సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం సీఎం జగన్ పర్యటన ఉండనుంది. 22 ఏ (1) కింద ఉన్న నిషేదిత భూముల సమస్యకు పరిష్కారం లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ చేతుల మీదుగా రైతులకు క్లియరెన్స్ పత్రాలను అందజేయనున్నారు.
సీఎం జగన్ అవనిగడ్డ పర్యటన షెడ్యూల్ ఇలా..
► ఉదయం 10 గంటల ప్రాంతంలో తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరుతారు.
► పదకొండు గంటల ప్రాంతంలో.. కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు.
► గంటన్నర పాటు సాగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.
► ఆపై నిషేదిత భూముల జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు అందజేస్తారు.
► అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఇదీ చదవండి: ఎవరూ వేలెత్తి చూపకుండా సంపూర్ణ భూసర్వే
Comments
Please login to add a commentAdd a comment