బీసీల హక్కులకోసం పోరాటం | Fight for BC Right's | Sakshi
Sakshi News home page

బీసీల హక్కులకోసం పోరాటం

Published Sun, Sep 18 2016 6:51 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

బీసీల హక్కులకోసం పోరాటం - Sakshi

బీసీల హక్కులకోసం పోరాటం

రాష్ట్ర బీసీ సేన అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్‌

షాబాద్: సమాజంలో బీసీల హక్కుల కోసం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు నయీంతో సంబంధాలు లేవని కేసు ఉపసంహరించుకోవడంతో ఆదివారం షాబాద్‌ మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సేన అధ్యక్షుడు బర్క కృష్ణ యాదవ్‌ మాట్లాడుతూ.. బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను అన్ని రంగాల్లో ఆదుకోవాలని కోరారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి రూ.20 వేల కోట్ల బడ్జెను కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లు 34 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు కల్యాణలక్ష్మి  పథకం వర్తింపజేయడంతో బీసీల్లో సంతోషం వ్యక్తం అవుతుందని ప్రజలు రుణపడి ఉంటారని చేప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గం ప్రచార కార్యదర్శి వెంకటస్వామి, బీసీ సేన మండల అధ్యక్షుడు రాజు, నాయకులు మల్లేష్‌, నారాయణ, రమేష్‌, నవీన్‌, రాములు, జంగయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement