7 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
విశాఖపట్నం: బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు కిలోల బంగారాన్ని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన వీరు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో దొరికిపోయారు. అదుపులోకి తీసుకున్న వారి పేర్లను అధికారులు వెల్లడించలేదు.