వరంగల్ జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్ శాఖ అధికారి లంచం తీసుకుంటూ సోమవారం రాత్రి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
హన్మకొండ: వరంగల్ జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్ శాఖ అధికారి లంచం తీసుకుంటూ సోమవారం రాత్రి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తాడ్వాయి పంచాయతీ రాజ్ ఏఈగా పనిచేస్తున్న కృష్ణ ఓ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి రూ.40వేలు లంచం డిమాండ్ చేశారు.
దీంతో కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డి ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి హన్మకొండలోని ఏఈ నివాసం సమయంలో కాంట్రాక్టర్ నుంచి ఏఈ కృష్ణ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.