ప్రజల గుండెల్లో పదిలం
హిందూపురం అర్బన్ : అధికార దర్పంతో విజయవాడలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించినా ఆయన ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారని వైఎస్సార్ అభిమానులు వెంకటేష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, కౌన్సిల్ ప్రతిపక్షనేత శివ అన్నారు. ఆదివారం పట్టణంలో వెంకటేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ పరిగి బస్టాండులో ఉన్న రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం విజయవాడలో వైఎస్ విగ్రహం తొలగింపును నిరసిస్తూ నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడాన్ని జీర్ణించుకోలేక టీడీపీ ప్రభుత్వం ఇలాంటి కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని వారు విమర్శించారు. తొలగించిన విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్సార్ అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో అభిమాన సంఘ నాయకులు మదన్‌మోహన్‌రెడ్డి, అశోక్, మదన్‌గోపాల్‌రెడ్డి, రెడ్డి సంఘం రాష్ట్రకార్యదర్శి నరేష్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, నాగరాజు, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, ఆసీఫ్‌వుల్లా, జబీవుల్లా, అంజినప్ప, షాజియా, రజనీ, నాయకులు రమేష్, నర్సిరెడ్డి, రియాజ్, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.