ఏసీబీ వలలో అచ్యుతాపురం విద్యుత్‌శాఖ ఏఈ రంగారావు చిక్కాడు.
అచ్యుతాపురం(విశాఖపట్నం జిల్లా): ఏసీబీ వలలో అచ్యుతాపురం విద్యుత్‌శాఖ ఏఈ రంగారావు చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈని, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెదురువాడ గ్రామానికి చెందిన రవివర్మకు ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయడానికి రంగారావు రూ.50 వేలు లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం వలపన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.