APSRTC National Mazdoor Union
-
ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
సాక్షి, కృష్ణా : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నెరవేర్చారని ఆర్టీసీ కార్మికులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం గన్నవరం ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల కల నేరవేరిందని, వారి కుటుంబాల్లో వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదని కొనియాడారు. -
సీఎం జగన్ కీలక నిర్ణయం.. పాలాభిషేకాలు, హర్షాతిరేకాలు
సాక్షి, అమరావతి : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సంచనలన నిర్ణయం పట్ల ఆ సంస్థ కార్మికులు, ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కల సాకారమయిదంటూ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ, స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అంగీకరించిన సీఎం జగన్‌కు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పేర్ని నానితో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో చేసినందుకుగాను మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో ఈయూ నాయకులు వలిశెట్టి దామోదరరావు(వైవీ రావు), ఎన్‌ఎమ్‌యూ నాయకులు వై శ్రీనివాసరావు, ఏ విష్ణు రెడ్డి, ఏ సుధాకర్, వెంకటరమణ తదితరులు ఉన్నారు. విజయవాడలో ఈయూ నేతల సంబరాలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో సంబరాలు చేశారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పుష్పార్చన చేసి, స్వీట్లు పంచుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఇచ్చిన మాటలను నిలబెట్టుకునేందుకు సంతోషంగా ఉందన్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విలీనంతో పాటు ఆర్టీసీలోని ఇతర సమస్యలు, తమకు దక్కాల్సిన బెనిఫిట్స్‌పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు. సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం ఆర్టీసీ కార్మీకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మచిలీపట్నం ఈయూ సంఘ నేతలు అనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చిత్ర పటాలకు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను తెలిపారు. తిరువూరులో ఆర్టీసీ కార్మికుల సంబరాలు సీఎం వైఎస్ తీసుకున్న సంచలన నిర్ణయం పట్ల కృష్ణా జిల్లా తిరువూరు ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల తమ కల నెరవేరిందంటూ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు సంబరాలు చేసుకున్నారు. విలీనాన్ని హర్షిస్తూ సీఎం జగన్, రవాణా మంత్రి పేర్నినాని, ఎమ్మెల్యే కే.రక్షణనిది చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. తిరుపతిలో.. ఆర్టీసీ ఉదోగుల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం పట్ల తిరుపతిలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కేకులు కట్ చేసి సంతోషంగా ఒకరికి ఒకరు తినిపించుకొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువనేత భూమన అభినయ రెడ్డి కూడా పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని ఆర్టీసీ కార్మికులు అన్నారు. నెల్లూరులో.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంపై ఎంఎంయూ నేత రమణ రాజు ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్ర పటానికి పూలాభిషేకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ మాట ఇస్తే నిలబెట్టుకొంటారనే దానికి ఇదే ఉదాహరణ అన్నారు. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. చిత్తూరులో.. ఆర్టీసి విలీనాన్ని హర్షిస్తూ మదనపల్లిలో ఎమ్మెలే నవాబ్ బాషా సమక్షంలో ఆర్టీసీ కార్మికులు బారీ కేక్‌ను కట్ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. తమ దశాబ్దాల కలను నెరవేర్చినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో.. ఆర్టీసీ ను ప్రభుత్వం లో విలీనం చేస్తూ కాబినెట్ ఆమోదముద్ర వేయడంతో మద్దిలపాలెం ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయూ ఆధ్వర్యంలో కార్మికులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్ర పటానికి పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. గుంటూరులో.. విలీనాన్ని హర్షిస్తూ మాచర్ల ఆర్టీసీ కార్మికులు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, వివిధ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. విజయనగరంలో.. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనాన్ని హర్షిస్తూ ఆర్టీసీ కార్మికులు జిల్లా వ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు. మజ్దూర్ యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. -
ఎన్‌ఎంయూలో ముదిరిన విభేదాలు
అధ్యక్ష స్థానం నుంచి నాగేశ్వరరావు తొలగింపు సీమాంధ్ర కమిటీ అధ్యక్షుడిగా ధనుంజయరెడ్డి తెలంగాణకు ఎన్నికల తర్వాతే అధ్యక్షుడు హైదరాబాద్: ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ)లో నాయకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నాగేశ్వరరావును అధ్యక్ష స్థానం నుంచి తొలగించడంతో పాటు యూనియన్ నుంచి సస్పెండ్ చేయగా.. యూనియన్ సొమ్మును దుర్వినియోగం చేశారంటూ ప్రధాన కార్యదర్శి మహమూద్‌పై నాగేశ్వరరావు ఆరోపణలు చేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అధ్యక్షుణ్ణి తొలగిస్తూ తీర్మానాలు ఎన్ఎంయూ అధ్యక్షుడిగా నాగేశ్వరరావును తొలగిస్తూ సీమాంధ్ర, తెలంగాణ కమిటీలు వేర్వేరుగా తీర్మానాలు చేశాయి. అనంతరం ఆయన్ను యూనియన్ నుంచి సస్పెండ్ చేశామంటూ ప్రధాన కార్యదర్శి మహమూద్ సోమవారం ఆర్టీసీ యాజమాన్యానికి లేఖ రాశారు. యూనియన్ నియమ నిబంధనలకు విరుద్ధంగా అధ్యక్షుడిని తొలగించారంటూ నాగేశ్వరరావు వర్గం పత్రికా ప్రకటన విడుదల చేసింది. నాగేశ్వరరావును తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆదివారం తీర్మానం చేసింది. కమిటీ చైర్మన్ ఆర్వీవీఎస్వీ ప్రసాదరావు, అదనపు ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కమిటీ సమావేశం జరిగిందని. యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నాగేశ్వరరావును అధ్యక్ష స్థానం నుంచి తొలగిస్తూ కమిటీ కార్యవర్గం తీర్మానం చేసిందని ఎన్ఎంయూ సీమాంధ్ర నేతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కమిటీకి నెల్లూరుకు చెందిన వ్యాపారవేత్త ధనుంజయరెడ్డిని అధ్యక్షుడిగా నియమిస్తూ కార్యవర్గం తీర్మానించిందని వారు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎన్ఎంయూకు చీఫ్ వైఎస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అదే బాటలో తెలంగాణ కమిటీ యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శులు చెన్నారెడ్డి, కమాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన తెలంగాణ కమిటీ కార్యవర్గ సమావేశంలో కూడా నాగేశ్వరరావును అధ్యక్షస్థానం నుంచి తొలగిస్తూ తీర్మానం చేశారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ కమిటీ యథావిధిగా కొనసాగించాలని, ఎన్నికల తర్వాత కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల కమిటీల తీర్మానాలను గౌరవిస్తున్నామని యాజమాన్యానికి రాసిన లేఖలో మహమూద్ పేర్కొన్నారు. మహమూద్ వైఎస్సార్సీపీలో చేరిన తర్వాత.. యూనియన్ నేతలు రాజకీయ పార్టీల్లో చేరకూడదనే నిబంధనేదీ లేదు. ఈ నేపథ్యంలో ఎన్ఎంయూ ప్రధాన కార్యదర్శి మహమూద్ ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత యూనియన్‌లో అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు సమాచారం. విభజన తర్వాత సీమాంధ్రలో గుర్తింపు.. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 12 రీజియన్లు ఉన్నాయి. కార్మిక సంఘం ఎన్నికల్లో.. ఆరు చోట్ల ఎన్ఎంయూకు స్థానిక గుర్తింపు లభించింది. ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)కు ఒక రీజియన్‌లో దక్కింది. తెలంగాణలో టీఎంయూతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన ఈయూకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర జిల్లాల్లో ఇరు సంఘాలకు వచ్చిన రాష్ట్రస్థాయి ఓట్లు, స్థానిక ఓట్ల ప్రకారం చూస్తే ఎన్ఎంయూకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. 2013 జనవరి 5న ఎన్నికల ఫలితాలు వెల్లడించి గుర్తింపు సంఘాలకు లేఖలు ఇచ్చారు. అప్పటి నుంచి రెండేళ్లపాటు గుర్తింపు కొనసాగుతుంది. అంటే 2015లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. అప్పటి వరకు సీమాంధ్రలో ఎన్ఎంయూకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించే అవకాశం ఉందని కార్మిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.