పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెం మండలంలోని కడకట్ల రెల్లికాలనీకి విద్యుత్ శాఖ అధికారులు గురువారం రాత్రి కరెంటు సరఫరా నిలిపేశారు. తమ నివాసాలను ఖాళీ చేయించేందుకే కరెంటు నిలిపివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 12 సంవత్సరాల నుంచి మున్సిపల్ అధికారులు వీరిళ్లకు వచ్చే విద్యుత్ బిల్లులను చెల్లిస్తున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా వీరి ఇళ్లను ఖాళీ చేయించేందుకు ముందుగా కరెంటు నిలిపివేసినట్లు తెలుస్తోంది. తమకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు చూపించకుండా ఇలాంటి చర్యలకు దిగితే తాము పసిబిడ్డలతో ఎటువెళ్లాలని బాధితులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.
(తాడేపల్లిగూడెం)