![Bandi Sanjay Convoy Attacked With Eggs In Warangal - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/28/Bandi-Sanjay-Convoy-Attacked.jpg.webp?itok=BJ_4YNsy)
సాక్షి, వరంగల్: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బండి సంజయ్‌లో వరంగల్ పర్యటన సంద్భంగా ఆయన కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో, బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
వివరాల ప్రకారం.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో భాగంగా నేడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో భీమదేవరపల్లి మండలంలోని వంగర వద్దకు చేరుకోగానే సంజయ్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు గుడ్లతో దాడికి చేశారు. కాగా, ఈ దాడులకు పాల్పడిందని కాంగ్రెస్ కార్యకర్తలేనని బండి సంజయ్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, గుడ్ల దాడి నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో అక్కడికిచ చేరుకున్నారు. గుడ్లు విసిరిన వారి గుర్తించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment