ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ (APNRTS) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో, ఏపీఎన్ఆర్టీఎస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు అనేక సేవలను అందిస్తోంది. ఇందులో ఒకటి ముఖ్యమైన ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం. విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న ఏపీ విద్యార్థులు, విదేశాల్లో పనిచేసే వారు ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమాలో నమోదు చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పూర్తీగా ఉచితంగా బీమాలో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశం 15 జనవరి 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జనవరి 15 తర్వాత బీమా ప్రీమియం పెరిగి, ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉన్నందున వెంటనే నమోదు చేసుకోగలరు. (ఇంతకుముందు సంవత్సరానికి రూ.180 ల ప్రీమియంగా ఉండేది).
లక్షలు ఖర్చుపెట్టి తల్లిదండ్రులు వారి పిల్లలను విదేశీ విద్యకు పంపుతున్నారు. అలా వెళ్ళిన ఎంతో మంది విద్యార్థులకు మరియు వారి కుటుంబానికి ఈ పథకం ఒక భరోసా. ఈ మధ్యకాలంలో మనం పత్రికల్లో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాము... విద్యార్థులు సరదాగా బయటకు వెళ్లినప్పుడు, విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ప్రమాదాలకు గురవ్వడం అత్యంత బాధాకరం. ఈ బీమా లో నమోదు చేసుకోవడం వలన హఠాత్తుగా అనుకోని పరిణామాలు జరిగినప్పుడు వారి కుటుంబానికి ఇది ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది.
విద్యార్థులు, లేదంటే వారి తరఫున వారి పేరు మీద తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా ప్రవాసాంధ్ర భరోసా బీమా లో ఉచితంగా నమోదు చేసుకోమని ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి కోరారు. ఈ పథకం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.
ఈ బీమా వలన ముఖ్య ప్రయోజనాలు
► బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వలన మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ. 10 లక్షల ఆర్థిక సహాయం
► ప్రమాదం వలన సంభవించే గాయాలు, అనారోగ్యం చికిత్సకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు రూ. 1లక్ష వరకు చెల్లింపు
► ప్రమాదం/అస్వస్థతకు గురై చదువు కొనసాగించడానికి అనర్హుడిగా గుర్తించినట్లైతే, స్వదేశం వచ్చేందుకు సాధారణ తరగతి విమాన ఛార్జీల చెల్లింపు ... ఇవే కాకుండా మరెన్నో ప్రయోజనాలు
ప్రవాసాంధ్ర భరోసా బీమా నందు నమోదు కొరకు APNRTS 24/7 హెల్ప్‌లైన్ +91-863-2340678; +91 85000 27678 (వాట్సప్) ను సంప్రదించండి మరియు వెబ్ సైట్-బీమా పేజి https://www.apnrts.ap.gov.in/index.php/home/insurance_new లో లాగిన్ అవ్వండి. లేదా insurance@apnrts.com; helpline@apnrts.com కు ఇమెయిల్ చేయండి.
ఏపీఎన్ఆర్టీఎస్ అందించే వివిధ సేవలు, అప్డేట్స్ కొరకు https://www.apnrts.ap.gov.in/ ని సందర్శించండి.
Comments
Please login to add a commentAdd a comment