కోడూరు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ పరిశా మాధవరావుకు శనివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి.
అవనిగడ్డ (కృష్ణా జిల్లా): కోడూరు మండలం వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ పరిశా మాధవరావుకు శనివారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన బైక్‌పై కోడూరు నుంచి అవనిగడ్డ వెళ్తుండగా వి.కొత్తపాలెం వద్ద వెనుక నుంచి ఆటో ఢీ కొట్టింది. ప్రమాదంలో మాధవరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ తరలించారు.