విద్యుత్ శాఖ ఏపీ ఎస్‌పీడీసీఎల్ కర్నూలు రూరల్ ఏఈ నాగేంద్రప్రసాద్‌ను విధుల నుంచి తొలగిస్తు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ శాఖ ఏపీ ఎస్‌పీడీసీఎల్ కర్నూలు రూరల్ ఏఈ నాగేంద్రప్రసాద్‌ను విధుల నుంచి తొలగిస్తు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో ఆయన పని చేసిన బీ రోడ్డు సెక‌్షన్‌లో ఉపయోగించిన సామగ్రి, మంజూరైన పనుల వివరాలను పూర్తి స్థాయిలో సంస్థకు తెలుపలేదు. అలాగే ప్రస్తుత ఏఈ చలపతికి సెక‌్షన్ అప్పగించలేదు. ఈ కారణాలతో నాగేంద్రప్రసాద్‌ను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ఆపరేషన్స్ ఎస్‌ఈ జి. భార్గవరాముడు పేర్కొన్నారు.