హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో ఇందిరాభవన్లో అత్యవసరంగా భేటీ అయ్యారు. రేవంత్ కేసు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యవహారంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు నిర్వహిస్తున్నట్టు రఘువీరా తెలిపారు. ఇందులో భాగంగానే ఏపీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన అంశం పైన కూడా చర్చిస్తున్నట్టు నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చిరంజీవి తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.