పని ప్రదేశంలో పాముకాటు.. మహిళ మృతి | Woman Dies With Snake Bite In Avanigadda Krishna District | Sakshi
Sakshi News home page

పని ప్రదేశంలో పాముకాటు.. మహిళ మృతి

Published Sat, Aug 24 2019 10:09 AM | Last Updated on Sat, Aug 24 2019 10:15 AM

Woman Dies With Snake Bite In Avanigadda Krishna District - Sakshi

సాక్షి, విజయవాడ : అవనిగడ్డ నియోజక వర్గంలో పాముల బెడద స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. 8 నెలల కాలంలో ఇప్పటికే 8 మందికి పైగా పాముకాటుకు గురైప్రాణాలు కోల్పోగా.. తాజాగా నాగాయలంక మండలం ఏటిమోగ గ్రామంలో పీతా వెంకటేశ్వరమ్మ (45) అనే మహిళ పాముకాటుతో మరణించారు. కూలీ చేసుకుని బతికే వెంటేశ్వరమ్మ ఎప్పటిలాగానే శుక్రవారం పనికి వెళ్లారు. అక్కడ ఆమెను ఓ పాము కాటేసింది. అయితే, త్వరగా ఆస్పత్రికి వెళ్లకుండా ఆమె ఆలస్యం చేశారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించే క్రమంలో ప్రాణాలు విడిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement