విద్యుత్‌శాఖకు రావాల్సింది రూ.176.89 కోట్లు
సాక్షి, మహబూబ్‌నగర్: ‘గడువులోపు మీ విద్యుత్ బిల్లులు చెల్లించండి.. లేకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మీ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. మళ్లీ విద్యుత్ సరఫరా తిరిగి పొందాలంటే బిల్లుతో పాటు ఫెనాల్టీ చెల్లించాలి. అంతేకాదు.. రీ కనెక్షన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది’ అంటూ ప్రతి నెలా ట్రాన్స్‌కో సిబ్బంది మైకులతో ఊదరగొడుతుంటారు.
అన్నట్టుగానే గడువు దాటిన వెంటనే విద్యుత్ కనెక్షన్ తీసేస్తారు. దీనిని చూస్తే మన ట్రాన్స్‌కో అధికారులు ఎంత బాగా బిల్లులు వసూలు చేస్తున్నారో అనుకుంటున్నారు కదూ.. ఈ ప్రతాపమంతా సామాన్యులపైనే. కొన్ని సంస్థలు కోట్ల రూపాయల్లో బిల్లులు బకాయిలున్నా వారి జోలికిమాత్రం వెల్లడం లేదు. జిల్లాలో ప్రభుత్వరంగ సంస్థలు రూ. 177.89 కోట్లు బకాయి పడి ఉన్నాయి. కానీ, వారినుంచి ఆ డబ్బులు వసూలే చేయడంలో ట్రాన్స్‌కో అధికారులు చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి యేడాది 8కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉండగా. కేవలం కోటి రూపాయలు మాత్రమే వసూలు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
ప్రభుత్వానికి నోటీసులు పంపించాం : సదాశివరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ
ప్రభుత్వ కార్యాలయాల నుంచి ట్రాన్స్‌కోకు ప్రతినెలా రూ.8 కోట్లు రావాల్సి ఉంది. కానీ, రూ. కోటిమాత్రమే వస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీ, పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల నుంచి బకాయిలు భారీగా పేరుకుపోయాయి. అడిగితే బడ్జెట్ లేదంటున్నారు. వారిని హెచ్చరించడానికి అప్పుడప్పుడు లైట్లు బంద్‌చేస్తున్నాం, అంతకుమించి ఏం చేయలేకపోతున్నాం. బకాయిలకు సంబంధించి ప్రభుత్వానికి కూడా నోటీసులు పంపించాం’’
బకాయిల షాక్
Published Fri, Sep 26 2014 3:03 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement