BC rights
-
బీసీల హక్కులకు భంగం కలిగితే పోరాటాలే
కేంద్రం ఒప్పుకోదని తెలిసీ కేసీఆర్ నాటకాలు: రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు రిజర్వేషన్ల పేరుతో కేసీఆర్ చేస్తున్న రాజకీయం వల్ల బీసీల హక్కులకు భంగం కలిగితే వీధి పోరాటాలకు దిగుతామని టీటీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి హెచ్చ రించారు. శనివారం అసెంబ్లీలో జరిగిన టీటీడీఎల్పీ విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్ర శేఖర్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. రేవంత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీలకు మేలు చేయాలనుకుంటే ముస్లిం మైనారిటీలకు 12 శాతంతోపాటు బీసీలకు 52 శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్లింల రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించదని, కోర్టులు అనుమతించవనే విషయం తెలిసిన కేసీఆర్.. ముస్లింలను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. బీసీ–ఇ గ్రూపులోని రిజర్వే షన్లు మాత్రమే పెంచుతామని చెబుతున్న కేసీఆర్‌కు బీసీల్లోని ఏ, బీ, సీ, డీ గ్రూపు ల్లోని కులాల వారు మనుషుల్లా కనిపించడంలేదా అని కృష్ణయ్య ప్రశ్నించారు. -
బీసీల హక్కులకోసం పోరాటం
రాష్ట్ర బీసీ సేన అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ షాబాద్: సమాజంలో బీసీల హక్కుల కోసం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు నయీంతో సంబంధాలు లేవని కేసు ఉపసంహరించుకోవడంతో ఆదివారం షాబాద్ మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సేన అధ్యక్షుడు బర్క కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను అన్ని రంగాల్లో ఆదుకోవాలని కోరారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి రూ.20 వేల కోట్ల బడ్జెను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లు 34 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేయడంతో బీసీల్లో సంతోషం వ్యక్తం అవుతుందని ప్రజలు రుణపడి ఉంటారని చేప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గం ప్రచార కార్యదర్శి వెంకటస్వామి, బీసీ సేన మండల అధ్యక్షుడు రాజు, నాయకులు మల్లేష్, నారాయణ, రమేష్, నవీన్, రాములు, జంగయ్య తదితరులు ఉన్నారు. -
'పావురాల ఘటన కలిచివేసింది'
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పావురాల ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే తాము వారి తరుపున పోరాటానికి దిగుతామని చెప్పారు