సాక్షి, విజయనగరం: ప్రభుత్వ పథకం ఏదైనా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ అందాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం. అందుకు అనుగుణంగానే రాష్ట్రవ్యాప్తంగా విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. తాజాగా ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద టీడీపీ నేత కుమార్తెకు లబ్ధి చేకూరడం ఇందుకు నిదర్శనం.
విజయనగరం జిల్లా వంగర మండలం సంగాం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచి బొడ్రోతు శ్రీనివాసరావు, వేణమ్మల కుమార్తె శైలజ ఈ పథకానికి ఎంపికైంది. తొలి విడతగా శుక్రవారం ఆమె ఖాతాకు రూ.13,99,154 ప్రభుత్వం జమ చేసింది. నమూనా చెక్కును శైలజ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, వేణమ్మలకు కలెక్టర్ ఎ.సూర్యకుమారి శుక్రవారం అందజేశారు.
రెండేళ్లలో విద్యార్థిని చదువుకు ప్రభుత్వం సుమారు రూ. 84 లక్షలు అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. సీఎం జగన్ పార్టీలకు అతీతంగా సుపరిపాలన అందిస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం అర్హతే ప్రామాణికంగా విద్యార్థులను గుర్తించి సాయం అందిస్తున్నారని బొడ్రోతు శ్రీనివాసరావు హర్షం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment