూ స్వాగతిస్తున్నారు. కల్లుగీత కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. – జూపల్లి ఏడుకొండలు, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్, డైరెక్టర్, పొదిలి మండలం గీత కార్మికులకు భరోసా ఏర్పడింది కల్లు గీత కార్మికులకు ప్రమాద బీమా పెంచడం మంచి పరిణామం. గతంలో కల్లుగీత కార్మికుల జీవితాలు ఎంతో దుర్భరంగా ఉండేవి. మా స్థితిగతులను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కిస్తీలను రద్దు చేయడం, మరికొన్ని సమస్యలను పరిష్కరించడంతో ఎంతో భరోసా ఏర్పడింది. ఆయనకు గీత కార్మిక కుటుంబాలు రుణపడి ఉంటాయి. – కంచర్ల కోటయ్య గౌడ్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్, గిద్దలూరు ఎక్స్‌గ్రేషియాపై హర్షం గీత కార్మికుల సమస్యలపై సీఎం జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచారు. గీత కార్మికుల కష్టాలు గుర్తించి వారి సంక్షేమానికి పాటు పడిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు. వీరి నిర్ణయంపై గీత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – రామచంద్రరావు, ప్రకాశం జిల్లా కల్లుగీత కార్మికుల సంఘం అధ్యక్షుడు నూతన పాలసీతో ఎంతో మేలు ప్రభుత్వం చేపట్టిన నూతన పాలసీ విధానంతో కల్లుగీత కార్మికుల కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు ఇచ్చేవారు. నూతన పాలసీ వలన గతంలో ఇస్తున్న ప్రమాద బీమాతో పాటు మరో రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నారు. దీంతో ఆ కుటుంబాలకు ఆర్థికంగా చేయూత ఇచ్చినట్లువుతుంది. అంతేగాక సాధారణ ప్రమాదం జరిగి కాలు, చేయి విరిగితే అటువంటి వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపించింది. – రాయపాటి హనుమంతారావు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి -
సీఎం జగన్‌కు గీత కార్మికుల క్షీరాభిషేకం
భవానీపురం(విజయవాడ పశ్చిమ): గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇస్తున్న ఎక్స్‌గ్రేషియాను రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు, వారి అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి విజయవాడ గొల్లపూడిలో గీత కార్మికులు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ శివరామకృష్ణ పాల్గొన్నారు. చదవండి: Fact Check: ప్రహరీలు తొలగిస్తే ఇళ్లు కూల్చినట్టా? -
గౌడ జాతి అభ్యున్నతికి ప్రభుత్వ చర్యలు అభినందనీయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కల్లుగీత వృత్తికి ఊపిరి పోసేలా ప్రభుత్వ కొత్త గీత విధానం ఉందని, గీత వృత్తిదారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కౌండిన్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలపాటి వెంకటేశ్వరరావు చెప్పారు. చలపాటి ఆధ్వర్యంలో విజయవాడ సమీపంలోని పాతపాడులో సీఎం వైఎస్ జగన్‌కు ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ గీత కార్మికులు మోకు మోస్తాదులతో కృతజ్ఞత ప్రదర్శన నిర్వహించారు. అనంతరం చెన్నకేశవస్వామి ఆలయం సెంటర్లో సీఎం జగన్, మంత్రి జోగి రమేష్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చలపాటి మాట్లాడుతూ కొత్తగా వైఎస్సార్ గీత కార్మిక భరోసా పథకాన్ని ప్రకటించడంతో పాటు.. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గౌడ జాతి అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం విజయవాడ నగర అధ్యక్షుడు వీరంకి రామచంద్రరావు, నగర నాయకుడు మాదు సాంబశివరావు, పాతపాడు ఎంపీటీసీ సభ్యుడు మరీదు బాలకోటేశ్వరరావు, సంఘ నాయకులు బెజవాడ ఏడుకొండలు, పలగాని రాంబాయి, పామర్తి శ్రీనివాసరావు, ఆరేపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
కల్లు గీత నూతన పాలసీతో లక్ష కుటుంబాలకు ప్రయోజనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కల్లు గీత నూతన పాలసీని అమలులోకి తేవడం వల్ల గీత కార్మికులకు చెందిన సుమారు లక్ష కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ స్పష్టం చేశారు. కల్లు గీత నూతన పాలసీని అమలులోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేయడంపై మంత్రి రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కల్లు గీత కార్మికుల సంక్షేమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. నూతన పాలసీ అమలుతో గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, ఈత, శ్రిసయిన కులాలకు చెందిన కుటుంబాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కల్లు దుకాణాల అద్దెలను (కిస్తిలను) ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం, కల్లు గీచే వారికే చెట్టు పథకం, షెడ్యూల్డ్ ప్రాంతాలలో షెడ్యూల్డ్ జాతులు వారు కల్లు గీసుకోవడం కోసం ఐదు సంవత్సరాలు అనుమతి ఇవ్వడం వంటి నిర్ణయాలు బలహీన వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుందని వివరించారు. అదే విధంగా ప్రమాదవశాత్తు చనిపోయిన కల్లుగీత కార్మికులకు చెల్లించే పరిహారాన్ని రూ.ఐదు లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచడం, ప్రమాదానికి గురై అంగ వైకల్యం చెందిన వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించడం, కల్లుగీత కార్మికుడు సహజంగా మరణిస్తే కుటుంబానికి రూ. 5 లక్షలు బీమా కింద అందచేయడం బాధిత కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తుందని తెలిపారు. నదీతీరాలు, కాల్వగట్లు, మీద తాటి, ఈత చెట్ల పెంపకం ద్వారా కార్మికులకు మరింత ఆదాయం వచ్చే విధంగా ఐదు సంవత్సరాల పాలసీని తీసుకురావడం హర్షణీయమని మంత్రి రమేశ్ పేర్కొన్నారు. -
ఏపీలో కల్లు కిస్తీలు రద్దు.. ఐదేళ్లకు కల్లుగీత పాలసీ మార్గదర్శకాలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీలో కల్లుగీత వృత్తిపై ఆధారపడిన కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. మద్యం నియంత్రణ విధానానికి అనుగుణంగా కల్లుగీత కార్మికుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఐదేళ్ల విధానాన్ని ప్రకటించింది. 2022 నుంచి 2027 వరకు కాలానికి కల్లు గీత విధానం (పాలసీ) అమలులో ఉంటుంది. దీనివల్ల రాష్ట్రంలోని 95,245 కల్లు గీత కార్మిక కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. కల్లుగీత లైసెన్సింగ్ విధానం కూడా అత్యంత పారదర్శకంగా జరిగేలా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు. పరిహారం పెంపు.. తాటిచెట్ల పెంపకానికి ప్రాధాన్యత ► కల్లు రెంటల్స్ (కిస్తీలు)ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. రాష్ట్రంలో కల్లుగీత కార్మిక సొసైటీలు, గీచే వానికి చెట్టు పథకం, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో షెడ్యూల్డ్ జాతుల వారు కల్లు గీసుకోవడం కోసం ఐదేళ్లకు అనుమతి(లైసెన్స్) ఇస్తారు. ► కల్లు గీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యానికి గురైన కార్మికులకు ప్రత్యామ్నాయ నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారా తగిన శిక్షణ ఇచ్చి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూపిస్తారు. వైఎస్సార్ బీమా ద్వారా నష్టపరిహారం చెల్లిస్తారు. ► కల్లుగీస్తూ ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు. ఇందులో రూ.5 లక్షలు వైఎస్సార్ బీమా ద్వారా, మిగిలిన రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. ► కల్లు గీత కార్మికుడు సహజ మరణం చెందితే అతని కుటుంబానికి వైఎస్సార్ బీమా పథకం ద్వారా రూ.5 లక్షల పరిహారం అందజేత. ► ఎన్ఆర్ఈజీఎస్, షెల్టర్ బెడ్ అభివృద్ధి పథకాల కింద తాటి, ఈత వంటి చెట్లను పెంచేలా చర్యలు తీసుకుంటారు. ప్రధానంగా కాలువ గట్లు, నదీ, సాగర తీరాలను పటిష్టం చేస్తూ కల్లు గీతకు కావాల్సిన తాటి, ఈత చెట్లను సమృద్ధిగా పెంచడానికి చర్యలు తీసుకుంటారు. -
నూతన కల్లు విధానం రూపొందించాలి
-గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ హన్మకొండ(వరంగల్ జిల్లా) రాష్ట్రంలో నూతన కల్లు విధానం రూపొందించాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న బస్సుయూత్ర సన్నాహక సమావేశం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ఎక్సైజ్ విధానమే ఇప్పటికీ ఉందని, దీన్ని మార్పు చేయూలని అన్నారు. గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సర్వాయి పాపన్న పాలించిన ఖిలాషాపురం కోట నుంచి ఆగస్టు 1న బస్సు యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తుందన్నారు. 1న ఖిలాషాపురంలో ప్రారంభమై 2న వరంగల్‌కు చేరుకుంటుందని, 3న భువనగిరి, 4న నల్లగొండ, 5న ఖమ్మం, 6న కరీంనగర్, అదిలాబాద్, 7న నిజామాబాద్, 8న మెదక్, 9వ తేదీన మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో యాత్ర కొనసాగుతుందని, 10వ తేదీన హైదరాబాద్‌లోని గోల్కొండ కోట వద్ద ముగుస్తుందని వివరించారు. ఆగష్టు 18న సర్వాయి పాపన్న జయంతిని గ్రామగ్రామాన జరపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.