
సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి దరఖాస్తు చేసిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గాలకు చెందిన విద్యార్థులు/తల్లిదండ్రులకు ఈ నెల 28, 29 తేదీల్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. భారత్‌లో ఉన్న విద్యార్థులకు ఈ నెల 28న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
చదవండి: విజయవాడ మీదుగా 100 ప్రత్యేక రైళ్లు
ఈ ఏడాది ఆగస్టు తర్వాత విదేశాలకు వెళ్లిన విద్యార్థులను ఈ పథకం కింద ఎంపిక చేసేందుకు వారి తల్లిదండ్రులకు 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది. దరఖాస్తు చేసిన విద్యార్థులు తమ విద్యార్హతలు, ఇతర ఒరిజనల్ సర్టిఫికెట్లు, అటెస్ట్ చేసిన జిరాక్స్ కాపీలతో తాడేపల్లిలోని రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment