వైఎస్సార్ జిల్లాలో దౌర్జన్యం
బద్వేలు అర్బన్: వైఎస్సార్ జిల్లా బద్వేలు మండల ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ జి.ప్రసాద్‌పై టీడీపీకి చెందిన ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, అతడి అనుచరులు గురువారం దాడి చేశారు. కార్యాలయంలోని కుర్చీ లు, కం ప్యూటర్‌ను ధ్వర సం చేశారు. అడ్డుకోబోయిన డీఈని కూడా తీవ్ర పదజాలంతో దూషించినట్లు తెలిసింది. తాగునీటిఎద్దడి నివారణకు పంచాయతీల ఆమోదం తో ట్యాంకర్లను ఏఈ ఏర్పాటు చేశారు. అయితే, ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి తాను చెప్పినవారికే ట్యాంకర్లు కేటాయించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో గురువారం ఎంపీపీ, అతని సోదరుడు సుబ్బారెడ్డి, రాజుపాళెం నేత తిరుపతిరెడ్డి, జి.చంద్రశేఖర్‌రెడ్డిలతోపాటు మరో పది మంది ఏఈతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్ప డ్డారు. ఏఈల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసు లు నిందితులపై కేసు నమోదు చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ప్రసాద్‌పై టీడీపీ నేతల దాడిని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే తిరువీధి జయరాములు తీవ్రంగా ఖండించారు.