Vangara
-
బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత.. కాన్వాయ్‌పై గుడ్లతో దాడి..
సాక్షి, వరంగల్: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బండి సంజయ్‌లో వరంగల్ పర్యటన సంద్భంగా ఆయన కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో, బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాల ప్రకారం.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో భాగంగా నేడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో భీమదేవరపల్లి మండలంలోని వంగర వద్దకు చేరుకోగానే సంజయ్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు గుడ్లతో దాడికి చేశారు. కాగా, ఈ దాడులకు పాల్పడిందని కాంగ్రెస్ కార్యకర్తలేనని బండి సంజయ్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, గుడ్ల దాడి నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో అక్కడికిచ చేరుకున్నారు. గుడ్లు విసిరిన వారి గుర్తించాలని డిమాండ్ చేశారు. -
టీడీపీ నేత కుమార్తెకు ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’
సాక్షి, విజయనగరం: ప్రభుత్వ పథకం ఏదైనా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ అందాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. అందుకు అనుగుణంగానే రాష్ట్రవ్యాప్తంగా విపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. తాజాగా ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద టీడీపీ నేత కుమార్తెకు లబ్ధి చేకూరడం ఇందుకు నిదర్శనం. విజయనగరం జిల్లా వంగర మండలం సంగాం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచి బొడ్రోతు శ్రీనివాసరావు, వేణమ్మల కుమార్తె శైలజ ఈ పథకానికి ఎంపికైంది. తొలి విడతగా శుక్రవారం ఆమె ఖాతాకు రూ.13,99,154 ప్రభుత్వం జమ చేసింది. నమూనా చెక్కును శైలజ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, వేణమ్మలకు కలెక్టర్ ఎ.సూర్యకుమారి శుక్రవారం అందజేశారు. రెండేళ్లలో విద్యార్థిని చదువుకు ప్రభుత్వం సుమారు రూ. 84 లక్షలు అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. సీఎం జగన్ పార్టీలకు అతీతంగా సుపరిపాలన అందిస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం అర్హతే ప్రామాణికంగా విద్యార్థులను గుర్తించి సాయం అందిస్తున్నారని బొడ్రోతు శ్రీనివాసరావు హర్షం వ్యక్తంచేశారు. -
హారిక మృతి కేసు: విచారణ.. రూ.25 లక్షలు డిమాండ్
వంగర: శ్రీకాకుళం జిల్లా వంగర మండల పరిధి నీలయ్యవలస సమీపంలో బేతిన్ గ్రానైట్ క్వారీ ప్రదేశాన్ని పాలకొండ ఆర్డీవో టి.వి.ఎస్.జి.కుమార్, డీఎస్పీ మల్లంపాటి శ్రావణి గురువారం పరిశీలించారు. ఈ నెల 1వ తేదీన దుస్తులు ఉతికేందుకు తల్లి తొగరాపు సంతోషికుమారితో వెళ్లిన కుమార్తె హారిక క్వారీ గొయ్యిలో పడి మృతిచెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ ఘటనపై సమగ్ర సమాచారం సేకరణకు క్వారీ ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారు. క్వారీ లీజు సమయం, నిర్వహణ కాలం, ఎప్పటి నుంచి మూసివేశారు, హెచ్చరిక బోర్డులు, రక్షణ కంచెలు వంటివి తనిఖీ చేశారు. క్వారీకి సంబంధించి సమగ్ర సమాచారంపై నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ డి.ఐజాక్‌ను ఆర్డీవో ఆదేశించారు. ఘటనకు సంబంధించిన అంశాలపై డీఎస్పీ ఆరా తీశారు. రాజాం రూరల్ సీఐ డి.నవీన్‌కుమార్, ఎస్సై సంచాన చిరంజీవి, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: ‘నా కలల హారికా.. లేమ్మా..!’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన) రూ.25 లక్షలు చెల్లించాలి.. హారిక కుటుంబానికి క్వారీ యాజమాన్యం రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావుతోపాటు సర్పంచ్ ప్రతినిధి చింతగుంట రామారావు, పలు పార్టీలకు చెందిన నాయకులు బెజ్జిపురం రవి, ఉత్తరావెల్లి మోహనరావు, మజ్జి గణపతిరావు డిమాండ్ చేశారు. హారిక కుటుంబ సభ్యులను క్వారీ యాజమాన్య ప్రతినిధులు కనీసం ఓదార్చలేదని, ఇప్పటివరకు పరామర్శించలేదని మండిపడ్డారు. క్వారీ గుంత వద్ద హారిక మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి, కుటుంబసభ్యులు (ఫైల్) -
‘నా కలల హారికా.. లేమ్మా..!’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన
ఆ తండ్రికి కుమార్తె అంటే పంచప్రాణాలు. అందుకే ఏదడిగినా కాదనడు. సరదాగా అమ్మతో కలిసి బట్టలు ఉతికేందుకు వెళ్తానని చెబితే అడ్డుచెప్పకుండా బైక్‌పై ఇద్దరినీ క్వారీ (చెరువు) వద్దకు తీసుకెళ్లి తాను ఇంటికెళ్లిపోయాడు. అయితే తన గారాలపట్టి చివరి చూపు అదేనని తెలుసుకోలేకపోయాడు. కుమార్తె ఇక లేదని తెలుసుకుని మృతదేహంపై పడి ‘హారికా లేవమ్మా..’ అంటూ గుండెలవిసేలా రోదించాడు. మరోవైపు తన కళ్లెదుటే కుమార్తె మృతి చెందడంతో తల్లి అపస్మారక స్థితికి చేరుకుంది. వంగర(శ్రీకాకుళం జిల్లా): మండలంలోని నీలయ్యవలస సమీపంలో గ్రానైట్ క్వారీ గొయ్యిలో పడి తొగరాపు హారిక (13) అనే బాలిక మంగళవారం మృతిచెందింది. ఆ సమయంలో పక్కనే ఉన్న తల్లి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. వంగర ఎస్సై సంచాన చిరంజీవి తెలిపి వివరాల ప్రకారం.. నీలయ్యవలస సమీపంలో కొన్నాళ్ల కిందట బేతిన్ గ్రానైట్ పరిశ్రమ ఉండేది. అప్పట్లో జరిగిన తవ్వకాల్లో భాగంగా భారీ గొయ్యి (చెరువును తలపించేలా..) ఏర్పడింది. అందులో బట్టలు ఉతికేందుకు గ్రామానికి చెందిన తొగరాపు ఈశ్వరరావు తన భార్య సంతోషకుమారి, కుమార్తె హారికను బైక్‌పై తీసుకువెళ్లి తిరిగి ఇంటికి వచ్చేశాడు. కొద్దిసేపటికే హారిక ప్రమాదవశాత్తు గోతిలోకి జారిపోయింది. అక్కడే ఉన్న తల్లి కుమార్తెను కాపాడే ప్రయత్నంలో ఆమె కూడా గోతిలో జారిపోయి కాపాడాలంటూ కేకలు వేసింది. అటువైపుగా వెళుతున్న ఓ రైతు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. హుటాహుటిన గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సంతోషకుమారిని కాపాడారు. హారిక కోసం నీటిలో గాలించగా కొద్దిసేపటికి శవమై కనిపింది. తల్లి సంతోషకుమారి అపస్మారక స్థితిలో ఉండగా, తండ్రి ఈశ్వరరావు గుండెలవిసేలే రోదించారు. ‘నా కలల హారిక.. లేవమ్మా..’ అంటూ మృతదేహాన్ని పట్టుకొని తండ్రి విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. హారిక బాగెంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. తమ్ముడు చంద్రశేఖరరావు అంటే ఎంతో ఇష్టం. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోషు్టమార్టం నిమిత్తం రాజాం తరలించామని ఎస్సై తెలిపారు. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం.. 2017 ముందు మూతపడిన బేతిన్ గ్రానైట్ క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావు, స్థానికులు మండిపడ్డారు. క్వారీ మూత వేసినప్పటి నుంచి ఈ ప్రదేశంలో రక్షణ చర్యలు చేపట్టలేదని, చిన్నారి మృతికి క్వారీ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లీజు సమ యం ఉన్నప్పటికీ క్వారీ వద్ద రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: లాక్‌డౌన్‌తో పాన్ బ్రోకర్ దంపతులు ఆత్మహత్య 15వ అంతస్తు నుంచి దూకి వైద్యుడు -
సూర్యగ్రహణం: నిలబడిన రోకళ్లు.. ప్రత్యేక పూజలు
సాక్షి, శ్రీకాకుళం: సూర్యగ్రహణం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఏ ఆధారం లేకుండా నిలబెట్టిన రోకళ్లకు స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యగ్రహణం రోజున రోకళ్లు వాటంతట అవే నిలబడతాయని ఇక్కడి స్థానికులు నమ్ముతారు. గిన్నెలో నీళ్లు పోసి రోకలిని ఏ ఆధారంలేకుండా నిలబెడతారు. సూర్యగ్రహణం ప్రభావంతో ఏ సపోర్ట్ లేకపోయినా రోకళ్లు నిటారుగా నిలబడతాయని శ్రీకాకుళం జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రజలు విశ్వసిస్తారు. ఇలా నిలబెట్టిన రోకళ్లకు పూజలు చేస్తున్నారు. గురువారం సూర్యగ్రహణం సంభవించడంతో శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలం కె.కొత్తవలస గ్రామంలో స్థానికులు రోకలిని నిలబెట్టి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాకుళంలోని పలు మండలాల్లో, గ్రామాల్లో ఈ ఆచారాన్ని స్థానికులు పాటించడం కనిపిస్తోంది. గ్రహణం ఎఫెక్ట్ కారణంగానే సూర్యభగవానుడి శక్తితో రోకళ్లు ఇలా నిలబడతాయని స్థానికులు చెప్తున్నారు. -
కడసారి చూపు కోసం వెళ్లి...అంతలోనే!
కూలి పనిచేస్తే తప్ప పూటగడవని బతుకులు... తమ బంధువు మృతి చెందడంతో కడసారి చూపు కోసం పయనమయ్యాయి... కృష్ణా జిల్లాలో అతను నివసించిన ప్రాంతానికి కాసేపట్లో చేరుకుంటారనగా... టైరు పంచర్ కావడంతో వారు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది... ఒకటా రెండా.. ఏకంగా 45 కుటుంబాలు ఒక్కసారిగా ఘొల్లుమన్నాయి. ఈ దుర్ఘటనలో 40మంది గాయపడగా.. వారిలో తొమ్మిదిమంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులంతా వంగర మండలం శ్రీహరిపురం గ్రామస్తులు. తలకు, చేతులు, కాళ్లకు గాయాలై కట్లతో... విరిగిన శరీర భాగాలతో వారు పడుతున్న అవస్థ కుటుంబ సభ్యులను కలచివేస్తోంది. అందరూ ఒకే ప్రాంతానికి చెందినవారు కావడంతో ప్రమాద వార్త తెలియగానే ఊరంతా ఆర్తనాదాలతో ప్రతిధ్వనించింది. సాక్షి, వంగర(శ్రీకాకుళం) : చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారిపై కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వంగర మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన 40 మందికి గాయాలయ్యాయి. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీహరిపురం గ్రామానికి చెందిన బొత్స అప్పలనాయుడు కుటుంబంతో సహా 30 ఏళ్ల క్రితం కృష్ణాజిల్లా ఉంగుటూరుకు వలస వెళ్లాడు. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అప్పలనాయుడు ఈ నెల 29న మృతిచెందినట్లు గ్రామస్తులకు సమాచారం అందింది. దీంతో శ్రీహరిపురంలో ఉన్న వారంతా అప్పలనాయుడుకు బంధువులు కావడంతో పరామర్శ కోసం అదేరోజు సుమారు 45 మంది ఉంగుటూరుకు పయనమయ్యారు. శ్రీహరిపురం నుంచి ప్రయివేటు వాహనంలో విశాఖపట్నం వరకు వెళ్లి రాత్రి 8 గంటలకు రాయగడ–గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో పయనమయ్యారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు కృష్ణాజిల్లా నూజివీడు రైల్వేస్టేషన్లో దిగారు. అక్కడి నుంచి బొలేరో ట్రక్కు(లగేజీ వ్యాన్) ద్వారా హనుమాన్ జంక్షన్ మీదుగా ఉంగుటూరుకు పయనమయ్యారు. మార్గమధ్యంలో బాపులపాడు మండలం వీరవల్లి సమీపంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ట్రక్కు టైర్ పేలడంతో పల్టీ కొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్న వారంతా తుళ్లిపోయారు. కొందరికి కాళ్లు, చేతులు విరగ్గా, మరికొందరికి తల, మెడ, నడుము భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి. వీరవల్లి ప్రాంతం క్షతగాత్రుల రోదనలతో మిన్నంటింది. అందులో ఉన్న కొంత మంది క్షతగాత్రులు 108 అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. హనుమాన్ జంక్షన్, గన్నవరం, నూజివీడు వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రామవరప్పాడులోని ఎన్.టి.ఆర్.హెల్త్ యూనివర్సిటీ న్యూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరు క్షతగాత్రులు స్థానికంగా ఉన్న బంధువులు, ఇతర ఆస్పత్రులను ఆశ్రయించి చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఐసీయూలో చికిత్స.. మొత్తం 40 మందికి గాయాలు కాగా, వారిలో బొత్స రామకృష్ణ(60), బోగి తవిటినాయుడు, ఆబోతుల అప్పలనాయుడు (ఖుషి), గార విష్ణుమూర్తి, గార సత్తెమ్మ, బుగత లక్ష్మినారాయణ(48), బుగత అన్నపూర్ణమ్మ(రంగమ్మ)(52), వావిలపల్లి ముత్యాలమ్మ(45), బొత్స రమణ (35), ఉత్తరావెల్లికృష్ణమూర్తిల పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో కొందరు వెంటిలేటర్, ఐసీయూ విభాగాల్లో చికిత్స పొందుతున్నారు. బొత్స పాపారావు, గార కృష్ణవేణి, బొత్స శంకరరావు, బెవర శారదమ్మ, బొత్స రాము, బుగత రామారావు, బుగత సూర్యుడమ్మ, బోగి రాము, బొత్స ఆదిలక్ష్మి, బొత్స గణపతి(పోలినాయుడు), బొత్స తవిటినాయుడు, బొత్స సత్యనారాయణ, గార తవిటినాయుడు, గార సింహాలునాయుడు, గార వరహాలమ్మ, బుగత పోలినాయుడు, బొత్స శ్రీను, గార సన్యాసిరాజులతోపాటు మరో 13 మందికి సైతం గాయాలయ్యాయి. ఘొల్లుమన్న గ్రామం.. శ్రీహరిపురంలో ఇంటింటా విషాదం అలుముకుంది. ఇక్కడ 230 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అందులో 45 కుటుంబాల్లో ఇంటికి ఒకరు చొప్పున పరామర్శకు వెళ్లి గాయపడ్డారు. దీంతో ఆయా కుటుంబాల వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అందరి పరిస్థితీ దయనీయమే... కూలి పనిచేస్తే తప్ప పూటగడవని బతుకులు వారివి. తమ బంధువు మృతిచెందడంతో కడసారి చూపు కోసం పయనమై క్షతగాత్రులుగా మిగిలారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాటం చేస్తున్న వావిలపల్లి ముత్యాలమ్మది దయనీయ స్థితి. తలభాగం, పొట్టలో ఎముకులు విరిగిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గతంలో భర్త మరణించగా, పెళ్లీడుకొచ్చిన కుమార్తె ఉంది. అపస్మారక స్థితిలో ఉన్న బొత్స రామకృష్ణ కుటుంబానికి అదే దీనగాథ. కాయకష్టంతో కుటుంబాన్ని పోషిస్తున్న రామకృష్ణ ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉండడంతో భార్య నిర్మల, ముగ్గురు కుమారులు, కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఆబోతుల అప్పలనాయుడు నిరుపేద. ఇంటి పెద్ద దిక్కుగా ఉన్న తన భర్త ప్రాణాలను కాపాడాలని భార్య లక్ష్మీ వేడుకుంటోంది. మరో క్షతగాత్రుడు బుగత లక్ష్మీనారాయణ కుటుంబ నేపథ్యం దయనీయం. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇప్పుడు ఈ ప్రమాదం జరగడంతో భార్య, పిల్లలు బోరున విలపిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేదని, మెరుగైన వైద్యసేవలందించి ప్రభుత్వం ఆదుకోవాలని వారంతా వేడుకుంటున్నారు. -
రైలు ప్రమాదంలో ఆర్మీ హవాల్దార్ మృతి?
సాక్షి, వంగర(శ్రీకాకుళం) : మండలంలోని కొప్పర గ్రామానికి చెందిన ఆర్మీ హవల్దార్ కుప్పిలి రవిబాబు రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు కుప్పిలి వెంకటి, బోడమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మరో ఆర్నెల్లలోనే ఉద్యోగం పూర్తి చేసుకుని వచ్చేస్తాడని, ఇంతలో ఈ ఘోరం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. దీంతో బుధవారం గ్రామంలో విషాదం అలుముకుంది. బంధువుల కథనం మేరకు... 17ఏళ్ల క్రితం ఆర్మీ జవాన్‌గా విధుల్లోకి చేరి ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ హవల్దార్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అక్టోబర్ 29న సహచర ఉద్యోగులతో కలిసి సెలవుపై స్వగ్రామం కొప్పర వచ్చేందుకు న్యూఢిల్లీ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. అదే రోజు మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్–ఝాన్సీ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాల పక్కన తుప్పల్లో రవిబాబు తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. ఇతను మెడలో ఐడీ కార్డు సహాయంతో ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవలు పొందుతుండగా, పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి భార్య రమణమ్మ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. వీరికి కుమారుడు అభిషేక్, కుమార్తె సుష్మిత ఉన్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా చోటుచేసుకుందో తెలియరావడం లేదు. రైల్లోంచి ఈయన ప్రమాదవశాత్తు పడిపోయాడా? లేదా సహ ఉద్యోగులతో ఏమైనా విభేదాలతో తొసివేశారా? అన్నది స్పష్టమైన సమాచారం లేదు. బోగీలో తమ తోటి ఉద్యోగి లేకపోవడాన్ని గుర్తించి వారు విజయవాడ రైల్వే స్టేషన్లో దిగినప్పుడు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా కుటుంబ సభ్యులకు పూర్తిగా వివరాలు తెలియలేదు. ఈ మేరకు మృతదేహాన్ని లక్నో నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు విమానంలో తీసుకొచ్చి, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో స్వగ్రామం తరలించేందుకు ఆర్మీ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఎస్ఐ విద్యార్థిని కొట్టడంతో..
సాక్షి, వంగర (శ్రీకాకుళం): మండలంలోని అరసాడ బస్‌స్టాప్ వద్ద విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు. కొంతమంది విద్యార్థులు మంగళవారం పాసింజర్ బస్ ఎక్కగా.. స్టూడెంట్ స్పెషల్ బస్సు ఉండగా పాసింజర్ బస్సులో విద్యార్థులు ప్రయాణం చేయడం తగదంటూ ఎస్ఐ కొల్లి రమణ వంగరకు చెందిన అలబోను కృష్ణ అనే విద్యార్థిపై చేయిచేసుకున్నారని విద్యార్థులు ఆందోళన దిగారు. దీనిలో భాగంగా బుధవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి బస్సులను నిలుపుదల చేశారు. ఎటువంటి కారణం లేకుండా కృష్ణను ఎస్ఐ కొట్టారని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా ఎస్ఐతో పాటు పోలీసు సిబ్బందిని నిలదీశారు. స్టూడెంట్ స్పెషల్ బస్సు ఒక్కటే ఉండడంతో పాసింజర్ బస్సుల్లో ప్రయాణం తప్పడం లేదని తెలియజేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ బస్సుల్లో విద్యార్థులు వేలాడుతూ ప్రయాణాలు చేస్తున్నారని పాలకొండ డిపో మేనేజర్ తమ దృష్టికి తీసుకురావడంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. స్టూడెంట్స్ స్పెషల్ బస్సులు ఉండగా ప్యాసింజర్ బస్సులో ఎక్కువ మంది విద్యార్థులు ప్రయాణించడం పట్ల మందలించానని, కావాలని చేయలేదని వివరణ ఇచ్చారు. అయితే బస్సును మొదటిగా ఆపిన ఎస్ఐ వాహనం డ్రైవర్ కామేశ్వరరావు క్షమాపణ చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేయడంతో ఎస్ఐ ఆదేశాల మేరకు బస్సు నిలుపుదల చేశానని, తన వల్ల తప్పు ఉంటే క్షమించాలి అనడంతో విద్యార్థులు శాంతించారు. -
తెలుగు తేజాన్ని మరిచారా?
భీమదేవరపల్లి : బహుభాషా కోవిదుడిగా, మౌనమునిగా, రాజనీతిజ్ఞుడిగా పేరుగడించి భారతదేశ ప్రధానిగా అత్యున్నత పదవిని అధిరోహించి తెలుగుఖ్యాతిని దేశవిదేశాల్లో ఇనుమడింపజేసిన తెలుగు తేజం, వంగర ముద్దుబిడ్డ పీవీ నర్సింహారావు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఏటా పీవీ జయంతి, వర్ధంతి వేడుకలను హైదరాబాద్‌తోపాటుగా ఆయన జన్మస్థలమైన వంగరలో అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించడంతో తెలుగు ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆ హామీ వంగరలో నెరవేర్చకపోవడంతో గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గురువారం పీవీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. పూర్వ కరీంనగర్ జిల్లా(ప్రస్తుత వరంగల్ అర్బన్ జిల్లా) భీమదేవరపల్లి మండలం వంగరలో 1921 జూన్ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. రాష్ట్ర, కేంద్ర మంత్రి పదవులతోపాటుగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులకే వన్నె తెచ్చారు. పీవీ ప్రధాని కానున్న సమయంలో వంగరలో పలు అభివృద్ధి పనులు జరగడంతో పాటుగా నిత్యం రాష్ట్ర, కేంద్ర మంత్రుల పర్యటనలతో సందడిగా ఉండేది. పీవీ ప్రధాని అయ్యాక వంగలో సీసీ రోడ్లు, గ్రంథాలయం, గురుకుల పాఠశాల, తాగు నీటి బావి, పోలీస్‌స్టేషన్ తదితర అభివృద్ధి పనులు జరిగాయి. దీక్షలు చేసినా శూన్యమే.. పాలకులు మరిచినా ఇక్కడి ప్రజానీకం మాత్రం పీవీని తమ గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే కాబోలు వంగరలో 2013 సంవత్సరం పీవీ విగ్రహాన్ని చందాలతో ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు వచ్చినా.. రాకున్నా వారే జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహించకుంటున్నారు. పీవీ మరణం నుంచి నేటి వరకు ఆయనకు ఏదోవిధంగా అవమానం జరుగుతూనే ఉంది. పీవీకి భారత రత్న ఇవ్వాలని, జిల్లాకు పీవీ పేరు పెట్టాలని, ఢిల్లీలో శాంతి వనం ఏర్పాటు చేయాలని ఆయన 9వ వర్ధంతిని పురస్కరించుకొని గ్రామంలోని పీవీ విగ్రహం వద్ద ప్రజలు రాజకీయాలకతతీంగా 48 గంటల పాటు దీక్ష చేపట్టినా ఏ నాయకుడు అటుగా రాలేదు. వెలవెలబోతున్న విగ్రహం వంగరలో పీవీ నర్సింహారావు విగ్రహ నిర్మాణ సమయంలో గార్డెన్‌ను నిర్మిస్తామంటూ నాయకులు ఇచ్చిన హామీ సైతం నెరవేరలేదు. నూతన రాష్ట్రంలో పీవీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను స్వగ్రామం వంగరతో పాటుగా హైదరాబాద్‌లో అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేవలం మొదటి సంవత్సరం మాత్రమే జయంతి వేడుకలకు ఆర్డీఓ హాజరయ్యారు. అనంతరం ఆ కార్యక్రమాలను మరిచిపోయారు. ఈనె ల 28న పీవీ జయంతి సందర్భంగా అధికారిక ఏర్పాట్లు లేకపోవడంతో వంగర బోసిపోయింది. -
రెండు బైక్‌లు ఢీ..ఇద్దరి మృతి
విజయనగరం : దత్తిరాజేరు మండలం వంగర గ్రామం వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందారు. మృతులు దత్తిరాజేరు మండలం వంగర గ్రామానికి చెందిన నాగోలు ప్రసాద్ (30) కాగా మరొకరు గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన గెద్ద ఈశ్వరరావు(20)లుగా గుర్తించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్యా యత్నం
వంగర : ఎం.సీతారాంపురం గ్రామానికి చెందిన వివాహిత జాడ రమణమ్మ పురుగులు మందు తాగి బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నాలుగేళ్ల కిందట కొమరాడ మండల కేంద్రానికి చెందిన జాడ నందీశ్వరరావుతో వివాహం జరిగింది. అప్పటి నుంచి భర్తతో పాటు అత్తింటి వేధింపులు అధికమయ్యాయని అపస్మారక స్థితిలో ఉన్న రమణమ్మ పోలీసులకు వివరించినట్లు తల్లి అల్లక సరోజినమ్మ, సోదరుడు అల్లక శ్రీను విలేకరులకు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన మాకు అత్తింటి వారు అదనపు కట్నం తెమ్మంటున్నారని, లేకపోతే అత్తింటికి భర్త తీసుకువెళ్లమని చెబుతున్నారని, తమకు న్యాయం చేయాలని చావుబతుకుల్లో ఉన్న రమణమ్మ, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మేరకు వంగర పోలీసులు రాజాం సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న రమణమ్మ వద్ద నుంచి వాంగ్మూలం స్వీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వై.మధుసూదనరావు తెలిపారు. -
రోడ్డుప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
వంగర (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని శివ్వాం గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం కారు-బైకు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌పై వెళుతున్న శివ్వాం గ్రామానికి చెందిన శ్రీనివాసులు కాలు విరిగింది. వెనుక కూర్చున్న అప్పలనాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని వంగర పోలీసులు పరిశీలించారు. -
చేపల చెరువులో విషం
వంగర (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా వంగర మండలం అరపాడు గ్రామంలోని బారికబంద చెరువులో గుర్తుతెలియని దుండగులు విషం కలిపారు. దీంతో గురువారం చెరువులో ఉన్న చేపలు మృత్యువాతపడ్డాయి. సుమారు రూ. 3 లక్షల మేర నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులే ఈ దారుణానికి ఒడిగట్టారని అనుమానిస్తున్న స్థానికులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. -
మడ్డువలస ఇంకిపోయింది !
వంగర : మడ్డువలస ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులకు కష్టాలు తప్పేటట్టు లేదు. వర్షాలు లేకపోవడం, పై నుంచి కూడా నీరు రాకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు భారీగా అడుగంటాయి. ఇన్‌ఫ్లో పూర్తిగా లేకపోవడంతో ప్రాజెక్టులో నీటినిల్వ డెడ్‌స్టోరేజీకి చేరువలోకి వచ్చింది. ఉన్నతాధికారులు సాగునీటి నిల్వలపై ముందస్తు అంచనాలు తయారు చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని అధికారులు, రైతులు బాహాటంగానే చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రాజెక్టులో భారీగా నీటినిల్వ తగ్గిపోయింది. దాదాపు డెడ్‌స్టోరేజీకి ఒక అడుగు దూరంలో ఉన్నట్లే చెప్పక తప్పదు. గత నెల 12వ తేదీన మడ్డువలస కుడి ప్రధాన కాలువ ద్వారా సాగునీటి విడుదల చేపట్టారు. అయితే ఆ సమయానికే కేవలం 63.20 మీటర్ల లెవెల్ నీటిమట్టం ఉండేది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో బకేట్పోర్షన్ వద్ద 62.70 మీటర్ల లెవెల్‌కు దిగజారింది. అయితే ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీ అధికారికంగా 58.80 మీటర్లుగా రికార్డులు చెబుతున్నప్పటికీ ఆ పరిస్థితి ఇక్కడ లేదు. గేట్ల ప్రాంగణం, నీటినిల్వ సూచించే ప్రదేశం, కుడి, ఎడమ కాలువల హెడ్స్లూయీస్ల ప్రదేశంలో భారీగా మట్టి పేరుకుపోవడంతో 61.80 మీటర్ల వరకు నిల్వ ఉంటేనే నీటిని సరఫరా చేయగలమని, లేకపోతే ఒక్క చుక్క కూడా కిందకు వెళ్లే ప్రసక్తి లేదని ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆ లెక్కన ప్రస్తుతం ఉన్న నీటిమట్టానికి, అధికారులు చెబుతున్న లెక్కలకు ఒక్క మీటరు దూరంలో డెడ్‌స్టోరేజి ఉంది. మరో పది రోజులుపాటు వర్షాలు లేకపోతే ఆ తరువాత నుంచి మడ్డువలస నుంచి ఆయకట్టుకు చుక్క నీటిని కూడా విడిచిపెట్టే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. సాగునీరు ప్రశ్నార్థకమే వర్షాలు పడకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వ లేక వెలవెలబోయింది. కుడి ప్రధాన కాలువ ఆయకట్టు పరిధిలో రేగిడి, సంతకవిటి, జి.సిగడాం, పొందూరు, లావేరు తదితర మండలాల పరిధిలో 29,800 ఎకరాల ఆయకట్టు ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండున్న మీటర్ల వెనుక న నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఈ సమయానికి 64.10 మీటర్లు లెవెల్ ఉండేది. 24,700 ఎకరాలకు సాగునీటి సరఫరా చేసేవారు. ప్రస్తుతం మరో ఐదువేల ఎకరాల అదనపు ఆయకట్టుకు ఈ ఏడాది సాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతీ ఏటా అధికారులరు 64 మీటర్లు లెవెల్‌ను స్థిరీకరించి నీటిని విడుదల చేసేవారు. ఈ ఏడాది మాత్రం అధికారులకు ముందు చూపు లేకపోవడంతో ప్రణాళిక బద్ధంగా నీటిని నిల్వ చేసుకోలేకపోయారు. -
ఉలిక్కిపడిన సిక్కోలు
వంగర: సిక్కోలు జిల్లా మరోసారి ఉలిక్కిపడింది. ఆరు నెలల క్రితం జి.సిగడాం మండలం పెనసాం గ్రామంలో బాణసంచా అక్రమ తయారీ కేంద్రంలో సంభవించిన పేలుడులో ఇద్దరు మృత్యువాత పడగా పలువురు గాయపడిన ఘటనను మరచిపోకముందే అలాంటి ఘటనే వంగర మండలం మరువాడ పంచాయతీ కొత్త మరువాడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇక్కడ కూడా బాణసంచా అక్రమ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఎరుకుల కులస్తులైన గేదెల పోలీస్, భాస్కరరావులు ఎలాంటి అనుమతి లేకుండా తమ ఇళ్ల వద్ద వివాహాలు, పండుగలు, ఇతరత్రా కార్యక్రమాల కోసం బాణసంచాను తయారు చేస్తుంటారు. ఇదే క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాణసంచాను తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో ఏమి జరిగిందో తేలియక గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. బాణసంచా పేలిందని తెలుసుకొని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రసాయన పదార్థాలు అధిక మోతాదులో వినియోగించడం, లేదా పొగత్రాగడం వల్ల పేలుడు సంభవించి ఉంటుందని సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ ఏఎస్‌ఖాన్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. ఘటనలో బాణసంచా తయారీదారులైన పోలీస్, భాస్కరరావులతో పాటు అదే కుటుంబానికే చెందిన గేదెల శ్రీనివాసరావు, రాములమ్మలు, అక్కడే ఉన్న పాలకొండ మండలం బాసూరు గ్రామానికి చెందిన చెవ్వూరు దుర్గారావు, విజయనగరం జిల్లా బలిజిపేట మండలం జనార్థనవలస గ్రామానికి చెందిన ఇరువాడ గణపతి, ఆడుకోవడానికి వెళ్లిన కొత్తమరువాడ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక పోల అపర్ణ తీవ్రంగా గాయపడ్డారు. శరీరమంతా కాలిపోవడంతో క్షతగాత్రులు మృత్యువుతో పోరాడుతున్నారు. వీరిలో గేదెల భాస్కరరావు, శ్రీనివాసరావు, గణపతిరావు, అపర్ణల శరీరం ఎక్కువ శాతం కాలిపోయాయి. మరో ముగ్గురి పరిస్థితి కూడా అలాగే ఉంది. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనాల్లో క్షతగాత్రులను రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం జిల్లా కలెక్టర్ పి.నరసింహం ఆదేశాల మేరకు విశాఖపట్నం కేజీహెచ్‌కు అంబులెన్స్‌ల్లో తరలిస్తుండగా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో ఇరువాడ గణపతి(35) మృతి చెందగా, చిన్నారి అపర్ణ(6) విశాఖ కేజీహెచ్‌లో తుదిశ్వాస విడిచింది. ధ్వంసమైన ఇళ్లు పేలుడు ధాటికి గేదెల పోలీస్, భాస్కరావుల ఇళ్లు పూర్తిగా ధ్వంసమవ్వగా పక్కనే ఉన్న గీరసన్యాసి శ్రీను ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. రెండు మోటారు వాహనాలు, టీవీలు, ఫ్యాన్లు, విద్యుత్ పరికరాలు, నిత్యావసర సరుకులు, తిండిగింజలు, దుస్తులు, వివిధ ధ్రువీకరణ పత్రాలతోపాటు పేలుడు పదార్థాలు ధ్వంసమయ్యాయి. రాజాం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది మంటలను అదుపు చేశారు. భారీగా పేలుడు పదార్థాల గుర్తింపు సంఘటన స్థలాన్ని ఆనుకొని ఉన్న రేకుల షెడ్డులో భారీగా నిల్వ చేసి ఉన్న పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. ట్రైనైట్రో టోలిన్, పాస్పరస్, అమోనియం, పొటాషియం, క్లోరైట్, గన్ ఫౌడర్, గంధకం, సురాకారం తదితర పేలుడు గుణం కలిగిన పదార్థాలను కనుగొన్నారు. ఇనుప చువ్వలు, ఇనుప తివ్వలు కుప్పలు ఉండటాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. బాణసంచా తయారీ కేంద్రానికి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు. విజయనగరం జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి ప్రాంతాల ఏజెంట్లు పేలుడు పదార్థాలను వీరికి సరఫరా చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గ్రామస్తుల భయాందోళన బాణసంచా పేలుడుతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు శబ్దానికి చిన్నపిల్లలు సైతం సమీప పంటపొలాల్లోకి పరుగులు పెట్టారు. కాసేపటికి బాణాసంచా తయారీ కేంద్రం వద్ద భారీగా మంటలు చెలరేగడంతో పెద్దవాళతా అక్కడకు చేరుకొని అదుపుచేసే ప్రయత్నం చేశారు. కాలిపోయిన వారిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. శరీరం రక్తసిక్తమై శరీరాలను కుటుంబీకులు రోదించారు. పోల మహేష్, కుమారిలు పొలం పనులు కోసం వెళ్లడంతో వారి ఆరేళ్ల కుమార్తె అపర్ణ బాణసంచ తయారీ కేంద్రం వద్దకు వెళ్లి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కన్నుమూయడంతో వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బాణసంచా అక్రమ తయారీదారులపై చర్యలు బాణసంచా అక్రమ తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్ స్పష్టం చేశారు. కొత్తమరువాడలో పేలుడు స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గ్యాస్, విద్యుత్‌షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించలేదన్నారు. పేలుడు పదార్థాల వద్ద పొగ త్రాగడం లేదా బాణసంచా తయారీలో పేలుడుపదార్థాలను అధికంగా ఉపయోగించడంతో ప్రమాదం సంభవించి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో జి.సిగడాం మండలం పెనసాంలో ఇటువంటి దుర్ఘటన జరిగిన సందర్భంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సరిహద్దులో ఉన్న కొత్త మరువాడ గ్రామంలోని బాణసంచా అక్రమ తయారీదారులపై 2012లో వంగర పోలీసులు కేసులు నమోదు చేయగా, బలిజి పేట పోలీసులు రూ. 1.20 లక్షలు విలువ చేసే బాణసంచాను అప్పట్లో స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ముడిపదార్థాలు, పేలుడు పదార్థాలు బొబ్బిలి, విజయనగరం ప్రాంతాల నుం చి సరఫరా జరుగుతోందన్నారు. రెండు జిల్లాల కలెక్టర్ల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి బాణసంచా అక్రమ తయారీ కేంద్రాలు, వాటికి ముడిసరుకును సరఫరా చేసే ఏజెంట్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్యాస్‌సిలిండర్ లీకైనందున, విద్యుత్‌షార్ట్‌సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందని కొంత మంది స్థానికులు ఎస్పీ వద్ద ప్రస్తావించగా అందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు. పాలకొండ ఆర్డీవో సాల్మాన్రాజ్, డీఎస్పీ ఆదినారాయణతోపాటు ఐదుగురు ఎస్సైలు, ఇరవై మంది పోలీసులు, రాజాం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది, వైద్యసిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాగా రాజాం ఆస్పత్రిలో క్షతగాత్రులను రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం పరామర్శించారు. ‘లెసైన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాం’ బాణసంచా తయారీ కోసం లెసెన్స్ ఇవ్వాలని గతంలో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గేదెల పోలీస్ భార్య లక్ష్మి ఎస్పీ ఖాన్‌తో మాట్లాడుతూ చెప్పారు. ఎరుకుల కులస్తులమైన తమకు బాణసంచా తయారీయే జీవనాధారమని, మరో దిక్కులేదని వాపోయింది. -
తెలుగు తమ్ముళ్ల కక్కుర్తి
శ్రీకాకుళం: హుదూద్ తుపాను విలయానికి అన్ని కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న బాధితులనూ టీడీపీ కార్యకర్తలు వదలడం లేదు. తుపాను సాయంలోనూ కక్కుర్తి బుద్ధి చూపిస్తున్నారు. తుపాన్ సాయం అందించేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు. రేషన్ సరుకులు ఇచ్చేందుకు బాధితుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని కోనంగిపాడు, మగ్గూరు, ఇరువాడలో ఒక్కొక్కరి నుంచి రూ. 20 చొప్పున వసూలు చేశారు. ప్రభుత్వం ఉచితంగా ఇవ్వమని పంపిన రేషన్ సరుకులను స్వాధీనం చేసుకుని వారీ దందాకు పాల్పడ్డారు. అసలే కష్టాల్లో ఉన్న తమను టీడీపీ కార్యకర్తలు డబ్బు కోసం వేధించడంపై బాధితులు మండిపడుతున్నారు. తెలుగు తమ్ముళ్ల ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్ఐ
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వంగర ఎస్ఐ వీరాంజనేయులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ కేసు విషయంలో ఓ వ్యక్తి నుంచి వీరాంజనేయులు 5 వేల రూపాయలను లంచంగా తీసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న ఏసీబీ అధికారులు దాడి చేసి వీరాంజనేయులను అదుపులోకి తీసుకున్నారు. -
జలదిగ్బంధంలో పలు గ్రామాలు
వంగర: ఆదివారం రాత్రి వరకు ఎటువంటి ప్రమాదం ఉండదని భావించిన ఆ గ్రామాలకు సోమవారం వేకువజామున ఐదు గంటలకు ఉలిక్కిపడ్డారు. సువర్ణముఖి, వేగావతి నదుల నీరు చుట్టుముట్టడంతో ఏం చేయాలో పాలుపోలేదు. కళ్లు తెరిచి చూసేసరికి గ్రామాల చుట్టూ నీరు చేరిపోవడంతో ఆందోళన చెందారు. ఇదీ వంగర మండలంలోని కొప్పర, కొండచాకరాపల్లి, గీతనాపల్లి, పాతమరువాడ, ఇరువాడ గ్రామాల దుస్థితి.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తహశీల్దార్ కె.వరప్రసాద్ సమాచారం మేరకు ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 150 మంది సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయా గ్రామాలకు చేరుకున్నాయి. కొప్పర గ్రామం నుంచి గర్భిణి కొనపల బంగారమ్మ, రెండు రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న గుగ్గిలాపు తమ్మమ్మలను బోట్లపై తీసుకువచ్చి ఆస్పత్రులకు తరలించారు. కొప్పర గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు వచ్చేందుకు నిరాకరించడంతో కొండచాకరాపల్లి గ్రామస్తులను ఈ బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడుతున్నారు. ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, తుపాను ప్రత్యేకాధికారి సౌరవ్‌గౌర్ కొప్పర, కొండచాకరాపల్లి గ్రామాలను సందర్శించారు. మడ్డువలస ప్రాజెక్టు వద్ద గేట్లను సకాలంలో ఎత్తకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని సర్పంచ్ కిమిడి సన్యాసినాయుడు ఎస్పీ ఏఎస్ ఖాన్‌కు వివరించారు. మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఇన్నీసుపేట... ఇచ్ఛాపురం: ఇన్నీసుపేట గ్రామం జలదిగ్బంధంలో ఉండిపోయింది. హూదూద్ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు బాహుదా నదిలో నీటి ప్రవాహం పెరిగి దండుగడ్డకు నీరు ఎక్కువగా రావడం, పద్మనాభపురం గెడ్డ పొంగడంతో గ్రామం చుట్టూ నీరు చేరింది. మోకాళ్ల లోతు నీటిలో గెడ్డను దాటుకుంటూ ప్రమాదకరంగా వెళుతున్నారు. ఇదిలా ఉండగా బాహుదా నది ప్రమాదకర స్థాయి లో ప్రవహిస్తోంది. ఒడిశాలోని బోగలోట్టి డ్యాం గేట్లను ఎత్తివేయడంతో ఒక్కసారిగా నీరు నదిలోకి చేరింది. సుమారు 51,270 క్యూసెక్కుల నీరు నదికి చేరింది. దీంతో నదీ పరివాహక గ్రామాలైన బొడ్డబడ, టి.బరంపురం, అరకబద్ర, శాసనం, జగన్నాథపురం తదితర గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. దాంతో రెవెన్యూ అధికారులు హుటాహుటిన డ్యాం వద్దకు సోమవారం వెళ్లి పరిస్థితిని అంచనా వేశారు. టెక్కలి మండలంలో... టెక్కలి: హుదూద్ ప్రభావం వల్ల రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలైన జెండాపేట, సింగుమహంతిపేట, పెద్దరోకళ్లపల్లి, సీతారాంపల్లి, రామనగరం, నాయుడుపేట తదితర గ్రామాలు సోమవారం మధ్యాహ్నానానికి జలదిగ్భంద మయ్యాయి. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఎగువ ప్రాంతాల నుంచి ఒక్క సారిగా వరద నీరంతా గెడ్డల నుంచి రావడంతో ఈ ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పాత నౌపడ దాటిన తరువాత రైల్వే క్రాసింగ్ నుంచి జెండాపేట, సింగుమహంతిపేటతో పాటు పెద్దరోకళ్లపల్లి నుంచి సీతారాంపల్లి, రామనగరం, నాయుడుపేట గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలోకి చేరడంతో ఆయా గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వీరఘట్టం మండలంలో రెండు గ్రామాలు... వీరఘట్టం: స్థానిక ఒడ్డిగెడ్డకు వరదనీరు పొటెత్తడంతో దశుమంతపురం, కంబర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సహాయక చర్యల కోసం స్థానికులు ఎదురు చూస్తున్నారు. స్త్రీశక్తి, బీసీ బాలికల వసతి గృహం చుట్టూ వరద నీరు చేరింది. పెనుగొటివాడను ముట్టడించిన నీరు కొత్తూరు: హుదూద్ తుపాను ప్రభావంతో ఒడిశా-ఆంధ్ర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా వంశధార నదికి సోమవారం వరద నీరు చేరింది. దీంతో మండలంలోని పెనుగొటివాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామంలో సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. మాతల వద్ద పీహెచ్ రోడ్డు మీదుగా వరద నీరు ప్రవహించడంతో కొత్తూరు నుంచి వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. వరద నీరు కారణంగా మండలంలో కుంటిభద్ర, మాతల, పెనుగొటివాడ, ఆకులతంపర, మదనాపురం, వసప, సురుసువాడతో పాటు పలు గ్రామాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. అన్నవరం, అంపిలి, గోపాలపురం... పాలకొండ: నగర పంచాయతీ పరిధి గారమ్మకాలనీ, వడమ కాలనీల్లోకి వరదనీరు చేరింది. అంపిలి, అన్నవరం, గోపాలపురం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తుపాను కారణంగా రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పాలకొండ-సీతంపేట రహదారిలో వాబ గెడ్డ పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వీరఘట్టం, పాలకొండ రహదారిలోనూ గజాలఖానా వద్ద నీరు పొంగిపొర్లడంతో 24 గంటలు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు ఎల్‌ఎన్‌పేట: తుపాను కారణంగా కురిసిన భారీ వర్షానికి మోదుగువలస, బొర్రంపేట, వలసపాడు కాలనీ, చింతలబడవంజ కాలనీ, వాడవలస, మురగడలోవ తదితర గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. కొమనాపల్లిలోకి చేరిన వరదనీరు సారవకోట రూరల్(జలుమూరు): మండలంలోని కొమనాపల్లి గ్రామంలోకి సోమవారం వరద నీరు చేరింది. రంగసాగరంలోకి నీరు ఉద్ధృతంగా రావడంతో ఈ పరిస్థితి ఎదురైందని తహశీల్దార్ ఉమామహేశ్వరరావు తెలిపారు. బీసీ కాలనీలోకి నీరు చేరడంతో గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు చర్యలు తీసుకున్నారు. -
నిధుల తిరుగు టపా!
వంగర: ఎన్నికల సమయంలో ఎన్నో హామీలతో ఊదరగొట్టిన తెలుగుదేశం, అధికారంలోకి వచ్చాక ఆర్థిక సమస్యల పేరుతో కాలక్షేపం చేస్తోంది. ఇప్పుడు అదే వంకతో ప్రభుత్వ శాఖలు, పథకాలు, ప్రాజెక్టుల్లో ఎక్కడ నిధులున్నా వాటిని తిరిగి ప్రభుత్వానికి జమ చేయాలని తాఖీదులు జారీ చేసినట్లు తెలిసిం ది. ఈ నిర్ణయం మడ్డువలస ప్రాజెక్టు నిర్వాసితులకు షాకిచ్చింది. ఈ ప్రాజెక్టు కింద భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం, నిర్వాసిత కాలనీల నిర్మాణానికి గతంలో మంజూరు చేసిన నిధుల్లో సుమారు రూ. 6 కోట్లు ఇంకా ఖర్చు కాలేదు. సర్కారు నిర్ణయం కారణంగా ఇప్పుడు అవి వెనక్కి వెళ్లిపోయినట్లే. ఫలితంగా నిర్వాసితులకు ఇప్పట్లో పరిహారం, సౌకర్యాలు లభించే అవకాశాలు లేనట్లేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మడ్డువలస ప్రాజెక్టు పరిధిలోని ఏడు నిర్వాసిత గ్రామాలకు 2010లో ప్రభుత్వం రూ.27.35 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో గీతనాపల్లి, పటవర్థనం, దేవకివాడ, వీపీఆర్‌పేట, కొత్తపేట, నరేంద్రపురం, నూకలివాడ(బలిజిపేట మండలం) గ్రామాల్లో భూములు, ఇళ్లు,ఖాళీ స్థలాలు, పశువుల శాలలకు నష్టపరిహారంతోపాటు, గ్రామాలను విడిచి వెళ్లే కుటుంబాలకు రవాణా చార్జీలు కూడా భూసేకరణ అధికారులు చెల్లించారు. నష్టపరిహారం చెల్లింపులకు ఇప్పటివరకు రూ. 21.35 కోట్లు వెచ్చిం చారు. రవాణా చార్జీలకు సంబంధించి రూ. 24 లక్షల్లో కొంత మొత్తం ఖర్చు కాగా ఇంకా నిధులు ఉన్నప్పటికీ.. ఎంత మేరకు ఉన్నాయన్నది పాలకొండ ఆర్డీవో కార్యాలయ అధికారులకే తెలుసు. ఇక పునరావాస కాలనీల నిర్మాణంతోపాటు సీసీ రోడ్లు, డ్రైనేజీ లు, తాగునీరు, విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు కేటాయించిన సుమారు 5.70 కోట్లతో ఇంత వరకు ఎటువంటి పనులు చేపట్టలేదు. పటువర్థనం, నూకలి వాడ, గీతనాపల్లి, దేవకివాడ, కొత్తపేట, వీపీఆర్‌పేట గ్రామాల నిర్వాసితుల కు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలు సైతం సేకరించలేదు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల సుమారు రూ.6 కోట్లు ఇంకా ఖర్చు కాలేదు. ఈ తరుణంలో ఖర్చు కాకుండా ఉన్న నిధులను ఆగస్టు 31 నాటికి తమకు జమ చేయాలని భూసేకరణ విభాగం రాష్ట్ర ఫైనాన్స్ విభాగం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. తనకు రావలసిన నష్టపరిహారం ఇంకా అందకపోవడంతో పటువర్థనం గ్రామానికి చెందిన నల్ల కాశినాయుడు అనే నిర్వాసితుడు సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులను వివరాలు కోరగా ఈ విష యం బయటపడింది. ఇప్పట్లో నష్టపరిహారం చెల్లించలేమని, మిగులు నిధులు ప్రభుత్వానికి మళ్లిస్తున్నామని జిల్లా అధికారులు ఆయనకు పంపిన సమాధానంలో పేర్కొన్నారు. దీంతో నష్టపరిహారం ఎప్పుడు అందుతుందో, మౌలిక సౌకర్యాలు ఎప్పటికి కల్పిస్తారోనని నిర్వాసితులు దిగాలు చెందుతున్నారు. -
‘ఏకగ్రీవమే..!
వంగర, న్యూస్‌లైన్: ఉత్కంఠ నెలకొన్నా.. కొట్టిశ మత్స్యకార సొసైటీ ఎన్నిక ప్రశాం తం గా జరిగింది. కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కొసమెరుపు. ఓ వర్గం చివరి నిమిషంలో పోటీ నుంచి విరమించుకుంది.కొట్టిశలోని శ్రీ సీతారామ ఫిషర్మెన్ సొసైటీ ఎన్నిక బుధవారం నిర్వహించారు. ఎన్నికల అధికారి మాచర్ల దివాకరరావు ఆధ్వర్యంలో తొమ్మిది మంది డెరైక్టర్లకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ, ఎన్నిక సాఫీగా సాగిపోయా యి. తొలుత తొమ్మిది స్థానాలకు 18 నామినేషన్లు దాఖలయ్యాయి. వారిలో ఒకరు ఉపసంహరించుకున్నారు. మిగిలిన 17 మందిలో ఒక వర్గానికి చెందిన తొమ్మిది మంది, మరో వర్గానికి చెందిన ఎనిమిది బరిలో నిలిచారు. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఓ వర్గానికి చెందిన ఎనిమిది మంది ఎన్నికల కేంద్రం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో బరిలో నిలిచిన తొమ్మిది మందికి గాను 8 మంది అభ్యర్థులను..చేతులెత్తే పద్ధతిన సభ్యులు ఎన్నుకున్నారు. కాస్త అయోమయం వంగర డెరైక్టర్ ఎన్నిక సమయంలో గ్రామస్తుల మధ్య కొంతసేపు అయోమయం నెలకొంది. తమ పేరేప్రతిపాదించాలంటూ..ఇద్దరు వ్యక్తులు ముందుకు రావడంతో..కాస్త ఇ బ్బందికర పరిస్థితి తలెత్తింది. దీంతో గ్రామస్తులంతా..ఒకే చోట కూర్చుని..అభ్యర్థిని నిర్ణయిం చుకోవడంతో సమస్య పరిష్కార మైంది. అయితే..ఆ డెరైక్టర్ పేరును ఇంకా ఖరారు చేయలేదు. 574 మంది ఓటర్లున్న ఈ సంఘంలో తొలుత ఎన్నికల్లో పాల్గొనేందుకు 329 మంది పేర్లు నమోదు చేసుకోగా..వారిలో 287 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు. నూతన డెరైక్టర్లు వీరే... అధ్యక్షునిగా పెనుబోతు దుర్గారావు ఎన్నికయ్యారు. డెరైక్టర్లుగా మురగడాపు పోలిపల్లిదొర(పటువర్థనం), తాటిగూడ రామారావు(కొట్టిశ), పిల్లి సంజీవి(మరువాడ), బొండపల్లి సింహాచలం(గీతనాపల్లి), గుడివాడ సూరందొర(శ్రీహరిపురం) వంటల భూపతిదొర(కొండచాకరాపల్లి), సూరుమల్లి గురువులు(మగ్గూరు)లను ఏకగ్రీవంగా చేతులెత్తే పద్ధతి ద్వారా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది గోపీకృష్ణ, శాంతారావు, నాగరాజు, రాజాం, కొత్తూరు సీఐలు శ్రీనివాస చక్రవర్తి, ఎన్.సాయి, వంగర, సంతకవిటి, జి.సిగడాం ఎస్సైలు అప్పలరాజు, భీమారావు, తులసీరావులతోపాటు వివిధ పోలీస్ స్టేషన్లుకు చెందిన 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఫొటో: 11 ఆర్‌జెయం 61 చేతులెత్తి డెరైక్టర్లు,అధ్యక్షుడిని ఎన్నుకుంటున్న మత్స్యకార సంఘ సభ్యులు ఫొటో: 11 ఆర్‌జెయం 61(ఎ)(బి): పోలింగ్ కేంద్రం వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఫొటో: 11 ఆర్‌జెయం 61(సి) పెనుబోతు దుర్గారావు -
ఆన్లైన్ అవస్థలు
వంగర, న్యూస్‌లైన్: వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. కానీ అవి కంప్యూటర్లో కనిపించవు. కనిపించకపోవడానికి కార ణం.. రెవెన్యూ అధికారులు వాటిని ఆన్లైన్ చేయకపోవడ మే. ఆన్లైన్లో నమోదు కానిదే బ్యాంకు రుణాలు, ఇతరత్రా ప్రభుత్వ రాయితీలు అందవు. వంగర మండలం కొప్పర పంచాయతీ కె.కొత్తవలస గ్రామానికి చెందిన 104 మంది రైతులు ఇదే దుస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ విభాగాలన్నింటిలోనూ కంప్యూటరీకరణ జోరుగా సాగుతోంది. అందులో భాగంగా రైతుల భూముల వివరాలు కూడా కంప్యూటరీకరిస్తున్నారు. ఈ పని అరకొరగా జరగడంతో రైతులు కష్టనష్టాలకు గురవుతున్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం కె.కొత్తవలసే. ఈ గ్రామంలో 255 మంది రైతులకు పల్లం, మెట్టు కలిపి 900 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవ న్నీ తోటపల్లి కుడికాలువ పరిధిలో ఉన్నాయి. వీటికి భూమి శిస్తు కూడా చెల్లిస్తున్నారు. ఆఫ్‌లైన్ అడంగల్, రెవెన్యూ రికార్డు-01, రెవెన్యూ రికార్డు-04లలోనూ నమోదయ్యాయి. కానీ వీరిలో 205 మందికే పట్టాదారు పాసుపుస్తకాలున్నా యి. ఇదిలా ఉండగా గత ఏడాది మండలంలోని అన్ని గ్రామాలు, బౌండరీల వారీగా పట్టాదారు పాసుపుస్తకాలు, ఇతర రికార్డుల ఆధారంగా భూముల వివరాలను కంప్యూట రీకరించారు.కె.కొత్తవలసను మాత్రం విస్మరించారు. దాంతో కంప్యూటరీకరణ గురించి తెలుసుకున్న, దానిపై అవగాహన ఉన్న 151 మంది రైతులు నేరుగా కార్యాలయానికి వెళ్లి తమ భూములను కంప్యూటరీకరించుకున్నారు. 54 మంది రైతుల వివరాలు ఆన్లైన్ కాలేదు. మరో 50 మందికి పాసుపుస్తకాలే మంజూరు చేయలేదు. మొత్తం మీద గ్రామానికి చెందిన 350 ఎకరాల భూములు ఆన్లైన్ కాగా, మిగిలిన 550 ఎకరాల భూములు ఆఫ్‌లైన్‌లోనే ఉండిపోయాయి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం రైతుల భూములన్నింటినీ కంప్యూటరీకరించాలని ప్రభుత్వం గత ఏడాది స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా అయితే అధికారులు అలసత్వం వహిస్తున్నారు. రైతుల వద్ద ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాలను పరిశీలించి, వారి భూముల వివరాలను కంప్యూటరీకరించాలి. అది పూర్తి అయిన తర్వాత మీ సేవ కేంద్రాల ద్వారా కంప్యూటర్ అడంగల్ తీసుకోవాలి. అది ఉంటే తప్ప రుణాలు మంజూరు కావు. ఇతర ప్రభుత్వ రాయితీలకు దరఖాస్తు చేసుకోలేరు. అయితే కె.కొత్తవల సలో రైతుల పాసుపుస్తకాలనే అధికారులు పరిశీలించలేదు. నేరుగా వెళ్లి ఆన్లైన్ చేయించుకున్న రైతులకు తప్ప మిగతా వారికి కంప్యూటర్ అడంగల్ కాపీలు లభించడం లేదు. రుణ సౌకర్యానికి నోచుకోని రైతులు తమ భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు కాకపోవడం తో 54 మంది రైతులు రుణ సౌకర్యానికి దూరమయ్యారు. అర్హులైన రైతులందరికీ రుణాలు ఇవ్వాలని అటు ప్రభుత్వం, ఇటు కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలు ఇక్కడ అమలు కావడం లేదు. గత ఏడాది ఈ రైతులంతా రుణాలకు అర్హత కోల్పోయారు. కొన్నేళ్లుగా పంట రుణాలు తీసుకున్న రైతులు వాటి ని రెన్యూవల్ చేసుకోలేక అవస్థలు పడుతున్నారు. రెన్యూవల్‌కు సైతం కంప్యూటర్ అడంగల్ అవసరం కావడంతో గత రెండేళ్లుగా పంట రుణాలు రెన్యూవల్ చేసుకోలేక అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన సున్నా వడ్డీ రాయితీ కూడా వీరికి వర్తించడం లేదు. 50 మంది రైతులకు పాసుపుస్తకాలే లేవు గ్రామంలో 50 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు లేవు. వంశపారంపర్య ఆస్తిగా సంక్రమించే భూముల యజమాని మరణిస్తే, ఆ భూములను వారి వారసుల పేరిట మార్చి కొత్త పాసుపుస్తకాలు మంజూరు చేయాల్సి ఉంది. దశాబ్దాల తరబడి ఈ గ్రామంలో ఆ పరిస్థితి లేదు. నమోదు కాని సర్వే నెంబర్లు కొప్పర బౌండరీ పరిధిలో కంప్యూటరీకరణకు నోచుకోని భూముల సర్వే నెంబర్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ గ్రామానికి చెందిన 77, 113, 76, 301, 111, 10, 25 తదితర సర్వే నెంబర్ల పరిధిలో అధిక సంఖ్యలో రైతులకు చెందిన భూములు కంప్యూటరీకరించలేదు. కాగా కె.కొత్తవలస గ్రామానికి చెందిన కొంత మేర పంట భూములు మద్దివలస, కొండచాకరాపల్లి బౌండరీల్లో ఉన్నాయి. ఆయా గ్రామాల్లో సుమారు 27 మంది రైతులుండగా వారిలో 10 మంది వివరాలే ఆన్లైన్లో నమోదయ్యాయి. కొండచాకరాపల్లిలో 10, మద్దివలసలో ఏడుగురు రైతులకు సంబంధించి భూములు ఆన్లైన్ కాకపోవడం సమస్యగా మారింది. ఏడాదిన్నర నుంచి వీఆర్వో లేరు సుమారు ఏడాదిన్నర నుంచి ఈ గ్రామ వీఆర్వో పోస్టు ఖాళీగా ఉంది. మిగిలిన అధికారులైనా ఇక్కడి సమస్యలపై దృష్టి సారించడం లేదు. దీంతో రైతులు ప్రతిదానికీ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. ఈ ఏడాది మేలో ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఈ గ్రామం నుంచి 60 ఫిర్యాదులు అందాయి. తమ భూములను కంప్యూటరీకరించాలని, రికార్డుల్లో తప్పులు సరిచేయాలని, వారసత్వంగా అనుభవిస్తున్న భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని, కొత్తగా కొనుగోలు చేసిన భూములను కంప్యూటరీకరించాలని అర్జీలు పెట్టుకున్నా ఇంత వరకు ఒక్కటీ పరిష్కారానికి నోచుకోలేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా.. తమ సమస్యలపై రైతులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం కనిపించలేదు. కలెక్టర్ గ్రీవెన్స్‌లోనూ, పాలకొండ ఆర్డీవోకు ఫిర్యా దు చేశారు. దీంతో సమస్య తెలుసుకునేం దుకు ఓ అధికా రి వచ్చి రైతుల వద్ద ఉన్న పాసుపుస్తకాలు చూసి వెళ్లిపోయారు. సమ స్య మాత్రం పరిష్కారం కాలేదు.