కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంత ప్రజలు పాము కాట్లతో వణికిపోతున్నారు. వందలాది మంది పాముకాటు బాధితులను ఆస్పత్రులకు తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా గత వారం రోజులుగా వర్షాలు అధికంగా పడుతుండటం, వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో దాదాపు 70 పాము కాటు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో అధిక భాగం నారు వేసే కూలీలు గురికావడం గమనార్హం. గన్నవరం ప్రాంతంలోనూ గత వారం రోజుల్లో పాము కాటుతో ఇద్దరు చనిపోవడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు.