బీసీల హక్కులకు భంగం కలిగితే పోరాటాలే
కేంద్రం ఒప్పుకోదని తెలిసీ కేసీఆర్ నాటకాలు: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు రిజర్వేషన్ల పేరుతో కేసీఆర్ చేస్తున్న రాజకీయం వల్ల బీసీల హక్కులకు భంగం కలిగితే వీధి పోరాటాలకు దిగుతామని టీటీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి హెచ్చ రించారు. శనివారం అసెంబ్లీలో జరిగిన టీటీడీఎల్పీ విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్ర శేఖర్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు.
రేవంత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీసీలకు మేలు చేయాలనుకుంటే ముస్లిం మైనారిటీలకు 12 శాతంతోపాటు బీసీలకు 52 శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్లింల రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించదని, కోర్టులు అనుమతించవనే విషయం తెలిసిన కేసీఆర్.. ముస్లింలను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. బీసీ–ఇ గ్రూపులోని రిజర్వే షన్లు మాత్రమే పెంచుతామని చెబుతున్న కేసీఆర్‌కు బీసీల్లోని ఏ, బీ, సీ, డీ గ్రూపు ల్లోని కులాల వారు మనుషుల్లా కనిపించడంలేదా అని కృష్ణయ్య ప్రశ్నించారు.