విద్యుత్ శాఖ డోన్ ఆపరేషన్స్ డివిజన్‌లోని బనగానపల్లె రూరల్ ఏఈగా పనిచేస్తున్న పుల్లయ్యపై సస్పెన్షన వేటు పడినట్లు తెలిసింది.
బనగానపల్లె ఏఈ సస్పన్షన్?
Published Wed, Feb 1 2017 11:41 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ శాఖ డోన్ ఆపరేషన్స్ డివిజన్‌లోని బనగానపల్లె రూరల్ ఏఈగా పనిచేస్తున్న పుల్లయ్యపై సస్పెన్షన వేటు పడినట్లు తెలిసింది. కమర్షియల్ మీటర్లు అమర్చడంలో అవకతవకలు జరిగిన కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కమర్షియల్ టవర్ కనెక్షన్‌కు సీటీ మీటర్‌కు బదులు సాధారణ మీటర్‌ను ఏర్పాటు చేయడంతో సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని ఇటీవలే డీపీఈ(విజిలెన్స్ స్క్వాడ్) విభాగం అధికారలు తనిఖీలు నిర్వహించడంతో వెలుగులోకి వచ్చింది. గత రెండున్నరేళ్ల నుంచి నెలవారీ బిల్లింగ్ అయిన యూనిట్ల వివరాలు బయటకు తీయడంతో లక్షల యూనిట్లు సంస్థ నష్టపోయినట్లు సమాచారం. ఈ కారణంగా డీపీఈ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏఈ పుల్లయ్యపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఏఈకి ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదని ఎస్‌ఈ భార్గవ రాముడు తెలిపారు.
Advertisement
Advertisement