ఎం.సీతారాంపురం గ్రామానికి చెందిన వివాహిత జాడ రమణమ్మ పురుగులు మందు తాగి బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
వంగర : ఎం.సీతారాంపురం గ్రామానికి చెందిన వివాహిత జాడ రమణమ్మ పురుగులు మందు తాగి బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నాలుగేళ్ల కిందట కొమరాడ మండల కేంద్రానికి చెందిన జాడ నందీశ్వరరావుతో వివాహం జరిగింది. అప్పటి నుంచి భర్తతో పాటు అత్తింటి వేధింపులు అధికమయ్యాయని అపస్మారక స్థితిలో ఉన్న రమణమ్మ పోలీసులకు వివరించినట్లు తల్లి అల్లక సరోజినమ్మ, సోదరుడు అల్లక శ్రీను విలేకరులకు తెలిపారు.
నిరుపేద కుటుంబానికి చెందిన మాకు అత్తింటి వారు అదనపు కట్నం తెమ్మంటున్నారని, లేకపోతే అత్తింటికి భర్త తీసుకువెళ్లమని చెబుతున్నారని, తమకు న్యాయం చేయాలని చావుబతుకుల్లో ఉన్న రమణమ్మ, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ మేరకు వంగర పోలీసులు రాజాం సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న రమణమ్మ వద్ద నుంచి వాంగ్మూలం స్వీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వై.మధుసూదనరావు తెలిపారు.