BC cell
-
బీసీ సీఎంలకూ సాధ్యం కాలేదు
సాక్షి, అమరావతి: కుల వృత్తులతో తరతరాలుగా సమాజానికి సేవలందిస్తున్న బీసీ సామాజిక వర్గాలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్థిక తోడ్పాటుతోపాటు రాజకీయంగా ఉన్నత అవకాశాలు కల్పిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని బీసీ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ప్రతి పనిలోనూ బీసీల శ్రమ, కృషి దాగుందన్నారు. బీసీల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మూడున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న కృషిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీసీలే ముఖ్యమంత్రులుగా ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ బలహీన వర్గాలకు ఇంత సంక్షేమం సాధ్యం కాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని 175 స్థానాల్లోనూ గెలిపించి సీఎం జగన్ రుణం తీర్చుకుంటామని, మరో 30 ఏళ్లు ఆయనే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన బీసీ ప్రజా ప్రతినిధుల సమావేశం జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బీసీ నేతలు మాట్లాడారు. త్వరలో 26 జిల్లాల్లోనూ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో బీసీ ప్రజా ప్రతినిధులు సామాజిక న్యాయానికి పెద్దపీట: బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి సామాజిక న్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 137 కార్పొరేషన్లకు సంబంధించి 484 పదవులు ఇస్తే 243 బీసీలకే ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. మూడున్నరేళ్లలో డీబీటీ ద్వారా వారికి దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చాం. పోరాడే బాధ్యత మాదే: జోగి రమేశ్, గృహ నిర్మాణశాఖ మంత్రి బీసీల హక్కుల కోసం పోరాడే బాధ్యతను వైఎస్సార్ సీపీ స్వీకరించింది. బీసీ సామాజిక వర్గాలన్నింటిని ఏకం చేసి వారి ప్రయోజనాలను కాపాడగలిగేది ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమే. కలసికట్టుగా పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చి సీఎం జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. అండగా నిలుద్దాం: సీదిరి అప్పలరాజు, పశుసంవర్థక శాఖ మంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి కుల అహంకారం ఉంది. బీసీలు న్యాయమూర్తులుగా పనికి రారని గతంలో కేంద్రానికి లేఖలు రాశారు. మత్స్యకారులను తోకలు కత్తిరిస్తానని బెదిరించారు. ఎస్సీల కుటుంబంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని కుల అహంకారంతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో బీసీ హాస్టళ్లు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. అధికారం కోల్పోయాక రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే అడ్డుకోవాలని చూశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే సామాజిక న్యాయం సాకారమైంది. ఆయనకు అంతా అండగా నిలవాలి. బాబు నైజాన్ని ఎండగట్టాలి: ఉషశ్రీ చరణ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి బీసీలను ఎంతో ఆదుకుంటున్న సంక్షేమ పథకాలను ఆపాలంటున్న చంద్రబాబు నైజాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. అనంతపురం అంటే బీసీల జిల్లా. వారంతా సీఎం జగన్ వెంటే నడుస్తున్నారు. గతంలో ఎప్పుడూ, ఎవరూ చేయనన్ని సంక్షేమ పథకాలను సీఎం జగన్ ప్రవేశపెట్టి అన్ని కులాలకు అండగా నిలిచారు. బీసీలకు చేయాల్సిందంతా చేసినా ఇంకా ఏం చేయగలమా? అని తపిస్తుంటారు. బీసీలను బెదిరించిన చంద్రబాబు: పోతుల సునీత, ఎమ్మెల్సీ బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు గతంలో బెదిరించారు. సీఎం జగన్ నా బీసీ సోదరులు, అక్క చెల్లెమ్మలంటూ ఆప్యాయంగా పిలుస్తారు. ఆయనకు మనపై ఉన్న ప్రేమకు అదే నిదర్శనం. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, డాక్టర్ సంజీవ్‌కుమార్, తలారి రంగయ్య, బెల్లాన చంద్రశేఖర్, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, హనుమంతరావు, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, దాడి వీరభద్రరావు, వైఎస్సార్సీపీ మహిళా నేత కిల్లి కృపారాణి పాల్గొన్నారు. సమానంగా ఎదిగేలా తోడ్పాటు ఇతర సామాజిక వర్గాలతో సమానంగా బీసీలు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. టీడీపీ ఐదేళ్లలో బీసీలకు విదిల్చింది కేవలం రూ.19,369 కోట్లు మాత్రమే. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర పారదర్శకంగా లబ్ధి చేకూర్చింది. – గుమ్మనూరు జయరాం, కార్మిక శాఖ మంత్రి -
పార్టీ బీసీ నేతలతో వైఎస్ జగన్ కీలక భేటీ
-
పార్టీ బీసీ నేతలతో వైఎస్ జగన్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కీలక భేటీ అయ్యారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలు చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో వైఎస్సార్ సీపీ కీలక నేతలు జంగా కృష్ణమూర్తి, బొత్స సత్యనారాయణ, జోగు రమేష్, పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేపిదేవి వెంకటరమణ, విజయసాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడులు, ఉద్యోగాలు ఏమయ్యాయి?
-
పెట్టుబడులు, ఉద్యోగాలు ఏమయ్యాయి?
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చి నిలువునా మోసం చేశారని వైఎస్సార్సీపీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణామూర్తి విమర్శించారు. 20లక్షల కోట్ల పెట్టుబడులు, 40లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టారని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెట్టుబడులు, ఉద్యోగాలు ఏమయ్యాయని నిరుద్యోగులు చంద్రబాబుని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడి నాలుగున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకే ఒకేఒక్కసారి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రం అధిక జనాభా ఉన్న బీసీలకు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని, బీసీలకు అన్యాయం చేసే విధంగా నిభందనలు అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. బీసీలపై జరుగుతున్న అన్యాయాలపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందని, దీనిపై సీఎస్‌కు లేఖ కూడా రాశామని ఆయన వెల్లడించారు. గతంలో మెడికల్ సీట్ల భర్తీలో బీసీలకు అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ పోరాటం చేసిందని జంగా కృష్ణమూర్తి గుర్తుచేశారు. రాష్ట్రంలో 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదని ఆయన ప్రశ్నించారు. -
బీసీల జీవనస్థితి మెరుగు జగన్‌తోనే సాధ్యం
విజయవాడ సిటీ: బీసీల కష్టాలు తీరి, జీవన పరిస్థితులు మెరుగుపడాలంటే వైఎస్ జగన్‌తోనే సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. బీసీలను చంద్రబాబు మోసం చేసిన తీరుపై గురువారం వైఎస్సార్ కాంగ్రె‹స్ పార్టీ బీసీ సెల్ చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బీసీలను ఓటు బ్యాంకుగా భావించి మోసం చేస్తున్న చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో బీసీలంతా ఏకమై గుణపాఠం చెప్పాలన్నారు. ఆదరణ పేరుతో బీసీలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు జీవన పరిస్థితులు అలాగే ఉండాలనే ఉద్దేశంతో వారికి పనిముట్లు చంద్రబాబు మభ్యపెడుతున్నారన్నారు. బీసీల అభివృద్ధి కోసం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. బీసీల సమస్యలను చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే సీఎం హోదాలో ఉండి అవహేళన చేసిన ఘనత చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మాయల ఫకీర్ చంద్రబాబును వ చ్చే ఎన్నికల్లో సాగనంపాలన్నారు. బీసీలను జడ్జీలు కాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన కుతంత్రాలను వివరించారు. దమ్మిడీకి పనికిరాని వారిని జన్మభూమి కమిటీ పేరుతో ప్రజలపై రుద్ది రాజ్యాంగాన్ని చంద్రబాబు అవహేళన చేశారని మండిపడ్డారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో బీసీలు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడ్డారన్నారు. అంతేకాకుండా విదేశాల్లో స్థిరపడ్డారని గుర్తుచేశారు. అటువంటి ఫీజురీయింబర్స్‌మెంట్‌ను చంద్రబాబు నీరుగార్చి అడ్డంకులు సృష్టిస్తున్నాడని ధ్వజమెత్తారు. రైతులు, డ్వాక్రా అక్కాచెల్లిమ్మలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఇలా అందర్నీ చంద్రబాబు మోసం చేశాడన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన రావాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విజయవాడ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ చంద్రబాబుకు అణగారిన వర్గాలంటే చులకన అన్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ చంద్రబాబు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారన్నారు. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు అణగారిన వర్గాల జీవన స్థితిగుతులు మారుస్తాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎంపీ సాంబూ, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధి, విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, యలమంచిలి రవి, బొప్పన భవకుమార్, విజయవాడ పార్లమెంటు బీసీ సెల్ అ«ధ్యక్షుడు కసగోని దుర్గారావు గౌడ్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు బోను రాజేష్, బొమ్మ న్న శివశ్రీనివాసరావు, గొలగాని శ్రీనివాసరావు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. నేతలు ర్యాలీగా వెళ్లి విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని వినతిపత్రాన్ని అందజేశారు. -
బీసీలను ఆదుకోవడంలో విఫలం అయ్యారు
-
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
- అధ్యక్ష పదవి నాకంటే నాకంటూ వాగ్వాదం - పరిశీలకుడి ముందే నేతల తోపులాట - ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్న వైనం - కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇదే పరిస్థితి సాక్షి, కరీంనగర్: కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అడహక్ కమిటీ కన్వీనర్ పదవి కోసం తెలుగు తమ్ముళ్లు ఆదివారం బాహాబాహీకి దిగారు. పార్టీ రాష్ట్ర పరిశీలకుల ముందే వాగ్వాదానికి దిగిన పార్టీ నేతలు ఒకరిపై ఒకరు చేయి చేసుకునే స్థాయికి గొడవ వెళ్లింది. మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోగా, గ్రూపులుగా విడిపోయి గొడవలకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లాల విభజన కారణంగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఖాళీ కావడంతో ఆదివారం ఉదయం కరీంనగర్, మధ్యాహ్నం సిరిసిల్ల రాజన్న జిల్లాల్లో టీడీపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశానికి పరిశీలకులుగా ఒంటేరు ప్రతాపరెడ్డి హాజరయ్యారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు కల్యాణపు ఆగయ్య, మేడిపల్లి సత్యం, చందా గాంధీలు సీనియర్లకు పార్టీ అధ్యక్షులుగా అవకాశం కల్పించాలని ప్రసంగించారు. అయితే, వీటిని వక్రీకరిస్తూ కవ్వంపెల్లి సత్యనారాయణ వ్యంగ్య ప్రసంగం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. అధ్యక్ష పదవి నాకు కావాలంటే.. నాకు ఇవ్వాలని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన నాయకులు, కార్యకర్తలు పరస్పర ఘర్షణకు దిగారు. సంయమనం కోల్పోయిన కార్యకర్తలు వేదికపైకి కుర్చీలు విసరడంతో రసాభాసగా మారింది. ఈ సందర్భంగా ఇరువర్గాలు తోపులాడుకుంటూ ఒకరిపై మరొకరు పడి తన్నుకున్నారు. ఒంటేరు ప్రతాపరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు విజయరమణారావులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపుచేశారు. ఈ పదవికి ఆరుగురు నేతలు పోటీపడగా, గొడవకు దిగిన ముగ్గురు నేతలు అధ్యక్ష రేసులో ఉన్నవారే. అలాగే, కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యకర్తల సమావేశం సైతం రసాభాస జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష పదవి కోసం అన్నమనేని నర్సింగరావు, బీసీ సెల్ రాష్ట్ర నాయకుడు రెడ్డబోయిన గోపీ, కౌన్సిలర్ బార్ల సందీప్‌లు పోటీపడుతుండగా, సమావేశం సందర్భంగా వీరంతా బలప్రదర్శనకు దిగారు. ఉమ్మడి జిల్లాలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఓ నాయకుడు, ఆ సమావేశంలో అన్నమనేని నర్సింగరావుకు పార్టీ అధ్యక్షపదవి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని పరిశీలకులు ఒంటేరు ప్రతాపరెడ్డి ముందే నాయకులు విమర్శలు గుప్పించారు. మాటామాట పెరిగి మూడు గ్రూపుల నాయకులు, కార్యకర్తలు కుర్చీలు విసురుకోవడంతో రసాభాస జరిగింది. దీంతో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో కమిటీలను ప్రకటించకుండానే పార్టీ పరిశీలకులు వెనుతిరిగారు. -
'పావురాల ఘటన కలిచివేసింది'
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రఘువీరా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పావురాల ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే తాము వారి తరుపున పోరాటానికి దిగుతామని చెప్పారు