కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరా రెడ్డి హాజరయ్యారు.
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పావురాల ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే తాము వారి తరుపున పోరాటానికి దిగుతామని చెప్పారు