కాల్పుల ఘటన: నలుగురు అనుమానితుల అరెస్ట్ | gun fire: shooting suspects cought in ananthapur district | Sakshi
Sakshi News home page

కాల్పుల ఘటన: నలుగురు అనుమానితుల అరెస్ట్

Published Thu, Sep 17 2015 9:09 AM | Last Updated on Tue, Aug 21 2018 3:16 PM

కాల్పుల ఘటన: నలుగురు అనుమానితుల అరెస్ట్ - Sakshi

కాల్పుల ఘటన: నలుగురు అనుమానితుల అరెస్ట్

అనంతపురం: ధర్మవరం హైవేపై నిన్న జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కారులో ప్రయాణిస్తున్న వీరిని ఏపీ, కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు దోపీడీలకు పాల్పడే ముఠాకు చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు.

వివరాలు..జిల్లాలోని ధర్మవరం మండలం సీతారామపురం వద్ద బుధవారం తెల్లవారుజామున ఎన్ హెచ్ 44పై కారులో వచ్చిన ఓ వ్యక్తి ఓ లారీడ్రైవర్పై కాల్పులు జరిపాడు. కర్ణాటక రాష్ట్రం బిజాపూర్‌కు చెందిన లారీ బెంగుళూరు నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. లారీ పక్క నుంచి ఇండికా కారులో వచ్చిన దుండగులు కారులో నుంచే డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. లారీ డ్రైవర్ సురేష్ డొక్కలో ఆరు బుల్లెట్లు దూసుకుపోయాయి. బుల్లెట్ల దెబ్బకు సురేష్ పక్కకు ఒరిగిపోవడంతో క్లీనర్ లారీని సమయస్ఫూరితో ఆపేశాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రుని స్థానిక ఆస్పత్రికి తరలించారు.  డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement