-గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ
హన్మకొండ(వరంగల్ జిల్లా)
రాష్ట్రంలో నూతన కల్లు విధానం రూపొందించాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న బస్సుయూత్ర సన్నాహక సమావేశం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ఎక్సైజ్ విధానమే ఇప్పటికీ ఉందని, దీన్ని మార్పు చేయూలని అన్నారు. గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సర్వాయి పాపన్న పాలించిన ఖిలాషాపురం కోట నుంచి ఆగస్టు 1న బస్సు యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తుందన్నారు. 1న ఖిలాషాపురంలో ప్రారంభమై 2న వరంగల్‌కు చేరుకుంటుందని, 3న భువనగిరి, 4న నల్లగొండ, 5న ఖమ్మం, 6న కరీంనగర్, అదిలాబాద్, 7న నిజామాబాద్, 8న మెదక్, 9వ తేదీన మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో యాత్ర కొనసాగుతుందని, 10వ తేదీన హైదరాబాద్‌లోని గోల్కొండ కోట వద్ద ముగుస్తుందని వివరించారు. ఆగష్టు 18న సర్వాయి పాపన్న జయంతిని గ్రామగ్రామాన జరపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
నూతన కల్లు విధానం రూపొందించాలి
Published Thu, Jun 30 2016 6:58 PM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM
Advertisement